Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న ఇంత టాలెంటెడా? మాలినికి షాక్- గీతతో సూరజ్- రగిలిపోతున్న జ్యో
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 14 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మాలినిపై జ్యోత్స్న గెలుస్తుంది. ఇక గీత అనే అమ్మాయితో సూరజ్ క్లోజ్ గా మూవ్ అవడం చూసి జ్యోత్స్నకు మండిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 14 ఎపిసోడ్ లో కథ కీలక మలుపులు తిరుగుతుంది. మాలిని, దక్షిణామూర్తికి మరోసారి అవమానం ఎదురవుతుంది.

జ్యోత్స్న ఆఫర్
రెస్టారెంట్ కోసం మాలినితో పోటీకి జ్యోత్స్నను బరిలో దించుతుంది దీప. రెస్టారెంట్ స్టాఫ్ లో ఎవరినీ జాబ్ లో నుంచి తీసేయం. మీ శాలరీలు 10 శాతం పెంచుతాం. అలాగే మీకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు, రూ.10 లక్షల వరకు పర్సనల్ లోన్లు ఇస్తామని స్టాఫ్ కు జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. లాభాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే మీకు వర్తిస్తాయని జ్యోత్స్న చెప్తూ పోతుంది.
సూరజ్ సపోర్ట్
మీ పిల్లల చదువులు కావొచ్చు, ఆరోగ్యం కావొచ్చు.. ఇలా అన్నింట్లోనూ మీకు సపోర్ట్ గా ఉంటామని స్టాఫ్ కు జ్యోత్స్న భరోసా ఇస్తుంది. ఒక్క రోజు బిర్యానీ తిని మిగతా రోజులు పస్తులుంటారా? బాగా ఆలోచించుకోండని సూరజ్ కూడా చెప్తాడు. కానీ స్టాఫ్ ఏమో రెస్టారెంట్ ను మాలిని వాళ్లకు ఇవ్వండని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
మాలినికి షాక్
సారీ సార్, జ్యోత్స్న రెస్టారెంట్ కు అని స్టాఫ్ మళ్లీ చెప్పేసరికి జ్యోత్స్న, దీప, కార్తీక్, సూరజ్ ఫుల్ ఖుషీ అవుతారు. మాలిని ఏమో షాక్ లో మునిగిపోతుంది. మంచి సంస్థలో భాగం అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని స్టాఫ్ చెప్తారు. నా రెస్టారెంట్ ను జ్యోత్స్న రెస్టారెంట్స్ కే ఇస్తున్నానని మాలినికి గౌరీ ప్రసాద్ తెగేసి చెప్తాడు.
క్రెడిట్ జ్యోత్స్నదే
బయటకు వెళ్లి తాత మనమే గెలిచామని శివ నారాయణతో జ్యోత్స్న ఆనందంగా చెప్తుంది. కంగ్రాట్స్ మనవరాలా.. తాత పేరు మరోసారి నిలబెట్టావని శివ నారాయణ పొంగిపోతాడు. ఈ క్రెడిట్ మొత్తం జ్యోత్స్నదే. స్టాఫ్ తో తనే మాట్లాడింది. సూరజ్ సాయంగా ఉన్నాడని కార్తీక్ చెప్తాడు. సపోర్ట్ చేసేవాళ్లు లేకపోతే ఎవరూ ఏం గెలవలేరు తాత అని జ్యోత్స్న అంటుంది.
వెటకారం వద్దు బాబాయ్
ఏం చేసి రెస్టారెంట్ దక్కించుకున్నావో ఎవరికి తెలుసుని దక్షిణామూర్తి అసహనంతో ఊగిపోతాడు. ఆ విషయం నీ కోడలిని అడుగు దక్షిణామూర్తి. ముఖం చూపించలేక లోపలే ఉండిపోయినట్లుంది. వెళ్లి ఓదార్చమని శివ నారాయణ చెప్తాడు. అంత వెటకారం వద్దు బాబాయ్. పోటీపడటంలో దీనివి అన్ని మేనత్త పోలికలే అని జ్యోత్స్న గురించి మాలిని అంటుంది.
దీప కౌంటర్
నీతో నన్ను పోల్చుకోకు అత్త అని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. వరుసలు పెట్టి పిలిస్తేనే మనసు హాయిగా ఉంటుందని జ్యోత్స్న అంటుంది. దక్షిణామూర్తి, మాలినికి ఈ అవమానం సరిపోతుందేమోనని శివ నారాయణ అంటాడు. మీరు మారండి. ఎదుటివారిని ఓడించడానికి ప్రయత్నించకండి. మీరు డబ్బుతో గెలవాలనుకున్నారు. జ్యోత్స్న మంచి మాటలతో గెలిచిందని దీప దిమ్మతిరిగే కౌంటర్ వేస్తుంది.
అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే గుడ్ వర్క్ అని సూరజ్ నుంచి మెసేజ్ రావడంతో జ్యోత్స్న తెగ సంబరపడిపోతుంది.
గీతతో సూరజ్
సీన్ ఆఫీస్ కు మారుతుంది. గీత అనే అమ్మాయి సూరజ్ దగ్గరకు వచ్చి ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యానని చెప్తుంది. కంపెనీ విషయాలను మిమ్మల్ని అడిగి తెలుసుకోమ్మని ఛైర్మన్ చెప్పారు. ఫ్రీగా ఎప్పుడు ఉంటారో చెప్తే నేనే మీ దగ్గరకు వస్తానని గీత అడుగుతుంది. నీ డెస్క్ దగ్గరకి నేనే వస్తానని సూరజ్ చెప్తాడు. సూరజ్ ను గీత పొగిడేస్తుంది.
జ్యోత్స్న కోపం
మీరు నాకు నచ్చారని సూరజ్, గీత ఒకరికొకరు చెప్పుకొంటారు. మీకు పెళ్లయిందా అని గీత అడుగుతుంది. ఇదంతా చూస్తున్న జ్యోత్స్నకు మండిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందని కోపంగా అడుగుతుంది. ఆవిడ ఎవరు? అని గీత అడుగుతుంది. సీఈఓ గారి డీఏ అని వెటకారంగా చెప్తాడు సూరజ్. ఇక సూరజ్, గీత ఏమో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. జ్యోత్స్న ఏమో కోపంతో అరిచేస్తుంది.
మాటిచ్చిన కార్తీక్, దీప
కార్తీక్, దీప ఏమో శివ నారాయణ ఇంటికి వెళ్లి మాట్లాడతారు. సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యత అని సుమిత్ర, దశరథకు కార్తీక్, దీప మాటిస్తారు. జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడని దీప చెప్తుంది. హక్కులా భావించిన బావ తనకు దక్కకపోయేసరికి జ్యోత్స్న పంతం పెంచుకుంది. కానీ ఇప్పుడు తనకు పంతానికి, ప్రేమకు తేడా తెలుసు అని దీప వివరిస్తుంది. వాళ్ల మధ్య అడ్డుగోడ తొలగించే ఏర్పాట్లు చేశామని కార్తీక్ వెల్లడిస్తాడు. అంటే గీత అనే అమ్మాయిని వీళ్లే పంపించినట్లు తెలుస్తోంది.
మాలిని ఆరా
ఇక పారిజాతాన్ని మళ్లీ ఇంటికి పిలిపించుకొని జ్యోత్స్న పెళ్లి గురించి మాలిని ఆరా తీస్తుంది. నా మేనకోడలి జీవితాన్ని చక్కదిద్దుతానని మాలిని చెప్తుంది. శివ నారాయణ ఇంటికి అల్లుడు అంటే శ్రీధర్ లా రెండు పెళ్లిల్లు చేసుకోవాలని మాలిని వెటకారంగా మాట్లాడుతుంది. మాలిని రెచ్చగొట్టే సరికి జ్యోత్స్న పెళ్లి సూరజ్ తో ఖాయమైందని పారిజాతం నోరు జారుతుంది.
మాలినికి అన్ని విషయాలను పారిజాతం చెప్పేస్తుంది. మా జ్యోత్స్న పెళ్లి అందరికీ తలనొప్పిలా మారింది. ఆ సూరజ్ ఒప్పుకోడు. ఈ జ్యోత్స్న జీవితంలో పెళ్లి చేసుకోనని అంటుందని పారు చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


