Karthika Deepam 2: కార్తీక దీపం 2..ఎవరి ఆటలో ఎవరు పావులు? జ్యో, సూరజ్ పెళ్లి-మాలిని కోరుకున్నదే జరుగుతుందా? కుట్ర ఏంటీ?
Karthika Deepam 2: బుల్లితెరపై సంచలన జైత్రయాత్ర కొనసాగిస్తున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. ఈ మెగా సీరియల్ లో ఇప్పుడు చోటు చేసుకుంటున్న ట్విస్ట్ లు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. అసలు సీరియల్ లో ఎవరి ఆటలో ఎవరు పావులు? అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మాలిని కుట్రను కార్తీక్ అడ్డుకోగలడా? అనేది చూడాలి.
Karthika Deepam 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం 2 సీరియల్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో ఎప్పుడూ టాప్ లోనే దూసుకెళ్తోంది. ఇప్పుడీ సీరియల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అసలు ఆట ఆడిస్తున్న గేమ్ మాస్టర్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

జ్యోత్స్న, సూరజ్ పెళ్లి
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న, సూరజ్ పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఇదే ఖాయమనిపిస్తోంది. జ్యోత్స్నకు పెళ్లి చేయరా? అంటూ శివ నారాయణ ఫ్యామిలీని మాలిని రెచ్చగొట్టింది. వెంటనే రంగంలోకి దిగిన శివ నారాయణ అండ్ కో జ్యోత్స్నకు సూరజ్ అయితే కరెక్ట్ అని తేల్చేసింది. దీంతో సూరజ్ వెనుకాల ఉన్న గతాన్ని, మిస్టరీని కనుక్కునేందుకు కార్తీక్ రంగంలోకి దిగాడు.
అసలు సూరజ్ ఎవరు?
సూరజ్ గతం గురించి ఇప్పటివరకూ కార్తీక దీపం 2 సీరియల్ లో రివీల్ చేయలేదు. కేవలం రోడ్డు పక్కన ఓ ఫ్రూట్ స్టాల్ నడుపుకునే యువకుడిగా మాత్రమే సూరజ్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత అతను దీపకు అసిస్టెంట్ గా రావడం, శివ నారాయణ ఫ్యామిలీలో ఒకడిగా కలిసిపోవడం, పెళ్లి చేసుకుందామంటూ జ్యోత్స్న వెంట పడటం చకచకా జరిగిపోయాయి. మరి ఇంతకీ సూరజ్ ఎవరు? అనేది ఇప్పుడు అత్యంత ఇంట్రెస్టింగ్ గా మారిన ప్రశ్న.
మాలిని మాస్టర్ ప్లాన్
సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేయాలని శివ నారాయణ ఫ్యామిలీ నిర్ణయించింది. అయితే ఇదంతా మాలిని పక్కా మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. ఆ సూరజ్ ఎవరో కాదు స్వయంగా మాలిని కొడుకే అనే ఊహాగానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శివ నారాయణ కుటుంబాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికే కొడుకును మాలిని రంగంలోకి దింపిందనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకుంటే శివ నారాయణ కుటుంబం మాలిని చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు మాలిని తన పగ తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇదంతా మాలిని ఆడుస్తున్న ఆట అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో శివ నారాయణ ఫ్యామిలీ పావులుగా ఉందని అంటున్నారు.
కార్తీక్ అడ్డుకుంటాడా?
తాాత ఫ్యామిలీకి ఏ కష్టమొచ్చినా కార్తీక్ ముందుంటాడు. మరోవైపు తన కన్నతల్లి సుమిత్ర, దశరథల కోసం దీప నిలబడుతుంది. మరి మాలిని వేసిన ఈ పెద్ద కుట్రను కార్తీక్, దీప తెలుసుకుంటారా? సూరజ్ గతం వెనుక ఉన్న నిజాన్ని వీళ్లు కనిపెడతారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాబోయే ఎపిసోడ్లలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


