Keerthy Suresh LGBTQ: తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'డోరతీ' (Dorothy) సినిమా గొడవే నడుస్తోంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిందో లేదో.. అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి తెరలేపింది. సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్, LGBTQ థీమ్స్ తమిళ ఆడియెన్స్‌కి ఏమాత్రం మింగుడు పడటం లేదు.
డోరతీ మూవీ స్టోరీ ఏంటంటే?

1990ల కాలంలో మధురై బ్యాక్‌డ్రాప్‌లో సాగే కుల వివక్ష, హింస, పురుషాధిక్య సమాజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కార్తి (రిషికాంత్), సుబ్బు (సనంత్) అనే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ జీవితాల్లోకి డోరతీ (కీర్తి సురేష్) రావడం వల్ల వాళ్ల లైఫ్ ఎలాంటి అనూహ్య మలుపు తిరిగింది అనేది మెయిన్ పాయింట్.
సినిమా కథ కంటే కూడా ఇందులో ఇద్దరు మగ పాత్రల మధ్య చూపించిన ఇంటీమేట్ సీన్లు, ముద్దు సన్నివేశాలే ఇప్పుడు నెట్‌లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. తమిళ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ కార్తీక్ సుబ్బరాజ్‌తో పాటు కీర్తి సురేష్‌పై ఒక వర్గం నెటిజన్లు దారుణంగా విరుచుకుపడుతున్నారు.
టొరంటో ఫెస్టివల్ మెప్పు నుండి సోషల్ మీడియా ట్రోలింగ్ వరకు
ఇటీవలే ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రీమియర్ అయిన ఈ సినిమా అక్కడ స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. కానీ మన దగ్గర థియేటర్లలోకి వచ్చేసరికి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో ఇలాంటి సున్నితమైన, సెన్సేషనల్ లైన్ ఎంచుకోవడంపై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని కొందరు అర్బన్ ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. అయితే మాస్ జనాలు మాత్రం ట్రోల్స్ రూపంలో విమర్శలు గుప్పిస్తూ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన సంస్కృతి నాశనం చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నిజానికి 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఆర్టికల్ 377ను రద్దు చేసిన తర్వాత ఈ ఎల్టీబీటీక్యూ థీమ్ తో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే తమిళం, తెలుగులాంటి భాషల్లో మాత్రం చాలా తక్కువే. అలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ఎంచుకోవడంపైనే ఇప్పుడు తమిళనాడు రగులుతోంది.
డోరతీ మూవీ విశేషాలు
{{/usCountry}}నిజానికి 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఆర్టికల్ 377ను రద్దు చేసిన తర్వాత ఈ ఎల్టీబీటీక్యూ థీమ్ తో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే తమిళం, తెలుగులాంటి భాషల్లో మాత్రం చాలా తక్కువే. అలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ఎంచుకోవడంపైనే ఇప్పుడు తమిళనాడు రగులుతోంది.
డోరతీ మూవీ విశేషాలు
{{/usCountry}}• టైటిల్ రోల్ : కీర్తి సురేష్ (డోరతీ)
• లీడ్ రోల్స్ : సనంత్ (సుబ్బు), రిషికాంత్ (కార్తి), ముత్తుకుమార్
• డైరెక్టర్ : కార్తీక్ సుబ్బరాజ్
• మ్యూజిక్ : ఇళయరాజా
• సినిమాటోగ్రఫీ : ఎస్. తిరునావుక్కరసు
• రిలీజ్ డేట్ : 25 సెప్టెంబర్ 2026 (టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్)
• సర్టిఫికేషన్ : 'A' సర్టిఫికేట్ (146 నిమిషాలు)
ఇళయరాజా మ్యూజిక్, ధనుష్ ప్రశంసలు
ఒకవైపు నెగెటివిటీ కనిపిస్తున్నా, సినీ ప్రముఖులు ఈ సినిమాకి అండగా నిలుస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాని ఒక 'మాస్టర్ పీస్' అని అభివర్ణించారు.
ఇసైజ్ఞాని ఇళయరాజా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసిందని, కార్తీక్ మేకింగ్ టాప్ నాచ్ అని ధనుష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ నెల్సన్, ఏఆర్ మురుగదాస్ లాంటి వాళ్లు కూడా ఈ డోరతీ మూవీ టీమ్‌కి సపోర్ట్ అందించారు.
తెలుగులో రిలీజ్ అవుతుందా?
ఈ గొడవ నడుస్తుండగానే డైరెక్ట్‌గా తెలుగు ఆడియెన్స్‌ని ఒక ప్రశ్న అడిగారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయమంటారా అని ఆయన పోస్ట్ చేయగా, ఇక్కడ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చ చూస్తుంటే తెలుగు వర్షన్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్ స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, కథలో ఆమె క్యారెక్టర్ ఎంతో కీలకమని టాక్ వినిపిస్తోంది.