Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం2.. షాకింగ్-జ్యోను క్షమించిన తాత-శివనారాయణ చావు-మాలినిపై దక్షిణామూర్తి ఫైర్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 30 ఎపిసోడ్ లో పారు తెగ బిల్డప్ ఇస్తుంది. మాలిని ఇంటికి వెళ్లిన జ్యోత్స్నను శివ నారాయణ క్షమిస్తాడు. జ్యో ఏమో సూరజ్ కు వార్నింగ్ ఇస్తుంది. కోడలు మాలిని తప్పు చేసిందని దక్షిణామూర్తి కోప్పడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 30, 2026, 07:03:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్నకు వీలైనంత త్వరగా పెళ్లి చేద్దామని ఫ్యామిలీ మెంబర్స్ కు శివ నారాయణ చెప్తాడు. మాలిని మనసులో ఏదో కుట్ర ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న, సూరజ్ మధ్య పిల్లి ఎలుక వార్ సాగుతూనే ఉంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

పారు బిల్డప్

మాలిని దగ్గరకు జ్యోత్స్నను తీసుకెళ్లడం, అన్ని విషయాలు చెప్పడాన్ని పారిజాతం సమర్థించుకుంటుంది. మాలిని చేతిలో శివ నారాయణ అవమానానికి గురికావడానికి కారణం కార్తీక్. జ్యోత్స్న పెళ్లి బాధ్యతను తీసుకున్నారు. కానీ ఇంకా ఏం చేయలేదు? అందుకే మాలిని వచ్చింది. ఇప్పుడు మనం జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించాలని తెగ బిల్డప్ ఇస్తుంది పారిజాతం.

జ్యోత్స్న తప్పు

నా భర్తను అవమానించిన మాలిని ఎప్పటికీ నా శత్రువే. జ్యోత్స్న పెళ్లి మండపంలో మాలిని చేతిలో ఈ ఉంగరం పెట్టి నేనంటే ఏంటో చెప్తా. అప్పటివరకూ ఇది నాతోనే ఉంటుంది అని పారు వెళ్లిపోతుంది. ఏం జరిగినా మన మంచికే. మాలిని మన ఇంట్లోకి కూడా వచ్చేసింది. మాలిని ఫోన్ చేసిందని చెప్పకపోవడం పారు తప్పు. వెళ్లి వచ్చిన తర్వాత కూడా చెప్పకపోవడం జ్యోత్స్న తప్పు అని శివ నారాయణ అంటాడు.

వీలైనంత త్వరగా జ్యోత్స్న పెళ్లి జరగాలి. ఇది మన అందరి పరువుకు సంబంధించిన విషయం అని శివ నారాయణ చెప్తాడు. మాలినిని కలవడం పెద్ద తప్పు. కానీ నిన్ను క్షమిస్తున్నానని తాత చెప్పడంతో జ్యో ఊపిరి తీసుకుంటుంది. వెంటనే సూరజ్ కు బుద్ధి చెప్తానని జ్యో వెళ్తుంది.

సూరజ్ కౌంటర్

నా పర్సనల్ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావని సూరజ్ ను జ్యో అడుగుతుంది. నేనేమీ నీ పెళ్లి చూపులను ఆపేసి, జ్యోత్స్నను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా అని సూరజ్ అడుగుతాడు. ఇండైరెక్ట్ గా అదే చెప్పావ్. కవిత కూడా రాశావ్ అని జ్యో అంటుంది. నిన్ను నేను తప్పా ఎవరూ భరించలేరని సూరజ్ కౌంటర్ వేస్తాడు.

జ్యో వార్నింగ్

మాలిని వాళ్లు పెళ్లి సంబంధం తీసుకొస్తే మా తాత ఊరుకుంటాడా? మా తాత ఏమైనా అంటే ఆ దక్షిణామూర్తి తాత వింటాడా? మరి మధ్యలోకి ఎందుకు వచ్చావ్? మాలిని ఇంటికి మేం వెళ్లిన విషయం ఎందుకు చెప్పావ్? మా గ్రానీ ఏదో కవర్ చేసింది. మా తాత మూడ్ బాగుండి వదిలేశాడని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఔట్ హౌజ్ లోనే ఉండు, మా ఇంట్లోకి రాకు. ఎవరినీ ఇంప్రెస్ చేయాలని చూడకు అని జ్యో కోపంగా చెప్తుంది.

నాకు పెళ్లి కావడం లేదనే టాక్ క్రియేట్ చేశారు. నువ్వు, మాలిని నా జీవితంతో ఆడుకుంటున్నారు. మరోసారి నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకు. నాకు, నా ఇంటికి దూరంగా ఉండు అని సూరజ్ కు జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

మచ్చిక చేసుకోవాలని

మరోవైపు దక్షిణామూర్తి, మాలిని మాట్లాడుకుంటారు. సుమిత్ర కూతురిని మన ఇంటికి రప్పించిన విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తప్పు చేశావమ్మా అని మాలినితో అంటాడు దక్షిణామూర్తి. వాళ్లు తప్పులు చేశారు. మనమే ప్రాయశ్చిత్తం చేసేలా చేయాలి. సుమిత్రకు తండ్రి అవసరం లేదని అంటుంది. శివ నారాయణ బతికి ఉండగా సుమిత్ర ఆ భ్రమలో నుంచి బయటకు రాదు. సుమిత్రను రప్పించాలంటే మేనకోడలిని మచ్చిక చేసుకోవాలని మాలిని చెప్తుంది.

మాలిని కుట్ర

జ్యోత్స్నను ఇంటికి రప్పించాకే కాంచన కొడుకును మనసులో పెట్టుకుందని తెలిసింది. వాళ్లను కదిలించడానికే ఈ పెళ్లి సంబంధం చూశానని మాలిని చెప్తుంది. శివ నారాయణ బతికి ఉండగా సుమిత్ర ఆ భ్రమల్లో నుంచి బయటకు రాదు అన్నావు కదా. నువ్వు శివ నారాయణ చావు కోరుకుంటున్నావా? గెలవడం అంటే చంపడం కాదు. పొరపాటున కూడా అది కోరుకోకు. నువ్వే గెలిచావు రా అని శివ నారాయణ అనే రోజు కోసం వెయిట్ చేస్తున్నానని దక్షిణామూర్తి అని లోపలికి వెళ్లిపోతాడు.

సుమిత్ర కూతురిని రప్పించింది పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి కాదు. అది నా చేతికి దొరికిన ఆయుధం. ముందు ముందు ఎలా వాడతానో చూస్తారు కదా అని మాలిని అనుకుంటుంది. ఆమె మనసులో ఏదో కుట్ర ఉందని అర్థమవుతుంది.

నచ్చినవాడితోనే పెళ్లి

ఇటు దీప, కార్తీక్ తో జ్యోత్స్న గొడవ పెట్టుకుంటుంది. నా పెళ్లి అందరికీ లోకువ అయిపోయింది. ఏం జరిగినా తప్పంతా నాదే అంటారు. నాకు నచ్చినవాడితోనే నా పెళ్లి జరుగుతుంది. మీరెంత గొప్ప సంబంధం తెచ్చినా పెళ్లి చేసుకోనని జ్యో అంటుంది. నువ్వు మంచిదానివే కానీ అది నీకు తెలియదు. కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంత పెద్ద తప్పు అయినా చేసే స్థాయికి వెళ్లావని జ్యోతో దీప మాట్లాడుతుంది.

నన్ను నువ్వు అనుకొనే కదా కార్తీక్ తో పెళ్లి జరగాలని కోరుకుంది. కార్తీక్ ఎవరికి భర్త కావాలి, నాకే కదా. దీన్నే రాత అంటారని దీప అంటుంది. వీళ్ల మాటలను సూరజ్ వింటాడు. ఎవరితో ఎవరికి రాసి ఉందో తెలియదు కదా అని జ్యోత్స్న అంటుంది. నాకు దీపతో రాసి ఉంది. నీకూ అలాగే ఎవరితోనో రాసి ఉంటుంది అని కార్తీక్ చెప్తాడు. నాతోనే అని సూరజ్ అనుకుంటాడు.

108 సార్లు పేరు

సీన్ ఆఫీస్ కు మారుతుంది. వెళ్లగానే సూరజ్ తో మళ్లీ గొడవ పెట్టుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ ఏమో జ్యోత్స్న పేరునే తన తలరాతగా రాసుకుంటాడు. నా పేరు ఎందుకు రాస్తున్నావ్? అని జ్యో అడుగుతుంది. నేను ఇష్టపడ్డ అమ్మాయి నా జీవితంలోకి రావాలంటే ఏం చేయాలని సిద్దాంతిని అడిగా. 108 సార్లు అమ్మాయి పేరు రాయమన్నాడని సూరజ్ చెప్తాడు. జ్యో, సూరజ్ మళ్లీ పోట్లాడుకుంటారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More