Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- అనాథతో పెళ్లేంటీ- ఆఫీస్‌లో దక్షిణామూర్తి రచ్చ- ఇచ్చిపడేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial August 15th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 15వ ఎపిసోడ్‌‌ వాటే సీన్ అనేలా ఉంది. శివ నారాయణ ఆఫీస్‌లో పెట్టిన మీటింగ్‌కు దక్షిణామూర్తి, మాలిని వచ్చి జ్యోత్స్న పెళ్లిపై రచ్చ చేస్తారు. కానీ, సూరజ్ క్యారెక్టర్, గొప్పదనం గురించి చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది జ్యోత్స్న.

Published on: Aug 15, 2026, 07:36:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్ దగ్గరికి ఆఫీస్ బాయ్ నాని వచ్చి ఫ్రీగా ఉన్నారా, గీతా మేడమే అడగారని చెబుతాడు. లేదని సూరజ్ అంటాడు. దాంతో నానిపై జ్యోత్స్న ఫైర్ అయి పంపిస్తుంది. గీతా విషయంలో జ్యోత్స్న, సూరజ్ గొడవ పడతారు.

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్

గీతా నచ్చిందా

తను ఫ్రెషర్ సలహాల కోసం వచ్చింది. నీకు జెలసీగా ఉన్నట్టుందని సూరజ్ అంటాడు. లేదని, పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతుంది. నచ్చిందా గీతా. ఆఫీస్‌లో అమ్మాయిలతో మాట్లాడటం ఏంట్రా, సొంత విషయాలు కాకుండా ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవాలని జ్యోత్స్న అంటుంది.

ఇద్దరు అలాగే గొడవ పడతారు. జ్యోత్స్న వెళ్లి కోపంగా కూర్చుంటుంది. సూరజ్ మెల్లిగా నవ్వుకుంటాడు. కట్ చేస్తే సూరజ్, గీతా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. అది జ్యోత్స్న చూస్తుంది. జ్యోని చూసి మనం తర్వాత మాట్లాడుకుందామని సూరజ్ అంటాడు. మళ్లీ సూరజ్, జ్యో గొడవ పడతారు. సూరజ్ వెళ్లిపోతాడు.

నువ్వు కాస్తా కంట్రోల్‌లో ఉండాలి. ఆ సూరజ్ గాడికి జోలికి వెళ్లకు, చూస్తుంటే వాడికి లైన్ వేస్తున్నట్లున్నావ్ అని జ్యోత్స్న అంటుంది. మీరు చాలా షార్ప్ మేడమ్ అని గీతా అంటుంది. నీ మంచికే చెబుతున్నా వాడి మీద ప్రేమ, దోమ వంటి ఆశలు పెట్టుకోకని, పెట్టుకుంటే వాడిచ్చి షాక్‌కి గుక్కపెట్టి ఇస్తావని జ్యో అంటుంది. తెలుసు, సూరజ్ చెప్పాడు. మీరు ఇలా బ్యాడ్‌గా తనగురించి చెబుతారని చెప్పాడని గీతా అంటుంది.

నన్ను కూడా రెజెక్ట్ చేశాడు

మిమ్మల్ని రెజెక్ట్ చేశాడంట కదా. అంతా చెప్పాడులెండి. ఇదంతా ఆఫీస్‌లో అందరికి తెలుసు. నిజమే కదా. నేను ఆల్రెడీ సూరజ్‌కి ప్రపోజ్ చేశాను. నన్ను కూడా రెజెక్ట్ చేశాడు. నా ప్రేమను కూడా రెజెక్ట్ చేశాడు. వచ్చింది జాబ్‌కి హాయిగా ఉద్యోగం చేసుకోమన్నాడు. తిట్టడం కూడా అదో టైప్‌లా తిట్టాడు. చాలా పద్ధతిగా తిట్టాడు. సూరజ్ రెజెక్ట్ చేస్తే ఇంకా ఇష్టం పెరుగుతుంది. సూరజ్ లాంటివాడు ఫ్రెండ్‌లా ఉన్నా పర్వాలేదు అని గీతా అంటుంది.

సూరజ్ తన మనసులో ఎవరు లేరని కూడా చెప్పాడని గీతా వెళ్లిపోతుంది. అదంతా సూరజ్ వింటాడు. ఇంతలో నాని వచ్చి మీటింగ్‌కు రమ్మన్నారని జ్యోత్స్నకు చెబుతాడు. జ్యో వెళ్తుంది. మీటింగ్‌లో వర్షాలు స్టార్ట్ అయినప్పటినుంచి సేల్స్ బాగా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బిజినెస్ బాగా పెంచే ఐడియాలు చెప్పండని శివ నారాయణ అంటాడు.

అరుపులు, కేకలు లేకుండా చాలా ప్రశాంతంగా ఐడియాస్ డిస్కస్ చేయాలని శివ నారాయణ అంటుండంగానే.. దక్షిణామూర్తి గట్టిగా అరుస్తాడు. నా మనవరాలు జీవితం నాశనం అయిపోతుంటే మీటింగ్ ఏంటని అంటాడు. ఎంప్లాయిస్ అందరిని శివ నారాయణ పంపిస్తాడు. దక్షిణామూర్తి వాళ్లు బీరకాయ పీచు సంబంధంలాంటి వాళ్లు అని ఎంప్లాయిస్‌కి చెబుతాడు శివ నారాయణ.

అనాథతో పెళ్లి చేయాలనుకుంటున్నారట

నా కూతురు నీ ఇంటి కోడలు అంటూ అరుస్తాడు దక్షిణామూర్తి. బజారులో కొట్టుకున్నట్లు నీతో మాట్లాడలేను అని శివ నారాయణ అంటాడు. నువ్వు అనాథకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారట కదా అని దక్షిణామూర్తి, మాలిని అంటారు. సూరజ్ దిక్కుమొక్కులేనివాడు. వాడితోనా జ్యోత్స్న పెళ్లి చేసేదని మాలిని అంటుంది.

దక్షిణామూర్తి రెచ్చిపోయి మాట్లాడుతాడు. కార్తీక్ జోక్యం చేసుకుంటే.. నా మనవరాలు కోసం మాట్లాడుతున్నా. నీ గురించి కాదు. నువ్వు మగాడివి కాబట్టి అనాథను పెళ్లి చేసుకుంటే నీ ఇంటి పేరు చెప్పుకుంటుంది. అదే నా మనవరాలు ఏ ఇంటి పేరు చెప్పుకుంటుంది అని అరుస్తాడు దక్షిణామూర్తి. అక్షింతలు వేయడానికి నా అనే నలుగురు లేనివాడు అర్హుడు అయ్యాడా జ్యోత్స్న మెడలో తాళి కట్టడానికి, సిగ్గులేకపోతే సరి అని దక్షిణామూర్తి అంటాడు.

శివ నారాయణ గట్టిగా లేస్తూ మాటలు సక్రమంగా రాని అంటాడు. వీడొక అనాథ, ఏం చూసి వీడు నీ మనవరాలికి సరిపోతాడానుకున్నాడని దక్షిణామూర్తి అంటే.. ఏం చూడాలో చెప్పమని కార్తీక్ అంటాడు. చాలా చూడాలి. వాడి దగ్గర ఏముంది. మంచి కుటుంబం, ఆస్తి, హోదా లేదు దక్షిణామూర్తి అంటాడు. జ్యోత్స్న తాతా అని అరుస్తుంది.

నీ గొంతు కోయాలని చూస్తున్నాడు

ఇలాంటివాడితో పెళ్లి అంటే నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ మా తాత శివ నారాయణకు మనుషులను బాధపెట్టడం మాత్రమే తెలుసు. అందుకే నీ గొంతు కోయాలని చూస్తున్నాడు అని దక్షిణామూర్తి అంటాడు. మా తాతను వేలెత్తి చూపించడానికి సరిపోరు. మీరింకా బయలుదేరొచ్చు అని జ్యోత్స్న అంటుంది. నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అసలు వీడి దగ్గర ఏముందని మాలిని అంటుంది.

క్యారెక్టర్ అని జ్యో సమాధానం ఇస్తుంది. సూరజ్ దగ్గర క్యారెక్టర్ ఉంది. మీరు చెప్పిన పేరు, ఆస్తి, హోదా అంతస్తు సూరజ్‌కున్న క్యారెక్టర్ ముందు పనికిరాదు అని జ్యోత్స్న అంటుంది. నిన్ను రెజెక్ట్ చేసిన వీడి గురించా నువ్వు గొప్పగా చెప్పేదని దక్షిణామూర్తి అంటాడు. నన్ను రెజెక్ట్ చేశాడు. కానీ, దాంట్లో అబద్ధం ఏం లేదే. వాలిడ్ రీజన్ చెప్పే రెజెక్ట్ చేశాడని జ్యోత్స్న అంటుంది.

సూరజ్ చెప్పినదాంట్లో ఒక్కముక్క కూడా తప్పు లేదని జ్యోత్స్న అంటుంది. జ్యో ఏంటీ సూరజ్‌కు సపోర్ట్ చేస్తుందని దీప అంటుంది. నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పాడు. అలాంటి వాడిని మెడపట్టి గెంటేయక ఇంట్లో ఉంచుకుంటారా అని దక్షిణామూర్తి అంటాడు. ఎందుకు తాత అరుస్తున్నావ్. తప్పు నాది. అది సూరజ్ చెప్పాడు. అతను జెంటిల్‌మెన్ కాబట్టి విషయం స్పష్టంగా చెప్పాడు. తప్పు చేసిన నన్నే మా వాళ్లు క్షమించారు. తప్పు చేయని సూరజ్‌ని ఏం చేస్తారని జ్యో అంటుంది.

సూరజ్ క్యారెక్టర్ ముందు ఏది నిలబడదు

ఒకవేళ సూరజ్ తప్పు చేసుంటే మా ఇంట్లో ఉండడు. అది సూరజ్ క్యారెక్టర్. మీరు మనిషిలో ఉండే చివరి పేరుకు ఇంపార్టెన్స్ ఇవ్వొచ్చు. కానీ, క్యారెక్టర్ ముందు ఇవేవి నిలబడవు. సూరజ్ సరైనా వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి అని చాలా గొప్పగా చెబుతుంది జ్యోత్స్న. అది కాదని దక్షిణామూర్తి అంటే.. ఇక చాలు.. ఈ పెళ్లి విషయంలో తప్పేదైనా ఉందంటే అది నాది. మీరు ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని జ్యో అంటుంది.

నీకో మంచి సంబంధం చూస్తామని మాలిని అంటుంది. ఇక బయలుదేరొచ్చు. నాని అని ఆఫీస్‌ను బాయ్‌ని పిలిచి ఎవరిని పడితే వాళ్లను లోపలికి పంపించకు అర్థమైందా. వచ్చినవాళ్లు ఎవరో డోర్ దగ్గరే నిలబెట్టి మా పర్మిషన్ అడిగి పంపించాలి అని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. నీకు నష్టం జరుగుతుందమ్మా అని దక్షిణామూర్తి అంటాడు.

నువ్వు పెళ్లి చేసుకోను అన్నావట అని మాలిని అంటుంది. అది నా వ్యక్తిగతం, నేను పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తెలుసా. మీతో చెప్పానా. నా పెళ్లి గురించి మాట్లాడేందుకు మీకు ఏ అర్హత ఉంది. మీకేంటీ సంబంధం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీప చెప్పినట్లు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మీ ఇంటికే పంపిస్తాం. వెళ్లండి అని జ్యోత్స్న లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తుంది.

బీపీ ట్యాబ్లెట్ వేసుకో తాత

పదమ్మా.. వీళ్లంతా శివ నారాయణ మాయలో ఉన్నారని దక్షిణామూర్తి అంటాడు. వెళ్లు తాత. వెళ్లి బీపీ ట్యాబ్లెట్ వేసి పడుకో అని తన ప్రతి మాటతో దక్షిణామూర్తి ఆవేశాన్ని అణచివేస్తుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి, మాలిని ఇక చేసేది లేక వెళ్తారు. మాలినిని డోర్ వేసి వెళ్లమంటుంది జ్యోత్స్న. మాలిని వేసి వెళ్తుంది. తాత మనం మీటింగ్ కంటిన్యూ చేద్దామా అని జ్యోత్స్న అంటుంది.

మీరు మాట్లాడుతుండండి. నేనొక మెయిల్ చేయాల్సి ఉందని బయటకు వెళ్తాడు సూరజ్. జ్యోత్స్న చెప్పింది విన్నాక సూరజ్ మనసు మారి ఉండాలని. ఇది నాటకం అనుకోడు కదా అని కార్తీక్‌తో దీప అంటుంది. అదేంటో నేను తేలుస్తాగా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ బయటకు వెళ్తాడు.

వాళ్లకు బాగా బుద్ధి చెప్పావమ్మా అని జ్యోతో శివ నారాయణ అంటాడు. మనం బుద్ధి చెప్పాల్సింది వేరే ఉంది తాత అని పారిజాతం గురించే అంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More