Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ముద్దుకు సూరజ్ నో- జ్యోత్స్న రిక్వెస్ట్- దాసు కూతురే- షాకిచ్చిన దశరథ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్తు 25 ఎపిసోడ్ లో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్న ముద్దు ఇస్తానంటే సూరజ్ నో చెప్తాడు. తనకోసం మారమని జ్యో రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కార్తీక్, దీపకు సారీ చెప్పి సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. దాసు కూతురే జ్యోత్స్న అని దశరథ షాక్ ఇస్తాడు.

Published on: Aug 25, 2026, 07:01:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన రూమ్ లో దుస్తులు ఇస్త్రీ చేసుకుంటున్న సూరజ్ దగ్గరకు వెళ్లి జ్యోత్స్న మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకుని ఇంతకంటే బెటర్ పనులు చేయొచ్చు. కాబోయే భార్యకు ఓ మెసేజ్ చేయొచ్చని జ్యోత్స్న అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ కు ముద్దు

కాబోయే మొగుడు పెళ్లాం ఏం మాట్లాడుకుంటారో తెలియదా? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. నీకే తెలిసి ఉండాలి. అమ్మాయిల మైండ్ మెచ్యూర్డ్ గా ఉంటుందని సూరజ్ అంటాడు. సూరజ్ చేతిని జ్యోత్స్న పట్టుకొని ఫీల్ అవుతుంది. సూరజ్ కు ముద్దు పెట్టాలనుకుంటుంది. కానీ సూరజ్ దూరంగా జరుగుతాడు.

జ్యోత్స్న రిక్వెస్ట్

ఇది తప్పనిపించింది. ఇంకా పెళ్లి కాలేదు కదా. భార్య కావడానికి ఇంకా టైమ్ ఉందని సూరజ్ అంటాడు. ఇందుకే నువ్వంటే ఇష్టం. ఎదుటివాళ్లు ఇచ్చేది నువ్వు తీసుకోవు. నువ్వు తీసుకోవాలన్నదే నువ్వు తీసుకుంటావ్. పెళ్లి అయిన తర్వాత ఇలా స్కూల్లో లెక్కల మాస్టర్ లా స్ట్రిక్ట్ గా ఉండకు. నా కోసం మారు. ముద్దు ఇస్తే తీసుకో. నాకు బెస్ట్ ఫ్రెండ్ లా ఉండు అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది.

ఈ ప్రపంచంలో మనకు మనం నచ్చితే చాలు. ఎదుటివాళ్లకు నచ్చాల్సిన అవసరం లేదని సూరజ్ చెప్తుంటే జ్యోత్స్న తల పట్టుకుంటుంది. వదిలేయొచ్చు కదా అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. వదిలేయడానికి నువ్వేమైనా చేతిలో వస్తువా? నేను తీసుకునే ఊపిరివి. నిన్ను వదులుకోలేనని సూరజ్ చేతిని పట్టుకుంటుంది జ్యోత్స్న.

శ్రీధర్ ఇంటికి వెళ్దామని

అప్పుడే శ్రీధర్, కార్తీక్, దీప వస్తారు. సూరజ్ ను తమ ఇంటికి తీసుకెళ్తామని శ్రీధర్ చెప్తాడు. నువ్వు పెళ్లి కొడుకువి. నేను పెళ్లి కొడుకు తండ్రివి. సో మనం మన ఇంటికి వెళ్తున్నాం. రేపు పొద్దున మంగళ స్నానాలు పూర్తి చేసుకొని మగ పెళ్లివాళ్లలా వద్దామని శ్రీధర్ చెప్తాడు.

షాకిచ్చిన సూరజ్

నేను రాలేను. అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేద్దామని సూరజ్ షాక్ ఇస్తాడు. అందరూ అదే మాటకు ఓకే అంటారు. జ్యోత్స్న నీకు సూరజ్ తో పని ఉందా? మమ్మల్ని వెళ్లమంటే వెళ్లిపోతామని కార్తీక్ అనేసరికి జ్యోత్స్న సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. ఏంటి బ్రదర్.. పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోదామనుకుంటున్నావా? మగాళ్ల వీక్ పాయింట్, ఆడాళ్ల స్ట్రాంగ్ పాయింట్ అదే. మనం స్ట్రాంగ్ గా ఉండాలి. పెళ్లాన్ని కంట్రోల్ లో పెట్టాలని కార్తీక్ చెప్తుండగా దీప వస్తుంది.

సారీ చెప్పిన సూరజ్

దీపను చూసి కార్తీక్ మాట మారుస్తాడు. పెళ్లాన్ని కంట్రోల్ లో పెట్టకుండా ఫ్రెండ్లీగా చూసుకోవాలని కార్తీక్ చెప్తాడు. అప్పుడే కార్తీక్, దీపకు సూరజ్ సారీ చెప్తాడు. నువ్వు ఏమైనా తప్పు చేశావా? అని కార్తీక్ అడుగుతాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని సూరజ్ అంటాడు. వదిన కడుపుతో ఉండి కూడా పెళ్లి పనులతో ఇబ్బంది పడుతుందని సూరజ్ సారీ చెప్పాడని దీప చెప్తుంది. సూరజ్ అవునంటాడు.

బయటకు వచ్చిన తర్వాత సూరజ్ సారీ ఎందుకు చెప్పాడని దీపతో కార్తీక్ అంటాడు. కానీ డిటెక్టివ్ లా ఆలోచించకు బావ. పెళ్లి పనులు చేయాలని దీప వెళ్లిపోతుంది.

ఆస్తి కోసం పారు

పొద్దున పెళ్లి హడావుడి కనిపిస్తుంది. జ్యోత్స్నకు ఆస్తి మొత్తం రాస్తానని చెప్పారు గుర్తుందా? అగ్రిమెంట్ రాసి అందరి ముందు చదివారు. కానీ తీరా పెళ్లి కుదిరేసరికి అందరూ మర్చిపోయారు. జ్యోత్స్న పెళ్లి పీటలు ఎక్కకముందే వీలునామా రాసి ఆస్తి మొత్తం చేతిలో పెట్టాలని పారిజాతం అంటుంది. అప్పుడే దాసు వస్తాడు. అన్నయ్యకు నువ్వు ఎందుకు గుర్తు చేస్తున్నావ్ అమ్మా? అని పారును దాసు అడుగుతాడు.

దాసు కూతురు

ఇక్కడ లేనోడివి అన్ని విషయాలు నీకెలా తెలుస్తాయని పారు అంటుంది. కూతురి పెళ్లి అంటే తండ్రి ఉండాలి కదా అని దశరథ అనేసరికి పారు, సుమిత్ర షాక్ అవుతారు. నా కూతురు పెళ్లి అంటే పిన తండ్రి ఉండాలి కదా అని దశరథ మాట మారుస్తాడు. నాకు కూతురు పుట్టినప్పుడే నీకూ కూతురు పుట్టింది. కానీ పుట్టగానే చనిపోయింది.లేకపోతే జ్యోత్స్న అంత ఉండేది దాసు అని సుమిత్ర చెప్తుంది.

దాసు కూతురు జ్యోత్స్న అన్నట్లు ఉండేది. నా కూతురు పెళ్లి నీ కూతురు పెళ్లి అనుకో దాసు అని దశరథ, సుమిత్ర చెప్తారు. ఇది నా బిడ్డ పెళ్లి అనుకుంటానని దాసు అంటాడు. దశరథ, సుమిత్ర వెళ్లిపోతారు. అమ్మ మనం వీలునామా గురించి మాట్లాడుకుందామని పారును ఆపుతాడు దాసు.

పెళ్లికి రెడీ

మరోవైపు జ్యోత్స్నను పెళ్లి కూతురిలా, సూరజ్ ను పెళ్లి కొడుకులా రెడీ చేస్తారు. శౌర్య వచ్చి జ్యోత్స్న ఫొటోలు తీస్తానంటుంది. పెద్దలకు మాటకు మాట చెప్తుంది శౌర్య. ఆ తర్వాత జ్యో ఫొటోలను శౌర్య తీస్తుంది. తాళి కట్టిన తర్వాత సూరజ్ ను బాబాయి అని పిలవాలి. వెళ్లి బాబాయి ఫొటోలు తీయమంటుంది జ్యోత్స్న. శౌర్య వెళ్లి సూరజ్ ఫొటోలు తీస్తుంది.

సూరజ్ చేతిలో ఏదో గిఫ్ట్ పట్టుకుని ఆలోచిస్తుంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More