Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కార్తీక్ ఫెయిల్- సూరజ్‌నే లాజిక్‌తో ఆపిన సుమిత్ర- ఏడిపించేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial August 8th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 8వ ఎపిసోడ్‌‌ కూడా వాటే సీన్ అన్నట్లుగా సాగింది. ఎప్పుడు పొగరుగా ఉండే తొలిసారి అమ్మాయిలా బాధపడి ఏడిపించేసింది. సూరజ్‌తో జ్యోత్స్న లవ్‌లో ఉందని పారిజాతంకు డౌట్ వస్తుంది. కార్తీక్ ఫెయిల్ అయ్యాడని సూరజ్ అంటాడు.

Published on: Aug 8, 2026, 07:56:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పెద్దవాళ్లు చెప్పేది కూడా వినాలిగా అని కార్తీక్ అంటే.. సారీ బ్రదర్ జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోదు. మీకు దీప గారితో పెళ్లి అయిపోయినా జ్యోత్స్న మనసులో మిమ్మల్ని లేకుండా చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు అని సూరజ్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 8 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 8 ఎపిసోడ్

చేసుకునే వాళ్ల ఇష్టాలే ముఖ్యం

దాంతో కార్తీక్ అవమానంగా తలదించుకుంటాడు. పెద్ద వాళ్ల అంగీకారం కంటే చేసుకునేవాళ్ల ఇష్టాలే ముఖ్యమని మీకు బాగా తెలుసు. ఇష్టం లేని రెండు మనసులు ఎప్పుడు కలిసి ఉండలేవు అని సూరజ్ అంటాడు. నేను అవమానించానన్న కోపంతో ఇలా చేస్తున్నావా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎలా అయినా అర్థం చేసుకో, నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను. నీ మనసులో నేనున్నాను అని నమ్మకం కలిగిన రోజున నీతో ఏడు అడుగులు నడవడానికి నేను సిద్ధంగా ఉంటాను అని సూరజ్ అంటాడు.

ఇక ఉంటాను అని సూరజ్ వెళ్లిపోతుంటే సుమిత్ర ఆపుతుంది. నా కూతురు మనసులో వాళ్ల బావ లేడని నీకు అర్థమైతే పెళ్లి చేసుకోడానికి అభ్యంతరం లేదుగా అని సుమిత్ర అడుగుతుంది. లేదు మేడమ్. కానీ, అది మీ కూతురు చెప్పాలని సూరజ్ అంటాడు. అయితే, నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయాలేదనిపిస్తే ఇక్కడే ఉండు. వెళ్లిపోతే తప్పు చేసినట్లే అని సుమిత్ర సూరజ్‌నే లాజిక్‌తో కొడుతుంది.

సరే మేడమ్ అని వెళ్లిపోతాడు సూరజ్. జ్యో పైకి వెళ్తుంది. బయట దీప, కార్తీక్ సూరజ్ మాట్లాడినదాని గురించి మాట్లాడుకుంటారు. సూరజ్ మంచివాడు కాదని నీకు అనిపించింది. ఆ అనుమానం తీరిపోయింది. సూరజ్ మంచివాడు కాకుండా అవకాశవాది అయితే జ్యోత్స్నను ఇష్టం గురించి కాకుండా పెళ్లిచేసుకునేవాడు. కానీ, సూరజ్ ఇచ్చిన డబ్బులు ఇవ్వడంతోపాటు తన జ్యోత్స్న ఇష్టాన్ని చెప్పాడు అని దీప అంటుంది.

ఒక్కో మాట నిప్పుతో కడిగేశాడు

అందరిలో చెప్పకుండా ఉండాల్సింది. అందరికి తెలిసింది అయినా ఎప్పుడు అంతగా మాట్లాడుకోలేదు. కానీ, మంచిపనే చేశాడు. అందరిముందు కుండబద్ధలు కొట్టి చెప్పాడు. సూరజ్ చెప్పింది నిజమే జ్యోత్స్న విషయంలో మనం ఫెయిల్ అయ్యాం. హాల్‌లో జరిగింది చూశాక సూరజ్‌పై నమ్మకం కలిగింది. సూరజ్ నా అనుమానాన్ని తీర్చేశాడు. ఒక్కో మాట నిప్పుతో కడిగేశినట్లు మాట్లాడాడు అని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్నకు సూరజ్‌ని మించిన భర్త రాడని, మా అమ్మకు సూరజ్ మంచి అల్లుడు అవుతాడు దీప అంటుంది. జ్యోత్స్నతో పెళ్లికి ఒప్పుకుంటే సూరజ్ మోసగాడు అయ్యేవాడు కానీ, తన నిజాయితీని నిరూపించుకున్నాడు. జ్యోత్స్న మనసు మారాలి. అది సూరజ్‌కి తెలియాలి. ఇది జరిగేలా చేయాలి అని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్న మనసును, మనిషిని మనమే మార్చాలని, అదే మన కర్తవ్యం. సూరజ్ అంటే ఇష్టమని జ్యోత్స్నతో చెప్పించాలని దీప అంటుంది. మరోవైపు సూరజ్‌ను ఎందుకు ఆపావని సుమిత్రను అడుగుతాడు శివ నారాయణ. నేనొకటి నమ్ముతున్నా. కార్తీక్ దీపకు రాసిపెట్టినట్లే సూరజ్, జ్యోత్స్నకు రాసిపెట్టి ఉందని సుమిత్ర అంటుంది.

ఇంకో సంబంధం చూసిన లాభం లేదు

జ్యోత్స్న మనసులో సూరజ్ లేడంటే కార్తీక్ ఉన్నట్లేగా. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకో సంబంధం చూస్తాం. అప్పుడు కూడా కార్తీక్ గురించి తెలిస్తే అతను కూడా అడగడని ఏంటీ నమ్మకం అని సుమిత్ర అంటుంది. సూరజ్ తన గురించే కాదు జ్యోత్స్న పెళ్లి చేసుకునే అబ్బాయి కోసం చెప్పాడని దశరథ అంటాడు. జ్యోత్స్నపై సూరజ్‌కున్న ప్రేమ గురించి మాట్లాడుకుంటారు.

జ్యోత్స్నను సూరజ్ ఇష్టపడ్డాడు, బాగా అర్థం చేసుకున్నాడు భరించాడు అని దశరథ అంటాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోను అన్నాడు, మనసు మారాలి అన్నాడు అలా టార్చర్ పెట్టేవాడు నా కూతురుకు ఎందుకుని అనిపించలేదా అని శివ నారాయణ అంటాడు. ఇదే విషయం పెళ్లి తర్వాత అంటే జ్యోత్స్న జీవితం ఏమైయ్యేది. నిజాయితీపరుడు కాబట్టే ముందే చెప్పాడు. సూరజ్ మనసున్న మనిషి, మనం తట్టుకోలేని నిజాలే మాట్లాడాడు అని సుమిత్ర చాలా మెచ్చుకుంటుంది.

మనం ఎంత వెతికినా సూరజ్ కంటే యోగ్యుడు జ్యోత్స్నకు రాడు. జ్యోత్స్నను వదిలేద్దాం. కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సుమిత్ర అంటుంది. మరోవైపు సూరజ్ రెజెక్ట్ చేయడాన్ని జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది. కళ్లు ఎర్రబడి ఉంటాయి. దాదాపుగా ఏడ్చినట్లు చూపిస్తారు. తలుపు తీయవే అని పారిజాతం కంగారుపడుతుంది.

వాడు ప్రేమించింది నిజమే గ్రానీ

తలుపు బద్ధలు కొట్టుకుని వస్తుంది పారిజాతం. తలుపు లాక్ వేయలేదా, దీనికే ఇంత బిల్డప్ ఇచ్చానా అనుకుంటుంది పారిజాతం. ఆ సూరజ్ చేసిన అవమానానికి అన్ని పగలగొడతావనుకున్నా. వాడిని అవమానించినందుకు పగబట్టి పగ తీర్చుకున్నాడని పారిజాతం అంటుంది. లేదు గ్రానీ వాడు నిజమే చెప్పాడు అని జ్యో అంటుంది.

మాజీ మిస్ హైదరాబాద్‌ను రెజెక్ట్ చేస్తాడా. వాడి బలుపు దించాలి, ఏదోటి చేయాలని పారిజాతం అంటుంది. ఏం చేయలేను. వాడు అన్ని నిజాలే చెప్పాడు. వాడు నా వెనుక బంగారం అని తిరగడం నిజమే, ఇష్టపడటం నిజమే. ప్రేమించడం నిజమే. పెళ్లి చేసుకుంటానని అనడం నిజమే. వాడు రెజెక్ట్ చేయడం నిజమే. వాడు చివరిలో అన్న మాట మనసు మీద ముళ్లు గుచ్చుకున్నట్లు ఉంది మొదటిసారి అమ్మాయిలా మాట్లాడుతుంది జ్యోత్స్న.

నా మనసులో వాడున్నాడని రుజువు చేయాలంట. వాడికి నేను రుజువు చేయాలి. వాడికి ఏ అర్హత ఏముందని రుజువు చేసుకోడానికి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్యోత్స్న. నువ్వు ఏడుస్తున్నావా అని పారు అంటే.. ఇది ఏడుపు కాదు బాధ అని జ్యో అంటుంది. నువ్వేంటీ కొత్తగా కనిపిస్తున్నావ్ అని పారిజాతం అడుగుతుంది.

ఏడిపించేసిన జ్యోత్స్న

వాడు నా వెంట తిరిగాడు. నా ప్రేమ కోసం వెంపర్లాడాడు. కానీ, పెళ్లి గురించి వచ్చేసరికి నా మాట కంటే ముందే నా మనసును అందరి ముందు పెట్టాడు. ఉరి వేసే ఖైదీకి వాడు చేసిన తప్పులు బోర్డ్ మీద రాసి మెడలో వేసినట్లే ఉంది. రెజెక్ట్ చేసిన మాట సుత్తితో కొట్టినట్లు ఉంది. అది మాములు అవమానం కాదు. ఇప్పటివరకు చాలా చేశాను. అదే ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని ఏడిపించేస్తుంది జ్యోత్స్న.

మీరు చెప్పినట్లు అందరిముందు పెళ్లికోసం వచ్చి నిల్చున్నాను. ఏమైంది. జ్యోత్స్నును పెళ్లి చేసుకుంటే కలిసి బతగలననే నమ్మకం లేదని చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పుడు అందరు తప్పు నాదంటారు. అందరి కళ్లు నావైపే చూస్తాయని జ్యోత్స్న అంటుంది. వాడు వద్దంటే ఎందుకు బాధపడుతున్నావ్ అని పారు అడుగుతుంది.

వెళ్లిపో గ్రానీ, కాసేపు వదిలేయ్ అని జ్యో అంటుంది. ఏంటే వాలకం తేడాగా ఉంది. చూస్తుంటే వాడంటే ఇష్టముండి వాడిని నీవెంట తిప్పించుకున్నట్లు ఉందని, అలా తిప్పించుకున్నావ్ కాబట్టే రెజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నావ్ అని పారు అడుగుతుంది. పో గ్రానీ, కాసేపు ఒంటరిగా వదిలేయ్ అని జ్యోత్స్న అంటుంది. కొంపదీసి సూరజ్ గాడితో జ్యోత్స్న లవ్‌లో లేదుగా అని పారిజాతం డౌట్ పడుతుంది.

జ్యోత్స్నకు చావుదెబ్బ

మరోవైపు జ్యోత్స్న మనసులో కార్తీక్ లేడని చెప్పడం సాధ్యం కాదని శ్రీధర్, కాంచన వాళ్లు మాట్లాడుకుంటారు. ఇది జ్యోత్స్నకు చావు దెబ్బ. అహం మీదే కాదు దాని పొగరు మీదే చావు దెబ్బ కొట్టాడని కాంచన అంటుంది. మళ్లీ జ్యోత్స్న పెళ్లితో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయని శ్రీధర్ అంటాడు. సూరజ్‌ను జ్యోత్స్న బతకనిస్తుందా అని కాంచన అంటుంది.

సూరజ్ మంచివాడే కానీ, ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంది. ఈరోజు సూరజ్ అలా అనడంతో నా అనుమానం బలపడింది. సూరజ్‌ను ఆపుతున్న శక్తి జ్యోత్స్న అని అర్థమైందని శ్రీధర్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More