Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలిని ఇంటికి జ్యోత్స్న- సగం ఆస్తి ఆఫర్- ఎవరి పోలిక రాలేదేంటన్న మేనత్త

Karthika Deepam 2 Serial July 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 24వ ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో జ్యోత్స్నకు సూరజ్ సైట్ కొడతాడు. ఇంతలో పారిజాతం కాల్ చేసి జ్యోని పిలుస్తుంది. ఇద్దరు మాలిని ఇంటికి వెళ్తారు. అక్కడ జ్యోత్స్న రెచ్చిపోతుంది. జ్యో కనిపించకపోవడంతో పారు గురించి తెలుసుకుంటాడు శివ నారాయణ.

Published on: Jul 24, 2026, 07:50:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇచ్చిన రూపాయిని చూస్తూ ఉంటుంది మాలిని. కాంచన ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని మాలినిని నిలదీస్తాడు దక్షిణామూర్తి. కార్తీక్, దీప మిమ్మల్ని కాపాడారు. వారికి ఏదైనా సాయం చేద్దామనుకున్నాను అని మాలిని అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 24 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 24 ఎపిసోడ్

మనం దీన్ని మార్చాలి

సాయం అంటే అని దక్షిణామూర్తి అడుగుతాడు. నేను ఊహించినదానికంటే పేదరికంలో ఉన్నారు. అందుకే డబ్బులు ఇస్తే తీసుకోరని చెక్ ఇచ్చాను. ఇప్పటికీ ఆ అమాయకులు బాబాయ్‌నే నమ్ముతున్నారు. దీన్ని మనం మార్చాలి, ఏదోటి ప్రయత్నం చేయాలని మాలిని అంటుంది. నా కూతురే నమ్ముతుంది. నీ మంచితనం వాళ్లకు అర్థం కాదు అని దక్షిణామూర్తి అంటాడు.

నేను అలసిపోయాను. నా కూతురు గురించి తప్పా ఇంకెవరి గురించి ఆలోచించాలని అనుకోవట్లేదని, నన్ను ఆశ మాత్రమే బతికిస్తుందని దక్షిణామూర్తి అంటాడు. ఆశ మాత్రమే కాదు పగ, ప్రతీకారం కూడా బతికిస్తుంది. బాబాయ్ ఏం చేశాడు. ఆ కుటుంబం వల్ల ఏం నష్టపోయామో మనకు తెలుసు. శివ నారాయణ సంతోషంగా అందరిలో ఉండాలా. లేదు. బాబాయ్ బలం తగ్గించాలి. బాబాయ్ దగ్గరున్న వాళ్లను దూరం చేయాలని మాలిని అంటుంది.

నాకు అర్థమైందమ్మా. కానీ ఇలాంటివి చేసేటప్పుడు నాకు చెప్పు అని దక్షిణామూర్తి అంటాడు. చెప్పి చేస్తే మీరు ఏది చేయనివ్వరు మావయ్య. అన్నింటికి సమాధానం చెప్పే తీరుతాను అని రూపాయి పట్టుకుని అనుకుంటుంది మాలిని. మరోవైపు ఆఫీస్‌లో జ్యోత్స్నకు సూరజ్ సైట్ కొడతాడు. జో ఇరిటేట్ అవుతుంది. జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్లి వచ్చేలోపు బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని సైట్ కొడతాడు సూరజ్.

పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు

అది చూసిన జ్యో రేయ్ సైట్ కొట్టేందుకు సిగ్గు లేదా అని అడుగుతుంది. మరి నువ్వు నాకెందుకు సైట్ కొడుతున్నావ్ అని రివర్స్‌లో అంటాడు సూరజ్. కాలేజ్, స్కూల్‌లో ఎవరిని లవ్ చేయలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రేమించిన మొదటి అమ్మాయివి నువ్వే, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడే అలా ఫిక్స్ అయ్యాను అని సూరజ్ అంటాడు.

ఏ జన్మలో నేను నీకు దక్కను, ఇలాగే మాట్లాడితే ఆ నాలుక కట్ చేసి పడేస్తాను అని జ్యోత్స్న అంటుంది. కళ్లతో చూస్తానని సూరజ్ ఆడుకుంటాడు. నేను ఏదైనా కావాలనుకుంటే అదే నా దగ్గరకు తెచ్చుకుంటాను అని సూరజ్ అంటుండంగా.. దీప వస్తుంది. ఎందుకు పదే పదే ఇదే విషయం చెబుతావని జ్యో అంటుంది. సూరజ్ ఆగిపోతాడు.

నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా. ఏం అనుకున్నా జరుగుతుంది అనుకుంటున్నావా. ఎందుకురా అంత బిల్డప్ అని జ్యోత్స్న తిడుతుంది. ఆ మాటలు దీప వింటుంది. దీపను జ్యోత్స్న చూసి నవ్వి వెళ్లిపోతుంది. అందరూ నాతో ఆడుకుంటున్నారుగా. చెబుతా అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో జ్యోత్స్నకు కాల్ చేసి ఒక ప్లేస్‌కి వెళ్దామని అంటుంది పారిజాతం.

సూరజ్‌కు షాక్

ఫోన్ అక్కడే పెట్టి రా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న డెస్క్‌లో ఫోన్ పెట్టి వెళ్తుంటే.. సూరజ్ అడుగుతాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నా అని జ్యోత్స్న అంటుంది. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. మన పెళ్లి గురించి మాట్లాడేందుకు మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాను అని జ్యోత్స్న అంటుంది.

సూరజ్ అలాగే దిమ్మతిరిగి నిల్చుండిపోతాడు. పిల్లోడు షాక్ అయినట్లున్నాడు. పిల్లబాతు బచ్చాగాడు అని జ్యో వెళ్లిపోతుంది. జ్యోత్స్నను మాలిని ఇంటికి తీసుకెళ్తుంది పారిజాతం. నువ్వు పుట్టినప్పటి నుంచి మొదటిసారి మేనత్త ఇంటికి వచ్చావని మాలిని ఎంట్రీ ఇస్తుంది. పారిజాతంను తిడుతుంది జ్యో. పారిజాతం ఎవరికి చెప్పరు కదా అని మాలిని అంటుంది.

పెద్దవారిని గౌరవించి మాట్లాడాలని తెలియదా అని క్లాస్ పీకుతుంది జ్యోత్స్న. ఏం పొగరుందే నీలో. మాలిని మేనకోడలు అంటే ఇలాగే ఉండాలి అని మాలిని అంటుంది. మాలిని నీతో ఏదో మాట్లాడాలట అని పారిజాతం అంటుంది. తాత చెప్పింది మర్చిపోయావా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు నా మేనకోడలివి. నాకు కొడుకు ఉండుంటే పెళ్లి చేసేదాన్ని అని మాలిని అంటుంది.

మాలిని ఇంట్లో జ్యోత్స్న

ఆశకు హద్దు ఉండాలని జో అంటుంది. పారిజాతం చెప్పడంతో కూర్చుని మాట్లాడుతారు. మరోవైపు ఈ పెండింగ్ ఫైల్స్ ఏంటీ, నీ అసిస్టెంట్ ఏం చేస్తుందని దీపతో కార్తీక్ అంటాడు. అది సరిగా చేయట్లేదని దీప అంటుంది. నువ్వు సరిగా చేయించుకోవట్లేదు. నిన్నే అంటారని, నీదే తప్పు అవుతుందని కార్తీక్ అంటాడు. కార్తీక్ బెల్ కొడతాడు.

జ్యోత్స్న రాదు. బయటకు వెళ్లి చూస్తే జ్యో ఉండదు. సూరజ్ కూడా ఉండడు. ఇంతలో శివ నారాయణ వచ్చి చిన్న పని ఉంది బయటకు వెళ్తున్నా అంటాడు. జ్యోత్స్న గురించి అడుగుతాడు. ఇంతలో సూరజ్ వచ్చి బయటకు వెళ్లిందని చెబుతాడు. అడిగిన చెప్పలేదంటాడు. కార్తీక్ ఫోన్ చేస్తే డెస్క్‌లోనే పోన్ ఉంటుంది. మొబైల్ ఇక్కడే వదిలి వెళ్లిందని కార్తీక్ అంటాడు.

వెళ్లేముందు ఒక ఫోన్ కాల్ మాట్లాడి వెళ్లారు. అది వాళ్ల గ్రానీ అనుకుంటున్న అని సూరజ్ చెబుతాడు. దాంతో సుమిత్రకు కాల్ చేసి పారిజాతం గురించి అడిగితే.. బయటకు వెళ్లిందని సుమిత్ర చెబుతుంది. పారిజాతంకు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారని శివ నారాయణ డౌట్ పడతాడు. మరోవైపు ఎందుకు పిలిచారో చెబితే వెళ్తానంటుంది జ్యోత్స్న.

నీకు అమ్మ పోలికలు రాలేదేంటీ

నిన్ను చూసినప్పటినుంచి నీలో కుటుంబాన్ని వెతుకుతున్నాను. నీకు మీ అమ్మ పోలికలు రాలేదేంటీ అని మాలిని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. నీకు ఇంకా ఎవరి పోలికలు కానీ చనిపోయిన నానమ్మ పోలికలు కానీ రాలేదు. నీ పొగరు, నీ ఆవేశం కొత్తగా ఉన్నాయి. ఇవి ఎవరి లక్షణాలు అని మాలిని ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తుంది.

పారిజాతం భయపడిపోతుంది. నా గురించి తెలుసుకుని బుక్ రాస్తారా అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. దీప దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్నావా. ఐదో తరగతి చదివినదాని దగ్గర అసిస్టెంట్‌గా పెట్టడం ఏంటని మాలిని అంటే.. ఇదంతా పెళ్లి అయ్యేవరకే అని పారిజాతం అంటుంది. నీకు కార్తీక్‌కు పెళ్లి చేయాలనుకున్నారే అని మాలిని అడుగుతుంది.

వాడు దీపను చేసుకున్నాడుగా అని పారిజాతం అంటే.. అందుకేనా నువ్వు పెళ్లి చేసుకోలేదు అని మాలిని అంటుంది. అలా చెప్పాను. నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను అని జ్యో అంటుంది. మనసులో ఎవరైనా ఉంటే చెప్పి పెళ్లి చేస్తా అని మాలిని అంటుంది. అప్పుడు వీళ్ల తాత నీ ఫొటోకు దండేస్తాడు అని పారిజాతం అంటుంది.

సగం ఆస్తి ఆఫర్

ఆ ఇంట్లో నీ పరిస్థితి బాలేదని పిలిపించాను. నీకు ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగిన కాదనకుండా ఇస్తాను. జ్యోత్స్న ఊ అంటే ఆస్తిలో సగం వాటా ఇస్తానంటుంది మాలిని. నా ఆస్తిలో సగం నా ఆడపడుచు కూతురికేగా అని మాలిని ఆఫర్ ఇస్తుంది. నీ మేనత్తకు నువ్వంటే ఎంత ప్రేమో చూశావా అని పారిజాతం అంటుంది.

దాంతో లేచిన జ్యోత్స్న నాకు ఎవరి ప్రేమలు అవసరం లేదు అని జ్యో అంటుంది. కాఫీ తీసుకోలేదని మాలిని అంటే.. ఇంకోసారి ఇవ్వరని జ్యో అంటుంది. అంటే ఇంకోసారి వస్తానంటున్నావా అని మాలిని పంచ్ వేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More