Karthika Deepam 2 Review: పగతో రగిలిపోతున్న మాలిని.. శివ నారాయణకు వెన్ను పోటు.. శత్రువు దీపతో జ్యోత్స్న చేతులు కలిపేనా?

Karthika Deepam 2 Review: బుల్లితెరను షేక్ చేస్తున్న టాప్ సీరియల్ ‘కార్తీక దీపం 2’. టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. శివ నారాయణ పతనాన్ని కోరుకుంటూ, పగతో రగిలిపోతున్న మాలిన ఏం చేస్తుందన్నది ఉత్కం రేపుతోంది. ఈ వారం సీరియల్ రివ్యూ ఇక్కడ చూసేయండి.

Published on: Jul 19, 2026, 15:10:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Review: కార్తీక దీపం 2 సీరియల్ అంటే.. దీప, కార్తీక్, జ్యోత్స్న ముగ్గురి చుట్టూ తిరిగే కథగా ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీరియల్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. షాక్ ల మీద షాక్ లు కలుగుతున్నాయి. కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో కార్తీక దీపం 2 సీరియల్ పై హైప్ మరింత పెరిగింది.

పగతో రగిలిపోతున్న మాలిని.. శివ నారాయణకు వెన్ను పోటు.. శత్రువు దీపతో జ్యోత్స్న చేతులు కలిపేనా? (jiohotstat)
పగతో రగిలిపోతున్న మాలిని.. శివ నారాయణకు వెన్ను పోటు.. శత్రువు దీపతో జ్యోత్స్న చేతులు కలిపేనా? (jiohotstat)

ప్లాన్ తో పోటీ

కార్తీక దీపం 2 సీరియల్ లో ఈ వారం (జూలై 13 నుంచి జూలై 18) కథ మొత్తం శివ నారాయణను రెచ్చగొట్టి పోటీలో దిగేలా చేయడం, అతని పతనాన్ని కోరుకుంటున్న మాలిని మాస్టర్ ప్లాన్ వేయడం చుట్టూ సాగింది. శివ నారాయణను ఫోన్లో దక్షిణామూర్తి రెచ్చగొట్టేలా మాలిని చేస్తుంది. దీంతో సుమిత్ర ఆగ్రహం ఆపుకోలేక పోటీకి సై అనమని మామయ్యకు చెప్తుంది.

సూరజ్ అడ్డు తొలగించుకోవాలని

మరోవైపు సూరజ్ ను ముందు అడ్డు తొలగించుకోవాలని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అందుకే బ్రేక్ ఫెయిల్ చేసిన కార్లో సూరజ్ ను వెళ్లమంటారు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. సూరజ్ కు ఏం కాదు. కానీ అదే కార్లో వెళ్లిన పారిజాతం మెడ విరుగుతుంది. దీంతో పారుకు తిక్క కుదురుతుంది.

మాలిని పొగరు

శివ నారాయణకు చెందిన జ్యోత్స్న రెస్టారెంట్స్, దక్షిణామూర్తికి చెందిన డీఎం రెస్టారెంట్స్ చెఫ్స్ మధ్య పోటీకి అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సూరజ్ ను కొనేందుకు మాలిని ట్రై చేస్తుంది. డబ్బు, మంచి లైఫ్ ఆఫర్ చేస్తుంది. కానీ సూరజ్ మాత్రం శివ నారాయణ, దీపకు నమ్మకంగా ఉంటాడు. మాలినికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తాడు.

దీపకు షాక్

బెస్ట్ వంటకం పోటీ స్టార్ట్ కావడానికి ముందే మాలిని తన పవర్ గేమ్ చూపిస్తుంది. దీప కోసం పోటీపడటానికి వచ్చిన చెఫ్ ను ముందే మాలిని కొనేస్తుంది. దీంతో అతను డీఎం రెస్టారెంట్ తరపున బరిలో దిగుతాడు. దీంతో ఛైర్మన్ శివ నారాయణ, సీఈఓ దీప మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బిత్తరపోతారు.

రంగంలోకి జ్యోత్స్న

దీపపై పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూసే జ్యోత్స్న ఇప్పుడు దెబ్బ కొట్టాలనుకుంటుంది. అందుకు సూరజ్ హెల్ప్ కూడా అడుగుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ తరపున జ్యోత్స్న పోటీలోకి దిగుతుంది. ఆమెకు దీప సాయం చేస్తుంది. కానీ దీపను ఓడించాలని జ్యోత్స్న వంటను పెంట పెంట చేస్తుంది.

ఇది గమనించిన దీప తన మాటలతో జ్యోత్స్నను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోటీలో గెలిస్తే నీకే పేరు వస్తుందని, నీకు గుర్తింపు దక్కుతుందని జ్యోత్స్నతో దీప అంటుంది. ఈ మాటలతో జ్యోత్స్న మారేలా కనిపిస్తుంది.

ఏం జరుగుతుంది?

దీప మాటలతో జ్యోత్స్నలో మెల్లగా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది. కానీ జ్యోత్స్న నిజంగానే మారుతుందా? వంట సక్రమంగా చేసి మాలిని పొగరు దించుతుందా? అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More