Karthika Deepam 2: ఈ సూరజ్ ఏంటి ఇలా ఉన్నాడు? సైకో విలన్ జ్యోత్స్ననే లవ్ లో పడేశాడుగా.. కార్తీక్ దీపం 2 ట్విస్ట్ అదుర్స్
Karthika Deepam 2: తెలుగు నాట టాప్ సీరియల్స్ లో ఒకటైన కార్తీక దీపం 2 టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొడుతోంది. ట్విస్ట్, సస్పెన్స్, మిస్టరీతో ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ అందిస్తుంది. తాజాగా సూరజ్ తన క్యారెక్టర్ తో జ్యోత్స్ననే ప్రేమలో పడేయడం హైలైట్ గా నిలిచింది.
Karthika Deepam 2: బుల్లితెరపై ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. అప్పట్లో కార్తీక దీపం సీరియల్ టీవీ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తీక దీపం 2’ కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం టీవీలో మోస్ట్ ట్రెండింగ్ సీరియల్ గా కార్తీక దీపం 2 కొనసాగుతోంది. ఈ సీరియల్ లో వస్తున్న ట్విస్ట్ లు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.

సూరజ్ మిస్టరీ
కార్తీక దీపం 2 సీరియల్ లో ప్రస్తుతం కొత్త క్యారెక్టర్లు చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సూరజ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అసలు ఈ సూరజ్ ఎవరు అనే మిస్టరీని మేకర్స్ పక్కాగా కొనసాగించడంలో సక్సెస్ అవుతున్నారు. సూరజ్ క్యారెక్టర్ లోని షేడ్స్ తో సీరియల్ క్రేజ్ ఇంకా పెరుగుతోంది.
జ్యోత్స్న లవ్
కార్తీక దీపం 2 సీరియల్ విలన్ ఎవరంటే అందరూ జ్యోత్స్న అని చెప్తారు. బావ కార్తీక్ తనకు సొంతం కావాలని, దీపను నాశనం చేయాలని సైకో ప్లాన్ లతో జ్యోత్స్న విలనిజం చూపిస్తూ వస్తోంది. కానీ కొన్ని వారాలుగా జ్యోత్స్న విలనిజానికి బ్రేక్ పడింది. అందుకు ప్రధాన కారణం సూరజ్. బంగారం అంటూ జ్యోత్స్న వెనుకాల పడ్డ సూరజ్ ఆ లేడీ విలన్ ను లవ్ లో పడేసినట్లే కనిపిస్తున్నాడు.
రివర్స్ డ్రామా
అసలు సూరజ్ ఎంట్రీనే కార్తీక దీపం 2 సీరియల్ కు పెద్ద ప్లస్ గా మారింది. మంచోడిలా శివ నారాయణ అండ్ ఫ్యామిలీ ప్రేమను గెలుచుకున్నాడు సూరజ్. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటానని ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాడు. కానీ తీరా ఫ్యామిలీ అంతా కలిసి జ్యోత్స్నను పెళ్లి చేసుకోమంటే మాత్రం నో చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ మామూలుగా లేదు. ఇక్కడే సూరజ్ రివర్స్ డ్రామా ఆడుతున్నాడని తెలుస్తోంది.
జ్యో కన్నీళ్లు
కార్తీక దీపం 2 సీరియల్ లో ఫస్ట్ నుంచి విలన్ జ్యోత్స్న ఎదుటివాళ్లను ఏడిపిస్తూ వచ్చింది. సొంత తండ్రి దాసు, పెంచిన తల్లిదండ్రులు దశరథ, సుమిత్రతో పాటు కార్తీక్, దీపను జ్యోత్స్న ఏడిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా లండన్ లో చదువుకొని వచ్చిన బావను తన డ్రైవర్ ను చేసుకుంది. దీపను చంపాలని చూసింది. సుమిత్ర ప్రాణాలు పోవాలని కుట్ర పన్నింది.
అలాంటి విలన్ జ్యోత్స్నలో ఇప్పుడు హఠాత్తుగా మార్పు వచ్చింది. అందరినీ ఏడిపించిన జ్యోత్స్న తాజాగా కన్నీళ్లు పెట్టుకోవడంతో సీరియల్ ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ సూరజ్ మాములోడు కాదు.. విలన్ జ్యోత్స్ననే లవ్ లో పడేశాడని మాట్లాడుకుంటున్నారు.
పెళ్లి జరుగుతుందా?
జ్యోత్స్న ఇగోపై సూరజ్ దెబ్బకొట్టాడు. ఇప్పటికీ జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడంటూ నిజాలను బాంబులా పేల్చాడు. ఇది జ్యోకు చావు దెబ్బలా తగిలింది. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటావా అని శివ నారాయణ అండ్ ఫ్యామిలీ అడిగితే సూరజ్ రిజెక్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ అవమానం, బాధ, ప్రేమ తట్టుకోలేక జ్యో ఏడ్చేసింది. మరి జ్యోత్స్న తన పట్టువీడి సూరజ్ ను పెళ్లి చేసుకుంటుందా? లేదా తనలోని పాత విలన్ ను బయటకు తీస్తుందా? అన్నది చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


