Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- ఒకడు అగ్ని పర్వతం, ఇంకొకడు మహా సముద్రం- శివ నారాయణ దెబ్బకు మాలిని షాక్
Karthika Deepam 2 Serial July 23rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 23వ ఎపిసోడ్‌లో దక్షిణామూర్తి ఇంటికి వెళ్లిన శివ నారాయణ తన స్టైల్‌లో పంచాయితీ పెడతాడు. మాలిని ఇచ్చిన బ్లాంక్ చెక్‌పై రూపాయి పెట్టి విలువ కడతాడు. దమ్ముంటే సూరజ్‌ను కొని చూపించు అని దక్షిణామూర్తితో ఛాలెంజ్ చేస్తాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తికి మాలిని ఇచ్చిన పండ్లు, చెక్ పట్టుకుని కార్తీక్, సూరజ్‌తో శివ నారాయణ వెళ్తాడు. దక్షిణామూర్తిని పిలుస్తాడు. దక్షిణామూర్తి స్వాగతం చెప్పి మర్యాదలు చేస్తాడు.

దక్షిణామూర్తి మర్యాదలు
నీలా కాదు మర్యాదలు చేస్తానని, మాలిని పిలిచి ఎవరు వచ్చారో చూడమని చెబుతాడు దక్షిణామూర్తి. మాలిని చూసి కిందకు దిగి వస్తుంది. ఫ్రూట్స్, చెక్‌ను టేబుల్ మీద పెట్టమంటాడు శివ నారాయణ. కూర్చోని మాట్లాడదామని మాలిని అంటే.. శివ నారాయణ అవసరం లేదంటాడు. కార్తీక్‌ను కూర్చోమని, మనమంతా చుట్టాలమే అని మాలిని అంటుంది.
నేను వచ్చింది శివ నారాయణకు మనవడిగా, ఒకప్పుడు బంధాలు ఉండేవని గుర్తు చేస్తున్నా అని మాటకు మాట సమాధానం ఇస్తాడు కార్తీక్. శభాష్‌రా మనవడా. శివ నారాయణ అంశ కాంచన కడుపులో పురుడుపోసుకుందని ఇప్పుడు అర్థమైందని, నీ మాట తీరు బాగా నచ్చిందని దక్షిణామూర్తి అంటాడు. కొంత మాటల యుద్ధం తర్వాత శివ నారాయణ కూర్చుంటాడు.
శివ నారాయణ వైపు కార్తీక్ నిలబడితే.. మాలిని వైపు సూరజ్ నిల్చుంటాడు. మీరు ఏమనుకున్నారో, ఎందుకో తెలియదు కానీ మా ఇంటికి వచ్చారు, మాకు పోటీగా కంపెనీ పెట్టారు, పోటీలోకి దింపారు, నా కోడలి కోసం పోటీలోకి దిగాను. అప్పుడు కూడా మీ నిజాయితీ ఏంటో బయటపెట్టారు. పోటీ అయిపోయింది ఓడిపోయారు. ఇక ఏ వంక పెట్టుకుని ఎదురుపడతారు, నా జోలికి రారు అనుకున్నాను అని శివ నారాయణ అంటాడు.
దక్షిణామూర్తికి షాక్
కానీ ఉదయం నా కూతురు ఇంటికి వెళ్లడం దేనికి, ఫ్రూట్స్ దేనికి, బ్లాంక్ చెక్ ఇవ్వడం దేనికి అని శివ నారాయణ అంటాడు. అది విని దక్షిణామూర్తి షాక్ అవుతాడు. కాంచన పేదరికంలో ఉంది. కాంచన నాకు వరసకు అక్క అవుతుంది అందుకే ఇచ్చానని మాలిని అంటుంది. నీ కూతురిని ఎందుకు ఒంటరిగా వదిలేశావ్ అని మాలిని అంటుంది.
దానికి ధీటుగా కార్తీక్ సమాధానం ఇస్తాడు. లండన్‌లో చదడవం జ్ఞానం కోసం, ఇక్కడ పనిచేసేది నా వాళ్ల కోసం, ప్రతిదానికి వివరాలతో బోర్డ్ పెట్టుకోలేను అని కార్తీక్ అంటాడు. అది కాదు అని మాలిని అంటే.. మీకో నమస్కారం. మమ్మల్ని వదిలేయండి, మాకు మీ మాట సాయం, డబ్బు సాయం గానీ వద్దు అని కార్తీక్ అంటాడు.
కాంచన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. నా కూతురు తీసుకుంటానంటే ఇవ్వడానికి నేనున్నా. కానీ, తనే మొండిది, ఎప్పుడో అన్న మాట కోసం ఏది తీసుకోవట్లేదు. మరోసారి నువ్వు గానీ నీ మామ గానీ నా ఇంటికి నా కూతురు ఇంటికి రావొద్దు. నా కూతురు గురించి, తన భర్త గురించి మాట్లాడేందుకు నువ్వెవరు అని కోపంగా అంటాడు శివ నారాయణ.
సూరజ్‌ని కొని చూపించు
నువ్వు అజ్ఞానంతో చేసిన పని తప్పను చెప్పడానికి నేను వచ్చాను. ఇంకోసారి ఇద్దరు ఇలాంటివి చేయకండి అని శివ నారాయణ అంటాడు. ఇద్దరిని వేసుకుని వస్తే గొడవకు వచ్చావనుకున్నా అని దక్షిణామూర్తి అంటాడు. వీళ్లు నావాళ్లు అని శివ నారాయణ అంటాడు. వాడంటే నా మనవడు, అతనెవరు అని దక్షిణామూర్తి అడుగుతాడు.
నేను నమ్మిన మనుషుల్లో నిజాయితీ లేదని డబ్బుతో నిరూపించుకోవాలనుకుంది కదా నీ కోడలు. నీకు దమ్ముంటే సూరజ్‌ని కొని చూపించు అని శివ నారాయణ ఛాలెంజ్ చేస్తాడు. నా నమ్మకానికి రూపం నా మనవడు కార్తీక్ అయితే.. నా నిజాయితీకి రూపం మనవడి లాంటి సూరజ్. ఒకడు అగ్ని పర్వతం అయితే ఇంకొకడు మహా సముద్రం, వీళ్లే ఈ శివ నారాయణ ల్యాండ్ మార్క్స్ అని శివ నారాయణ చాలా గొప్పగా చెబుతాడు.
వీళ్లని దాటితే ఇంకో ఇద్దరు ఉన్నారు. నా మనవరాళ్లు దీప, జ్యోత్స్న. వాళ్లను దాటితో మరో ఇద్దరు ఉన్నారు నా కూతురు కాంచన, కోడలు సుమిత్ర. వాళ్లను దాటితే మరో ఇద్దరు ఉన్నారు నా కొడుకు దశరథ, అల్లుడు శ్రీధర్. ఇది నా కుటుంబం. ఇది నా బలం. అవమానించడానికి వచ్చి అవమానపడకండి అని శివ నారాయణ అంటాడు.
రూపాయి విలువ కట్టిన శివ నారాయణ
కార్తీక్‌ని ఒక రూపాయి ఇవ్వమని మాలిని ఇచ్చిన బ్లాంక్ చెక్‌పై రూపాయి పెడతాడు శివ నారాయణ. నీ బ్లాంక్ చెక్ మీద నువ్వెంత రాసుకున్నా పైచేయి నాదే అవుతుంది. ప్రతిసారి ఇంత సహనంగా నేను చెప్పకపోవచ్చు అని శివ నారాయణ అంటాడు. ఏం కావాలని అడిగారు కదా నాకు ఎదురుపడకండి, నాకు ఇదే కావాలి అని శివ నారాయణ వెళ్లిపోతాడు.
మాలిని, దక్షిణామూర్తి చాలా అవమానంగా ఫీల్ అవుతారు. మరోవైపు మాలిని ఇంటికి రావడం, దక్షిణామూర్తి ఇంటికి శివ నారాయణ వెళ్లడం గురించి సుమిత్ర వాళ్లతో కాంచన చెబుతుంది. శివ నారాయణ శివతాండవం ఆపలేపమని, కార్తీక్ గాడు కూడా ఆపలేడని పారిజాతం అంటుంది. తర్వాత శివ నారాయణ కాఫీ తాగి బాగుందంటాడు.
అక్కడ ఏం జరిగిందో చెప్పురా అని పారిజాతం కంగారుగా అడుగుతుంది. అక్కడ జరిగింది, మాలినికి రూపాయి విలువ కట్టింది చెబుతారు. వాళ్ల జీవిత లక్ష్యం నన్ను నాశనం చేయడం, దానికోసం ఏమైనా చేస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్లలో ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్లనే మన మీదికి ఆయుధంగా వాడుకుంటుంది మాలిని అని శివ నారాయణ అంటాడు.
శ్రీధర్ వస్తున్నాడని
వాళ్లు ఇంతటితో ఆగరు. మళ్లీ ఏదోటి చేస్తారు. ఎవరు మాలిని వలలో పడకండి. మీ ద్వారా వాళ్లు అనుకున్న పని చేయించుకుంటారు అని శివ నారాయణ అంటాడు. ఇది చెప్పడానికే కాంచనను ఇంటికి రమ్మన్నారా అని పారిజాతం అంటుంది. శ్రీధర్ వస్తున్నాడని చెప్పడానికి రమ్మన్నాను అని శివ నారాయణ అంటాడు. దాంతో కాంచన సంతోషిస్తుంది.
ఈవెనింగ్ ఫ్లైట్‌కి శ్రీధర్ వస్తున్నాడు. ఈ విషయాలన్నీ శ్రీధర్‌కు చెప్పకండి అని శివ నారాయణ అంటాడు. నీ విషయంలో నేను తప్పు చేశానని మాలిని అన్నది నిజమేనా అని శివ నారాయణ అడిగితే.. మా అమ్మకు అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావా అని కార్తీక్ అడుగుతాడు. అనుకుంటున్నాను అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


