Prakash Raj: ప్రకాష్ రాజ్ ఏడ దొరికినా నరికేయాలి.. అందులో నేనుంటా: బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా బీజేపీ నేత మహేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఎక్కడ దొరికినా నరకాలని, అందులో తానుంటానని అనడం గమనార్హం.
Prakash Raj: ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసిన కామెంట్స్, వాటిపై విమర్శలు, కేసుల నేపథ్యంలో బీజేపీ నేత మహేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఎక్కడ కనిపించినా నరకాలని పిలుపునివ్వడం గమనార్హం. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హత్యకు ప్రేరేపించేలా వివాదాస్పద ప్రకటన..
ఒక బహిరంగ వీడియో సందేశంలో బీజేపీ నేత మహేందర్ రెడ్డి ఈ విపరీత వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ నిరంతరం హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
"ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు హిందూ సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. ఆయన మాటలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నాస్తికుడు అని చెప్పే ప్రకాష్ రాజ్.. తన తల్లి అంత్యక్రియలను క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చేశాడు. మరి హిందూ దేవుళ్లపై ఎలా నోరు పారేసుకుంటాడు. ఒకప్పుడు రాముడిని, కృష్ణుడిని కామెడీగా చూపించినా నడిచింది. కానీ ఇప్పుడు కుదరదు. ఇది నయా భారతం. నా రాముడి ఏమైనా అంటే ఊరుకోము. ప్రకాష్ రాజ్ ను కోర్టుకు లాగాలి. వాడు ఎక్కడ కనిపించినా నరకాలి.. అందులో నేనుంటాను" అని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వివాదానికి నేపథ్యం ఇదే..
ప్రకాష్ రాజ్ కొన్ని రోజులుగా రామలక్ష్మణులపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో రామాయణంలోని రామ, లక్ష్మణ, రావణ పాత్రల గురించి ప్రకాష్ రాజ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చారని అన్నాడు. దక్షిణాదిలో ఉన్న రావణుడి పండ్ల తోటలో పండ్లను రాముడు దొంగతనం చేశారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. అందుకే యుద్ధం మొదలైందని పేర్కొన్నాడు.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు పంపించాడు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ప్రకాష్ రాజ్ మాటలు ప్రాంతీయ వైరాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని భాను ప్రకాష్ మండిపడ్డాడు. ఇతిహాసాన్ని తీవ్రంగా వక్రీకరించాడని పేర్కొన్నాడు.
ప్రకాష్ రాజ్ వివరణ
అయితే తాను చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ మరో వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ నా ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసేలా మాట్లాడానని అంటున్నారు’’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.
‘‘అన్ని ధర్మాలను, అందరిని ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసేవాళ్లు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నన్ను యాంటీ హిందు, హిందు ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమవుతోంది. ఇప్పుడు నాకు కొన్ని పనులున్నాయి. త్వరలో వస్తా. అప్పటివరకూ ఇలాగే వాగుతుంటారా? ఊరుకుంటారా? అన్నది మీ ఇష్టం’’ అని వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


