KBC 18: మీరూ గెలవచ్చు రూ.7.5 కోట్లు.. అమితాబ్ బచ్చన్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 18 ఆ రోజు నుంచే
KBC 18: అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా 26 ఏళ్లుగా అలరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18 రాబోతోంది. ఆగస్టు 10 నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈసారి పెద్ద ట్విస్టే ఇచ్చారు.
KBC 18: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఐకానిక్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) 18వ సీజన్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి మరోసారి సిద్ధమయ్యారు. ఈసారి కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదని, ప్రతీ ప్రశ్నకి గట్టిగా ఆలోచించాల్సిందేనంటూ 'సోచ్నా పడేగా' (Sochna Padega) అనే సరికొత్త థీమ్‌తో బుల్లితెరను షేక్ చేయడానికి డేట్ కూడా లాక్ చేశారు.

ప్రోమోలతో రచ్చ లేపిన బిగ్ బీ.. ఏంటా 'సోచ్నా పడేగా' ట్విస్ట్?
ఈ రోజుల్లో గూగుల్, స్మార్ట్‌ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరకడం చాలా ఈజీ అయిపోయింది. అందుకే ఈ 18వ సీజన్‌లో కేవలం సమాధానాలు బట్టీ పట్టేవాళ్లకు చెక్ పెడుతూ, ఆలోచించే సత్తా ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
దీనికి సంబంధించి రీసెంట్‌గా రిలీజ్ చేసిన మూడు ప్రోమోల్లో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "మీ జేబులో ఉన్న ఫోన్‌లో ప్రతీ ప్రశ్నకి జవాబు దొరికేస్తోంది, కానీ ఈసారి కేవలం సమాధానం గుర్తుపెట్టుకుంటే సరిపోదు.. లోతుగా ఆలోచించాలి" అంటూ బిగ్ బి క్లారిటీ ఇచ్చారు.
AI యుగంలో మారిన గేమ్ షో రూల్స్
రెండో ప్రోమోలో జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ పుస్తకాలు చదివేసి వచ్చి హాట్ సీట్‌లో కూర్చుంటే పప్పులు ఉడకవని అమితాబ్ హెచ్చరించారు. మూడో ప్రోమోలో ఏఐ (AI) ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో వివరిస్తూ, మారుతున్న కాలంతో పాటు కేబీసీ కూడా తన రూపురేఖలు మార్చుకుందని వెల్లడించారు.
2000వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ బుల్లితెర సంచలనం గత 26 ఏళ్లుగా ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు క్రియేట్ చేసింది. వయసు ఎనిమిది పదులు దాటినా అమితాబ్ బచ్చన్ ఎనర్జీ, ఆయన హోస్టింగ్ శైలి కోట్ల మంది అభిమానులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్? టైమింగ్స్ ఇవే!
ఈ మోస్ట్ అవైటెడ్ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18 ఆగస్టు 10వ తేదీ నుంచి రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (Sony Entertainment Television) ఛానెల్‌తో పాటు సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పటికే ఈ షోకి సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ఆడిషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. సరికొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ గేమ్ విత్ థింకింగ్ రూల్స్‌తో వస్తున్న ఈ సీజన్ ఓటీటీ, టీవీ టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


