Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- పారుకు మాలిని ఉంగరం- శివ నారాయణ ముందు పడిన రింగ్- గుర్తు పట్టిన సూరజ్

Karthika Deepam 2 Serial July 25th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 25వ ఎపిసోడ్‌‌లో మాలిని సగం ఆస్తి ఆఫర్‌ను రెజెక్ట్ చేసి వెళ్తుంది జ్యోత్స్న. పారిజాతంకు మాలిని ఉంగరం గిఫ్ట్‌గా ఇస్తుంది. పారు మెడొప్పి పోతుంది. ఇంట్లో జ్యోత్స్న పారు ఎక్కడికెళ్లారో చెప్పాలని శివ నారాయణ పంచాయితీ పెడతాడు.

Published on: Jul 25, 2026, 07:47:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఓకే చెబితే తన ఆస్తిలో సగం ఆస్తి ఇస్తానని ఆఫర్ ఇస్తుంది మాలిని. అది రెజెక్ట్ చేసిన జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంకోసారి నా పెళ్లి గురించి, నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వెళ్తుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 25 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 25 ఎపిసోడ్

పారిజాతంకు మాలిని ఉంగరం గిఫ్ట్

కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేటప్పుడు కింద బంగారు ఉంగరం కనిపించడంతో కిందకు వంగుతుంది పారిజాతం. దాంతో మెడపట్టి ఊడిపోయి నొప్పి పోతుంది. మాలిని నీ ఉంగరం నా మెడనొప్పిని తగ్గించింది అని సంతోషంగా చెబుతుంది పారిజాతం. ఆ ఉంగరాన్ని పారిజాతంనే ఉంచుకోమంటుంది మాలిని. చాలా విలువ ఉంటుందనుకుంటా అని పారు అంటుంది.

అడగ్గానే నా మేనకోడలిని తీసుకొచ్చావ్. నా గుర్తుగా ఈ ఉంగరం నీ దగ్గరే ఉంచుకో అని మాలిని అంటుంది. నేను ఇలాంటివాటికోసం రాలేదు. నువ్ అడగ్గానే పాత పరిచయం గుర్తొచ్చి కాదనలేక తీసుకొచ్చానని అంటుంది పారు. మన మధ్య స్నేహం ఇలాగే ఉండాలి. నీ దగ్గరే ఉంచుకో ఉంగరం అని మాలిని అంటుంది. సరేనని పారు అంటుంది.

ఇంతకీ జ్యోత్స్న మనసులో ఉన్నది ఎవరని మాలిని అడిగితే.. దాని శత్రువు మొగుడు అని ఇన్‌డైరెక్ట్‌గా కార్తీక్ అని హింట్ ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం. నీతో ఆడుకోడానికి నాకో అవకాశం దొరికింది శివ నారాయణ అని మాలిని అనుకుంటుంది. మరోవైపు కాంచన తింటుంటే పొలమారుతుంది. శ్రీధర్‌ రావడం గుర్తు చేసుకుంటుంది.

ఏడిపించిన శ్రీధర్

అంతలోనే భోజనం నీకేనా నాకు లేదా అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఆనందంలో ఏవండి అని లేస్తుంది కాంచన. కానీ కుర్చీలో పడిపోతుంది. శ్రీధర్ వచ్చి పట్టుకుంటాడు. నువ్వు లేవలేవు. నువ్వు నాకోసం ఎంతలా ఎదురుచూస్తున్నావో అర్థమైందని శ్రీధర్ అంటాడు. శ్రీధర్ ఆరోగ్యం, క్షేమాసమాచారాలు అడుగుతుంది. ఆకలేస్తుంది అన్నం పెట్టమని శ్రీధర్ అంటాడు.

ప్లేట్‌లో పెడితే చేతిలో ముద్దలు కలిపి పెడితే తినాలని ఉందని శ్రీధర్ అంటాడు. కాంచన ఆలోచిస్తుంది. నీకోసం నేను మళ్లీ పుట్టాను. ఈ అభిమానానికి ఒక్క ముద్ద పెడతావా అని దీనగా అడుగుతాడు శ్రీధర్. దాంతో కాంచన ముద్ద కలిపి పెడుతుంది. ఇది ముద్ద కాదు మెడిసిన్. రోజు నాలుగు ముద్దలు తిన్నానంటే నా గుండె ఆగకుండా పరిగెత్తుతుందని శ్రీధర్ అంటాడు.

ముద్ద నోట్లోకి వెళ్తుంటే ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోసినట్లు ఉందని చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతాడు శ్రీధర్. కాంచన కూడా ఏడుస్తుంది. శ్రీధర్‌కు కాంచన ముద్దలు కలిపి పెడుతుంది. కాంచన కూడా తింటుంది. కార్తీక్‌కు తాను వచ్చినట్లు చెప్పొద్దని, సర్‌ప్రైజ్ చేద్దామని అంటాడు శ్రీధర్. భోజనం చేసిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చా అని శ్రీధర్ అడుగుతాడు.

రెండింటికి లింక్

ఇది మీ ఇల్లు అని సరేనంటుంది కాంచన. జ్యోత్స్న పెళ్లి గురించి అడుగుతాడు శ్రీధర్. మరోవైపు ఆఫీస్‌లో దీప, కార్తీక్, సూరజ్ జ్యోత్స్న కోసం ఎదురుచూస్తుంటారు. జ్యో వస్తుంది. ఎక్కడికి వెళ్లావ్, ఫోన్ ఎందుకు పెట్టి వెళ్లావ్ అని దీప నిలుస్తుంది. ఫోన్ మర్చిపోయానంటుంది. ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. ఇంట్లో పారు మిస్సింగ్, ఆఫీస్‌లో నువ్వు మిస్, పారు ఫోన్ స్విచాఫ్ పెట్టింది, నువ్వు ఇక్కడే పెట్టావ్. రెండింటికి లింక్ ఉందా అని కార్తీక్ అంటాడు.

ఫోన్ లాక్ తీసివ్వు పారు నుంచి కాల్ వచ్చింది లేదా అనేది తెలుస్తుందని కార్తీక్ అంటాడు. కాల్ హిస్టరీలు ఉంచాతారా ఏంటీ, ఎప్పుడో డిలీట్ చేసి ఉంటారని సూరజ్ అంటాడు. నాకు బాగా హెడెక్‌గా ఉంటే ట్యాబ్లెట్ తీసుకునెందుకు వెళ్లానని జ్యోత్స్న అంటుంది. సూరజ్ గుచ్చి గుచ్చి అడుగుతాడు. నా దగ్గర పని చేసేటప్పుడు నాదేగా బాధ్యత, ఎక్కడికెళ్లిన నాకు చెప్పే వెళ్లాలని దీప అంటుంది.

మాలిని అన్న మాటలు తలుచుకుని సరేనని అంటుంది జ్యోత్స్న. ఇది నమ్మేలా ఉందా అని కార్తీక్ అంటే లేదని సూరజ్ అంటాడు. మనం నమ్మిన ఛైర్మన్ గారు నమ్ముతారా. ఎందుంకంటే ఆయనకు నిజం తెలిసిపోయింది అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. రాగానే ఇంటికి తీసుకురమ్మన్నారని కార్తీక్ అంటాడు.

పారుకోసం వెయిటింగ్

ఇంట్లో శివ నారాయణతో అంతా ఉంటారు. మేడ పట్టి ఊపుకుంటూ పారిజాతం వస్తుంది. ఆఫీస్ నుంచి నీకోసమే వచ్చాను అని శివ నారాయణ అంటాడు. నాకో విషయం తెలిసింది నువ్వు జ్యోత్స్నను ఎక్కడికి తీసుకెళ్లావో తెలిసింది. జ్యోత్స్న చెప్పిందే నువ్వు చెబుతావా అని శివ నారాయణ అంటాడు. ఇదేం చెప్పిందో అని పారిజాతం భయపడుతుంది.

చైర్మన్ గారు మీకోసం అరగంట నుంచి ఎదురుచూస్తున్నారని సూరజ్ అంటాడు. తప్పదు నిజం చెబుతాను అని నేను అని పారిజాతం అంటుంటే.. చెప్పలేదని జ్యోత్స్న తల ఊపుతుంది. అది చూసి రివర్స్ అవుతుంది. జ్యోత్స్నకు నాకు సంబంధం ఏంటీ. నా మెడపట్టి చేతిలో ఉంది. అరే నీ మెడనొప్పి తగ్గిపోయిందని ఎవరైనా అడిగారా అని పారిజాతం అంటుంది.

నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాను. జ్యోత్స్నను నేనెందుకు తీసుకెళ్లాను అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో నీకు తెలియదు అని శివ నారాయణ అడిగితే.. తెలియదు తెలియదు అని అరుస్తుంది. ఇంతలో పారిజాతం నుంచి మాలిని ఇచ్చిన ఉంగరం కిందపడుతుంది. ఇది రోడ్ గోల్డ్ ఉంగరం, ఇలాంటివి ఐదు పది ఉన్నాయని పారిజాతం అంటుంది.

గుర్తుపట్టిన సూరజ్

అది మాలిని ఉంగరం అని సూరజ్ గుర్తుపడతాడు. మాలిని ఉంగరం ఇచ్చిన సంగతి నాకు చెప్పలేదని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాను, జ్యోత్స్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిందని పారిజాతం అంటుంది. అలా జ్యోత్స్న చెప్పలేదే అని కార్తీక్ అంటాడు. ఫ్రెండ్ దగ్గరికి ఓకే ఆ ఫ్రెండ్ ఎవరు అని సూరజ్ అంటాడు.

నువ్వెందుకు ఆరాలు తీస్తున్నావురా అని పారిజాతం అంటుంది. ఎవరు అడిగిన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే జ్యోత్స్న చెప్పింది అబద్ధం కాబట్టి అని అది ఎందుకో వివరిస్తాడు సూరజ్. మా ఫ్యామిలీ గురించి నీకెందుకురా అని పారు అంటే.. ఇది ఆఫీస్ మ్యాటర్. జ్యోత్స్న గారు వెళ్లడంపై నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో అని ఛైర్మన్ గారు నన్ను అన్నారని సూరజ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More