Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప కాళ్లపై పడిన జ్యోత్స్న- మాలిని ఇంట్లో సూరజ్, చూసిన కార్తీక్‌కు షాక్

Karthika Deepam 2 Serial August 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌‌‌లో జ్యోత్స్నను దీప తన సొంత చెల్లి అనుకుంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న దీప కాళ్లపై పడి ఏడుస్తుంది. తను చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే క్షమించాలని అడుగుతుంది. మాలిని ఇంట్లో కార్తీక్‌కు సూరజ్ కనిపిస్తాడు.

Published on: Aug 24, 2026, 07:37:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్రను హగ్ చేసుకుని పెళ్లైన తర్వాత మీరంతా నన్ను మర్చిపోతారా అని దిగాలుగా అడుగుతుంది జ్యోత్స్న. అలా ఎందుకు మర్చిపోతామే, నువ్వు సూరజ్ ఇక్కడే ఉంటారుగా అని సుమిత్ర అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్

నువ్వు మా కూతురివి కాదా

పెళ్లయిన తర్వాత ప్రతి ఆడదాని జీవితం మారిపోతుందంటారు. ఒకవేళ నేను వెళ్లే పరిస్థితి వస్తే మీరు నన్ను మర్చిపోతారా, గుర్తు పెట్టుకుంటారా అనిపించిందని జ్యోత్స్న అంటుంది. ఏంటే అన్నావ్.. దానికంటే ముందు నిన్ను ఎంతో ప్రేమగా పెంచాం. పెంచడమేంటీ నువ్వు మా కూతురువి కాదా. ఏదో పరాయి బిడ్డను పెంచుకున్నట్లు అలా అంటావేంటీ అని సుమిత్ర అంటుంది.

జ్యోని ఓదార్చి నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని హత్తుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న ఇలా మాట్లాడుతుందేంటని దశరథ్ అంటే..పెళ్లయిన తర్వాత నిజం చెప్పేస్తానని జ్యోత్స్న అందని కార్తీక్ అంటాడు. పెళ్లి తర్వాత ఇది నిజం చెప్పేసేలా ఉందని పారిజాతం మనసులో అనుకుంటుంది. నువ్వు ఎక్కడికి పోవు మాతోనే ఉంటావని జ్యోతో సుమిత్ర అంటుంది.

అదే మాటను దశరథ్ కూడా అంటాడు. నిజానికి కన్నకూతురు కంటే పెంచిన కూతురు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందంటారు. ఇంతలో శుభలేఖలు వచ్చాయని చెబుతారు. అందులో ఒక కార్డ్ తీయమని దీపతో అంటాడు శివ నారాయణ. పారిజాతం ఎందుకని అడిగితే.. మొదటి శుభలేఖ మాలిని ఇంటికి పంపించాలని దీప అన్నది గుర్తు చేస్తాడు శివ నారాయణ.

జ్యోత్స్న నా సొంత చెల్లే

తనే స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చి వస్తానంటాడు. పెళ్లి పనుల గురించి దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. జ్యోత్స్న సొంత చెల్లి అయితే ఇంకా ఎలా చేసేదానివే అని కార్తీక్ అంటే.. జ్యోత్స్న నా సొంత చెల్లే. ఈ పెళ్లి నా చెల్లి కల. చెల్లి కల అక్కకు బాధ్యతే కదా అని దీప అంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న దీపను ప్రేమగా హత్తుకుంటుంది.

ఇన్నాళ్లు నిన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నా. నిన్ను అర్థం చేసుకోడానికి నాకు ఇంత టైమ్ పట్టింది. బావ నాకు కావాలనే ఒక్క కారణంతో ఎన్నో తప్పులు చేశానని జ్యోత్స్న రియలైజ్ అవుతుంది. నిన్ను పెట్టిన ఇబ్బందులు తలుచుకుంటే నేనేనా అంత మూర్ఖంగా ప్రవర్తించానిపించింది. నీ విషయంలో నేను చేసిన తప్పులు ఎలా పోగొట్టుకోవాలో తెలియట్లేదు. నా పెళ్లికి ముందే నా పాపాలు కడిగేసుకోవాలని ఉందని దీప కాళ్లపై పడుతుంది జ్యోత్స్న.

క్షమించమని వేడుకుంటుంది. అది పారిజాతం చూసి తెగ షాకైపోతుంది. వాళ్ల మాటలు చాటుగా వింటుంది. నీ కాళ్లు పట్టుకుంటే కానీ నాకు క్షమాపణ లేదని జ్యో అంటుంది. ఇంత సున్నితంగా మారిపోయావేంటీ. ఇక జరిగింది వదిలేయ్. హాస్పిటల్‌లో నన్ను అక్క అని పిలిచావుగా. అది నాకు ఇంకా గుర్తుందని దీప అంటుంది. నేను అర్థం చేసుకున్నదానికంటే నువ్వు చాలా గొప్పదానివి. నన్ను క్షమించానని చెప్పు చాలు అని జో అంటుంది.

ఈ ఘోరం చూడలేను

క్షమించానని జోని హగ్ చేసుకుంటుంది దీప. నేను కూడా క్షమిస్తానని హగ్ ఇచ్చేందుకు చేతుల చాచుతాడు కార్తీక్. దాంతో కార్తీక్ కడుపులో ఒక్కటి ఇస్తుంది దీప. అదంతా చూడలేక, తట్టుకోలేక వెళ్లిపోతుంది పారిజాతం. ఈ ఘోరం చూళ్లేను అనుకుంటు వెళ్తుంది. సూరజ్ అడ్డొస్తాడు. జ్యోత్స్న మార్పు గురించి అంటుంది. మిమ్మల్ని కూడా మార్చమంటారా అని సూరజ్ అంటే.. వద్దని వెళ్లిపోతుంది పారు.

మరోవైపు మాలిని ఇంట్లో శివ నారాయణ వాళ్లు వెళ్లి శుభలేఖ ఇస్తారు. నీ ఇష్టం మరి ఇంత తక్కువ స్థాయిలో ఉంటుందనుకోవట్లేదని మాలిని అంటుంది. నేను సూరజ్‌ను ప్రేమించాను. నేనే సూరజ్‌ను ఒప్పించాను అని జ్యో అంటుంది. ఇంతకుమించిన సంబంధం చూస్తే క్యాన్సిల్ చేసుకుంటావా అని మాలిని అంటే నేను అగ్రిమెంట్ చేసుకోలేదని జో అంటుంది.

వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ బాగానే బుట్టలో వేసుకున్నాడని మాలిని అంటుంది. మీకే మొదటి శుభలేఖ ఇస్తున్నాం. అలా అని మీరు పెళ్లికి రావాల్సిన అవసరం లేదు. ఎలాగు మీకు మర్యాద లేని మనుషులు కాబట్టి వస్తే రావచ్చు లేదా ఇంట్లోనే ఉండొచ్చు అని శివ నారాయణ అంటాడు. అంత వెటకారం అక్కర్లేదు. టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. అప్పుడు అన్నింటికి ఒకేసారి బదులు ఇవ్వాల్సి వస్తుందని దక్షిణామూర్తి అంటాడు.

శత్రువులను పక్కనే పెట్టుకోవాలని

ఇంకా పాత డైలాగులే పట్టుకుని వేలాడతావేంటని శివ నారాయణ అంటాడు. నిన్ను చూస్తే నవ్వోస్తుంది. అతి విశ్వాసం అంత మంచిది కాదు. ఇప్పటికైనా పెళ్లి ఆపేయండి. మరో మంచి సంబంధం చూడండని దక్షిణామూర్తి అంటాడు. ఈ పెళ్లి ఆగదు. అనుకున్న టైమ్‌కే జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కడతాడు. కానీ, మీరు చూడలేరు అని శివ నారాయణ అంటాడు.

రావాలి తాత. వీళ్లు నా పెళ్లి చూడాలని జ్యో అంటుంది. వీళ్ల కళ్లు మంచివి కావని తాత అంటాడు. వీళ్లు నా పెళ్లి చూడాలి. శత్రువులను ఎప్పుడు పక్కనే పెట్టుకోవాలని సూరజ్ చెప్పాడని జ్యో అంటే.. సూరజ్ మంచి మాటలే చెబుతాడు. ఏ తల్లి కన్నబిడ్డో అని శివ నారాయణ అంటాడు. దానికి మాలినికి పొలమారుతుంది. అది చూసి కడుపు మంట ఇప్పుడే పొలమారినట్లుందని శివ నారాయణ నీళ్లు ఇస్తాడు.

శుభలేఖను లోపల పెట్టమని మాలినితో నవ్వుతూ అంటాడు దక్షిణామూర్తి. అంతా వెళ్తారు. తాత, జోని కారులో వెళ్లమని స్కూటపై దీప, కార్తీక్ వస్తామంటారు. స్కూటీ కీస్ కనిపించకపోవడంతో మాలిని ఇంటికి వెళ్లి వెతుకుతాడు కార్తీక్. సోఫాలో కీస్ తీసుకుని వస్తుండగా.. అదే ఇంట్లో సూరజ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సూరజ్‌ను ఫాలో అవుతాడు.

మాలిని ఇంట్లో సూరజ్

ఒక గదిలోకి సూరజ్ వెళ్లడం చూస్తాడు కార్తీక్. ఏమైందని మాలిని, దక్షిణామూర్తి వచ్చి అడుగుతారు. ఏం లేదని సూరజ్ వెళ్లిన గది డోర్ కొడతాడు కార్తీక్. కాల్ చేస్తే అదే గదిలో నుంచి సౌండ్ వినిపిస్తుంది. సూరజ్ ఇక్కడే ఉన్నాడనుకుని డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా కొడతాడు కార్తీక్. డోర్ ఓపెన్ అవుతుంది. కానీ, ఫోన్ మాట్లాడుకుంటూ వేరే అతను కనిపిస్తాడు.

లోపల చూస్తాడు. ఎవరు కనిపించరు. అతను ఏసీ రిపేర్ వ్యక్తి అని చెబుతాడు. దాంతో పారిజాతంకు కాల్ చేసి సూరజ్ అవుట్ హౌజ్‌లో ఉన్నాడో లేదో చూడమని చెబుతాడు కార్తీక్. తాళం వేసి ఉందని పారు చెబుతుంది. ఏమైందిరా, ఎవరిని వెతుకుతున్నావ్ అని మాలిని అడుగుతుంది. ఇంతలో సూరజ్ కాల్ చేస్తాడు. ఎక్కడనువ్వాని కార్తీక్ అడిగితే.. బస్టాండ్ దగ్గర టీ తాగుతున్నానని చెబుతాడు సూరజ్.

నేను తర్వాత చేస్తానని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఏమైందని మాలిని అడిగితే.. ఎవరో తెలిసినట్లు అనిపిస్తే అని కార్తీక్ వెళ్లిపోతాడు. వట్టి అనుమాన పక్షిలా ఉన్నట్టున్నాడని దక్షిణామూర్తి అంటే.. అవును, వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని మాలిని అంటుంది. మరోవైపు రాత్రి సూరజ్ ఐరన్ చేసుకుంటుంటే జ్యోత్స్న వెళ్లి మాట్లాడుతుంది.

రేపే మన పెళ్లి

రేపే మన పెళ్లి. ఇంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉంటాయని జ్యో అంటే.. ఏంటో అవి అని సూరజ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More