Khalifa Twitter review: యానిమల్ రేంజ్ క్లైమాక్స్.. అయినా డిజాస్టర్ టాక్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా ట్విటర్ రివ్యూ
Khalifa Twitter review: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన ఖలీఫా మూవీకి ఫ్యాన్స్ దారుణమైన రివ్యూలు ఇస్తున్నారు. యానిమల్ రేంజ్ క్లైమాక్స్ ఉన్నా కూడా సినిమా నిరాశ పరిచిందంటూ పలువురు రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు.
Khalifa Twitter review: ఓనం రేసులో దిగిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 20న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మొదటి ఆట నుంచే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. 'పులిమురుగన్' ఫేమ్ డైరెక్టర్ వైశాఖ్ కాంబోలో వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

నిరాశ పరిచిన రోటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే
ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం.. 'ఖలీఫా' కథలో ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడమే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. కేరళ పొలిటికల్ పార్టీ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ చాలా ఊహించదగినదిగా సాగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మొదటి 40 నిమిషాలు కథలోకి వెళ్లడానికే టైమ్ తీసుకున్నారని, ఫైట్ సీక్వెన్సెస్ ఫర్వాలేదనిపించేలా ఉన్నప్పటికీ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ ఫ్లాప్‌గా మారిందని అభిమానులు పెదవి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ మాస్ అండ్ స్టైలిష్ లుక్ మినహా సినిమాలో పెద్దగా మెప్పించే ఎలిమెంట్స్ ఏవీ లేవని ఎక్స్ లో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు.
జేక్స్ బిజోయ్ బీజీఎం తేలిపోయిందా?
సాధారణంగా మలయాళ యాక్షన్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ 'ఖలీఫా' విషయంలో జేక్స్ వర్క్ కూడా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు రావడం గమనార్హం.
విలన్‌గా నటించిన నటుడి రోల్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయిందని, అంచనాలు రీచ్ అవ్వడంలో డైరెక్టర్ వైశాఖ్ ఫెయిల్ అయ్యారని నెటిజన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 'పోక్కిరి రాజా', 'పులిమురుగన్' లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన వైశాఖ్ నుంచి ఇలాంటి రోటీన్ డ్రామా వస్తుందని ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు.
'యానిమల్' టైప్ క్లైమాక్స్, ఊహించని క్యామియోలు
ఈ నెగెటివ్ టాక్ మధ్యలో కూడా ఒకే ఒక్క ఎలిమెంట్ థియేటర్లను షేక్ చేస్తోంది. సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే 3 బిగ్ క్యామియోలు ప్రేక్షకులకు క్రేజీ కిక్ ఇచ్చాయి.
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ హిట్ 'యానిమల్' రేంజ్‌లో ఉండే ఎండ్ క్రెడిట్ టెయిల్-ఎండ్ సీక్వెన్స్ థియేటర్లలో రచ్చ లేపిందని కొందరు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్ ఇచ్చిన మాస్ ఎంట్రీ, ఆయన ప్రెజెన్స్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించిందని పేర్కొన్నారు.
సెకండ్ పార్ట్ లీడ్.. బాక్సాఫీస్ వద్ద నిలబడేనా?
జీను వి అబ్రహం రాసిన కథతో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కి మొదటి పార్ట్‌లోనే ప్రాపర్ రెస్పాన్స్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. 'సలార్', 'ఆడు జీవితం' లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత పృథ్వీరాజ్ నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై నార్త్, సౌత్‌లో విపరీతమైన హైప్ నెలకొంది.
ఓనం పండుగ హాలిడే సీజన్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, మొదటి రోజు వచ్చిన ఈ నిరాశ పరిచే టాక్‌ను దాటుకుని 'ఖలీఫా' బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


