Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. అమ్మ బాబోయ్- పెళ్లిపై జ్యోత్స్న సంచలన నిర్ణయం- అందరికీ మైండ్ బ్లాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 10 ఎపిసోడ్ లో జ్యోత్స్న సంచలన నిర్ణయం తీసుకుంటుంది. అసలుతాను పెళ్లి చేసుకోనని అందరికీ షాక్ ఇస్తుంది. ఆస్తులు కూడా వద్దంటుంది. పాత జ్యోత్స్న ఇక లేదని అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 10, 2026, 07:03:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ పై శ్రీధర్ ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంటాడు. సూరజ్ ను ఆపే శక్తి జ్యోత్స్ననే. కానీ పెళ్లిని రిజెక్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడని శ్రీధర్ అంటాడు. సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ ఇగోయిస్ట్ లే. ఎవరో ఒకరు మారాలి. అది జరిగేలా చేస్తాం. వాళ్లను కలుపుతాం. ఈ పెళ్లి చేస్తామని కార్తీక్ చెప్తాడు. మనమే ఏదో ఒకటి చేయాలని దీప కూడా అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ కు దీప కాల్

అప్పుడే సూరజ్ కు దీప కాల్ చేస్తుంది. జ్యోత్స్నతో నీకు పెళ్లి చేయాలని అంటారని ఊహించలేదు కదా. నువ్వు నో చెప్తావని కూడా మేం ఊహించలేదు. నువ్వు తప్పు చేశావని అనుకుంటే అవుట్ హౌజ్ వదిలి వెళ్లేవాడివని దీప అంటుంది. సుమిత్ర మాట నన్ను ఆపేసిందని సూరజ్ చెప్తాడు. అయితే నువ్వు ఆఫీస్ కు కూడా రావాలి. సుమిత్రమ్మ అన్న మాటే నేనూ అంటాను. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఆఫీస్ కు వచ్చి నీ పని నువ్వు చేసుకోవాలని దీప చెప్తుంది.

ఆఫీస్ కు రావాలని

నేను సీఈఓగా ఉన్నంత కాలం నువ్వు నాతో ఉండాలి. రిజెక్ట్ చేస్తానంటావా? అని దీప అంటుంది. వదిన, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావ్ కదా అని సూరజ్ అడుగుతాడు. అదేం లేదు మరిది, మార్నింగ్ ఆఫీస్ కు వచ్చి నీ వర్క్ చూసుకో అని దీప కాల్ కట్ చేస్తుంది. వదిన మాట కాదనలేను, ఆఫీస్ కు వెళ్లాల్సిందేనని సూరజ్ అనుకుంటాడు.

జ్యోత్స్నలో తేడా

మరోవైపు సూరజ్ రిజెక్ట్ చేయడాన్ని జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది. ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది. అప్పుడే జ్యోత్స్న దగ్గరకు సూరజ్ వెళ్లి మాట్లాడతాడు. ఏంటి ఏడ్చావా? జరిగిన దానికి నువ్వు అవుట్ హౌజ్ మీద దండయాత్ర చేయాలి. కానీ ఇలా కూర్చుని బాధపడుతున్నావంటే ఏదో తేడా కనిపిస్తోందని సూరజ్ అంటాడు. నువ్వు ఎవర్రా, నన్ను రిజెక్ట్ చేయడానికి అని జ్యో కోపంతో రెచ్చిపోతుంది.

జ్యో కోపం

నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. ఏ తప్పు లేకపోతే ఇక్కడే ఉండమని మీ అమ్మ చెప్పారు. నేను వెళ్లిపోతే తప్పు ఉందని ఒప్పుకున్నట్లే కదా. నీ తప్పు లేదా? మనకు పెళ్లి చేయాలని తెలిసినా రాత్రికి రాత్రే నన్ను ఇక్కడ నుంచి పోయేలా చేశావని సూరజ్ అంటాడు. నువ్వు మనషులను సైకలాజికల్ గా హింసిస్తావని జ్యోత్స్న కోప్పడుతుంది.

లవ్ చేస్తున్నావా?

నన్ను రిజెెక్ట్ చేశానని అన్నందుకు బాధపడుతున్నానని జ్యో అంటుంది. అప్పుడు నువ్వు కూడా రిజెక్ట్ చేశావని చెప్పొచ్చు కదా అని సూరజ్ అనగానే జ్యోకు షాక్ తగులుతుంది. ఓ, నన్ను లవ్ చేస్తున్నావా? నేను యాక్సెప్ట్ చేస్తానని చూస్తున్నావా? అని సూరజ్ అడుగుతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ మనసులో నేను ఉన్నానని నన్ను నమ్మించాలి. నేను నమ్మేలా నువ్వు మారాలని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు.

కారణం దీప

ఇక జ్యోత్స్నకు కాల్ చేసి దీప మాట్లాడుతుంది. నువ్వు గెలవాలి జ్యోత్స్న. మనల్ని వద్దనుకునవాళ్లే మనల్ని కావాలనుకోవడమే గెలుపంటే. నువ్వు నా తోబుట్టువులాంటి దానివి అని దీప అంటుంది. ఇలాంటి బంధాలు వద్దు. అవసరం తీరాక అన్నీ పోతాయి. సూరజ్ ఈ ఇంటి కాంపౌండ్ కు రావడానికి కారణం నువ్వే దీప అని జ్యో కాల్ కట్ చేస్తుంది. జ్యోత్స్న పెళ్లి మన బాధ్యత అని కార్తీక్, దీప మాట్లాడుకుంటారు.

పెళ్లి వద్దని షాక్

ఉదయం శివ నారాయణ ఇంటికి కార్తీక్, దీప వెళ్తారు. చీరలో వయ్యారంగా అడుగులు వేస్తూ వస్తున్న జ్యోత్స్నను చూసి అందరూ షాక్ అవుతారు. జ్యో శుభవార్త చెప్తుందని అందరూ వెయిట్ చేస్తారు. కానీ, నాకు ఈ పెళ్లి వద్దు అని జ్యో దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. సూరజ్ నే కాదు, నేను ఎవరినీ పెళ్లి చేసుకోను. అసలు నాకు జీవితంలో పెళ్లే వద్దు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని జ్యో షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.

ఆస్తులు కూడా వద్దు

పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తానన్నారు. పెళ్లి వద్దనుకున్న దాన్ని ఆస్తి కావాలని ఎలా కోరుకుంటా? నాకు ఆస్తులు వద్దు. ఇలాగే ఒంటరిగా బతికేస్తా. నా గురించి ఎవరూ ఎందుకు టెన్షన్ పడాలి? నాకు నచ్చినట్లు బతికే హక్కు నాకు ఇవ్వండి. ఇదే నా సమస్యకు పరిష్కారం. మళ్లీ చెప్తున్నా.. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను. ఆఫీస్ లో నాకు ఇచ్చిన జాబ్ చేస్తా. పాత జ్యోత్స్న ఇక లేదని చెప్పి జ్యోత్స్న ఆఫీస్ కు వెళ్తుంది.

జ్యోత్స్న నిర్ణయంతో అందరూ షాక్ కు గురవుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More