Karthika Deepam 2 Today Episode: సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి- సూరజ్ చరిత్ర తెలుసుకోమన్న శివ నారాయణ-సూరజ్ మోసగాడన్న శ్రీధర్
Karthika Deepam 2 Serial August 1st Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 1వ ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు సూరజ్ కరెక్ట్ అని, అతని చరిత్ర మొత్తం తెలుసుకోమ్మని కార్తీక్, దీపలతో శివ నారాయణ అంటాడు. ఆఫీసుకెళ్లిన శ్రీధర్ దీపకు బాణాల్లాంటి ప్రశ్నలు వేస్తాడు. సూరజ్ మోసగాడని తన అనుభవంతో డౌట్ పడతాడు శ్రీధర్.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్ తీసిన జ్యోత్స్న ఫొటో ఆల్బమ్ ముందు పెట్టుకుని ఏమంటారు అని కార్తీక్, దీపను అడుగుతాడు శివ నారాయణ. చూస్తుంటే జ్యోత్స్న అంటే సూరజ్‌కి ఇష్టమున్నట్లుంది. కాకపోతే అని కార్తీక్ తటాపటాయిస్తాడు.

జ్యోత్స్నకు సూరజే కరెక్ట్
సూరజ్‌తో జ్యోత్స్న ఎంత గొడవ పడుతుందో చూశావా. అయినా సూరజ్ మాత్రం ఎంత సహనంగా ఓపికగా సమాధానం చెబుతున్నాడో. నువ్వు ఏమైనా అను జ్యోత్స్నకు సూరజే కరెక్ట్ అని దీప నోరు జారుతుంది. అంతా షాక్ అయి చూస్తారు. తాతగారు నేను అని దీప అంటుంటే.. నా మనసులో మాటే అనేసావమ్మా. మీరేమంటారు అని శివ నారాయణ అంటాడు.
మాకు అలాగే అనిపిస్తుందని దశరథ్.. దీప చెప్పింది కరెక్ట్ మావయ్య. జ్యోత్స్న లాంటి దాన్ని భరించాలంటే సూరజ్ లాంటి వాళ్లే కరెక్ట్. పైగా సూరజ్‌తో జ్యోత్స్న గొడవ పడుతుంటే పైకి కంప్లైంట్ చేసినట్లుంది కానీ అర్థం చేసుకునేవాళ్లకు సూరజ్ చుట్టూ జ్యోత్స్న తిరుగుతుందనిపిస్తుందని సుమిత్ర అంటారు. సూరజ్‌ను కూడా జ్యోత్స్న ఇష్టపడుతుందని కార్తీక్ అంటాడు.
కానీ అది ఒప్పుకోదు. దానికి ఇగో ఎక్కువ. మనం అడిగిన చెప్పదు. ఇష్టం లేకుంటే సూరజ్ గదిలోకి వెళ్లి ఫొటోలు ఎలా తెస్తుంది, షర్ట్ ఎలా ఉతుకుతుంది. ఆ వయసు దాటినవాళ్లమేగా మనం అని సుమిత్ర అంటుంది. సూరజ్ అవుట్ హౌజ్‌కి పనికిరాడు అన్నదానికి అర్థం ఇప్పుడు అర్థమైంది తాతయ్య. ఇన్ హౌజ్‌కు పనికివస్తాడనే కదా అని కార్తీక్ నవ్వుతూ అంటే.. అవునురా అని శివ నారాయణ అంటాడు.
సూరజ్ చరిత్ర మొత్తం కావాలి
ముందు సూరజ్ గురించి వివరాలు తెలుసుకో. సూరజ్ చరిత్ర మొత్తం కావాలి. వాళ్ల అమ్మనాన్నలతో సహా. కానీ, ఈ విషయం సూరజ్‌కి తెలియకూడదు అని శివ నారాయణ అంటాడు. సరేనని కార్తీక్ అంటాడు. తర్వాత సుమిత్రను పార్టీ అడుగుతాడు కార్తీక్. ఆడపిల్ల పెళ్లి అంటే తొందరపడకూడదు. ముందు పూర్తి వివరాలు తెలియని అని దశరథ్ అంటాడు.
చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు అనే సామెత నిజమైందిగా. ఇంటి దగ్గర అల్లుడిని పెట్టుకుని మావయ్య ఊరంతా తిరిగాడు. ముహుర్తం దగ్గరి నుంచి మూడుముళ్లు వేసేవరకు నా చిన్న మరదలు పెళ్లి బాధ్యత మాది అని కార్తీక్ అంటాడు. మరోవైపు మాలినితో మన ప్రయాణం రేపే అని దక్షిణామూర్తి అంటాడు. మనం రెండు రోజులు వెళ్తే మనం భయంతో వెళ్లామని బాబాయ్ అనుకుంటాడేమో అని మాలిని అంటుంది.
నా గురించి వాడికి బాగా తెలుసు. ఏదో ఒక రోజు తిరిగి వస్తానని చూస్తుంటాడు. నా కూతురు వాడి దగ్గర లేకుంటే వాడి మొహం చూసే అవసరం రాకుండేది. స్నేహితుడే మోసం చేశాడు. వాడి వల్ల తీరని నష్టాన్ని చూశాను. ఒక్క సుమిత్ర కోసం వాడితో ప్రశాంతంగా మాట్లాడుతున్నా. సుమిత్ర మన ఇంటికి రావడమే కాదు ఆ శివ నారాయణ ఓడిపోవాలి అని దక్షిణామూర్తి అంటాడు. అది తొందర్లేనే జరుగుతుందని మాలిని అంటుంది.
దీప ఎవరు నువ్వు
మనం చేయాల్సింది చేశాం. మనం ఉన్న లేకున్నా అది ఆగదు. జరుగుతూనే ఉంటుంది. మనవరాలిని చూసిన ప్రతిసారి మన మొహం గుర్తుకు వస్తుంది. ఈసారి ఎదురుపడితే శివ నారాయణ భయపడాలి. వాడు ఓడిపోయానని వాడి నోటితోనే చెప్పించాలి. అప్పుడు నా కూతురు నా పక్కనే ఉండాలి అని దక్షిణామూర్తి అంటాడు. నేను మీ కూతురునే కాదు మనవరాలిని కూడా వదిలిపెట్టను అని మాలిని మనసులో అనుకుంటుంది.
మరోవైపు ఆఫీస్‌కు శ్రీధర్ వెళ్తాడు. దీపను చూస్తుంటే గర్వంగా ఉందని పొగుడుతాడు. నాకు ఎప్పుడు అనుమానమే. పూర్తిగా ఎవరిని నమ్మలేను. అసలు ఎవరు నువ్వు. అనాథకు అమ్మనాన్న ఉంటారు. నీ అమ్మనాన్న ఎవరో తెలుసా. ఇప్పుడు తెలుసుకోవాలని అనిపించట్లేదా. ఎవరమ్మా నీ కన్నవాళ్లు. ఎక్కడున్నారు. మాకెందుకు చెప్పట్లేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు శ్రీధర్.
దాంతో ఏం చెప్పలేక నీళ్లు తాగుతుంది దీప. నీకు ఏ సమస్య ఉన్న నాకు చెప్పమ్మా. నేను నా కడుపులో పెట్టుకుంటున్నాను. ఏ కోడలా నీకు నీ అమ్మనాన్న తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు అని శ్రీధర్ అంటాడు. నాకు అమ్మనాన్న అన్నీ నా భర్త. మా అత్త, మావయ్య ఇదే నా కుటుంబం అని దీప అంటుంది. మరి నీ జీవితానికి జ్యోత్స్న పెళ్లికి ఏంటీ సంబంధం అని అడుగుతాడు శ్రీధర్.
నీకు ఎస్సైగా పోస్ట్
మీరేం విన్నారా నాకు తెలియదు. నా నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని దీప అంటుంది. నీకు దశరథ బావ కుటుంబానికి ఏదో సంబంధం ఉంది. నాకు తెలిసి ఇప్పటి సంబంధం. నాకు తెలియని బంధాలు ఏమైనా ఉన్నాయా. నా కోడలిగా కాకుండా మీకు ఏదైనా బంధం ఉందా. బావ చెప్పింది పూర్తిగా వినుంటే నాకు పూర్తిగా అర్థమయ్యేదు. నువ్వు ఎవరో చెప్పు అని పదే పదే నిలదీస్తాడు శ్రీధర్.
ఇంతలో కార్తీక్ వచ్చి కంగ్రాట్స్ మాస్టారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పోస్ట్ ఇచ్చారంట అని అంటాడు. నీకు అంత వెటకారంగా ఉందేంట్రా అని శ్రీధర్ అంటే.. జ్యోత్స్నను ఇంట్రాగేట్ చేసినట్లు దీపను అడుగుతున్నావ్‌గా అని కార్తీక్ అంటాడు. ఓ దెయ్యం స్టోరీ చెప్పి అందరూ భయాన్ని చూశారు కానీ దెయ్యాన్ని కాదు. నీ అనుమానం కూడా దెయ్యం కాదు భయం అని శ్రీధర్‌తో అంటాడు కార్తీక్.
అదంతా కాలమే చెబుతుందిరా అని శ్రీధర్ అంటాడు. సూరజ్‌ను అలాగే చూసిన శ్రీధర్ ఈ సూరజ్ ఒకచోట ఉండడని తెలిసింది. మరి ఇక్కడ ఎలా ఉంటున్నాడా అని చూస్తున్నా అంటాడు. సూరజ్ స్టాల్స్, అడ్వైజర్ గురించి చెబుతాడు కార్తీక్. కాదురా, ఒకడు తన స్థాయి తగ్గించుకుని వచ్చాడంటే వాడు కచ్చితంగా మోసం చేయడానికే వచ్చాడురా. అనుభవంతో చెబుతున్నా అని శ్రీధర్ అంటాడు.
సూరజ్ మోసగాడని డౌట్
ఒకడు స్థాయి తగ్గించుకున్నాడంటే మోసగాడైనా అయి ఉండాలి.లేదా వాడి మనసులో ఇంకేదైనా లక్ష్యం ఉండాలి నీలాగా అని శ్రీధర్ అంటాడు. నా మనసులో ఎలాంటి లక్ష్యాలు లేవని కార్తీక్ అంటాడు. కంటికి కనిపించే కథలకంటే కనిపించని కథలే ఎక్కువగా నడుస్తున్నాయిరా. సూరజ్, జ్యోత్స్న జోడీ బాగుందిరా. సూరజ్‌ని ఏదో శక్తి ఆపుతుంది. ఏంటా శక్తి అని శ్రీధర్ డౌట్ పడతాడు.
అలా బాణంలాంటి ప్రశ్నలు, అనుమానాలతో శ్రీధర్ అదరగొడతాడు. తర్వాత రాత్రి సూరజ్‌కు గుడ్ నైట్ చెబుతుంది జ్యోత్స్న. ఈ రాత్రికి నిన్నే ఇంట్లోంచి గెంటేస్తారు. ఇక ప్లాట్‌ఫామ్‌పై జ్యూస్‌లు అమ్ముకోవడమే అని జ్యో అంటుంది. థ్యాంక్స్ అని సూరజ్ అంటాడు. కాసేపట్లో నీకు ఫోన్ రావచ్చు, లగేజ్ ప్యాక్ చేసుకుంటే మంచిది. నీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అని జ్యో అంటుంది.
సూరజ్ మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతాడు. నీ వదిన, అన్న ఫోన్ చేయలేదేంట్రా అని జ్యో అంటుంది. అసలేంటే నీ బాధ అని సూరజ్ అంటాడు. ఇంతలో పారిజాతం వచ్చి వీడితో గొడవ అవసరమా. దారినపోయే ముళ్లకంపను మళ్లీ తగిలించుకోకు అని అంటుంది. అయితే ఆ ముళ్లకంపను జాగ్రత్తగా తీసుకెళ్లండని సూరజ్ అంటాడు.
జ్యోత్స్న ముళ్లకంప
నేను ముళ్లకంపనేరా. జాగ్రత్తగా ఉండు అని జ్యోత్స్న అంటుంది. ఐ లవ్ ముళ్లకంపలు అని సూరజ్ అంటాడు. జ్యోని బలవంతంగా పారిజాతం లాక్కెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో సూరజ్ గాడు కనిపించలేదు. తాత వాడిని అవుట్ హౌజ్ నుంచి పొమ్మంటాడు అని జ్యో అనుకుంటుంటే సూరజ్ కనిపిస్తాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది.
సూరజ్‌తో గొడవ పడుతుంటుంది జ్యో. కార్తీక్ వచ్చి పదా మాట్లాడాలని అంటాడు. ఇంకా సూరజ్ ఇక్కడ ఏం చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. బ్రదర్‌తో పని ఉంది అని సూరజ్‌ను తీసుకెళ్తాడు కార్తీక్. వీళ్లు ఏం మాట్లాడుకుంటారో వినాలని జ్యో అనుకుంటుంది. దీప దగ్గర సూరజ్‌ను కూర్చోబెట్టి సొంత విషయాలు ఏం మాట్లాడుకోలేడు అని కార్తీక్ అంటాడు.
కార్తీక్ ఆరాలు
ఈసారి నీ గురించి పూర్తి వివరాలు చెప్పాలి. మీ అమ్మనాన్న పేరు ఏంటీ, బంధువులు ఎక్కడ, ఎక్కడ పుట్టావ్ అని అన్ని వివరాలపై ఆరా తీస్తాడు కార్తీక్. వీడి డీటేల్స్ బావకెందుకు అని ఆశ్చర్యపోతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


