Kiran Abbavaram Reality: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్.. బాలకృష్ణ, నాగార్జునలతో ఫైట్.. మెగా ఫోన్ పట్టి..
Kiran Abbavaram Reality: కిరణ్ అబ్బవరం మూవీకి రియాలిటీ అనే ఓ క్రేజీ టైటిల్ పెట్టారు మేకర్స్. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100 సినిమాలతో ఈ మూవీ పోటీ పడనుంది.
Kiran Abbavaram Reality: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నటుడిగానే అలరించిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌కి 'రియాలిటీ' (Reality) అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

వంటవాడిగా కిరణ్ అబ్బవరం.. 'రియాలిటీ' గ్లింప్స్ ఎలా ఉందంటే?
'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'సమ్మతమే', రీసెంట్ హిట్ 'క' (KA) సినిమాలతో మాస్, క్లాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఆయన ఆనందం ఒక వంటవాడి (Chef) క్యారెక్టర్‌లో నటిస్తుండటం విశేషం. తన పేరుపైనే హోటల్ నడుపుతూ ఉంటాడు.
ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, మాస్ కుర్రాడిగా చూసిన ఆడియన్స్.. ఇప్పుడు కిరణ్ అబ్బవరంను ఒక విభిన్నమైన రోల్‌లో చూడబోతున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ చాలా ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్ విజువల్స్‌తో క్యూరియాసిటీ పెంచేలా ఉంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ టాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా, హోటల్లో వంటవాడిగా, తన ఇంటిపై ఉన్న అప్పులన్నీ తీర్చిన బాధ్యత గల యువకుడిగా ఈ మూవీలో కిరణ్ కనిపించబోతున్నట్లు గ్లింప్స్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.
క్రిస్మస్ బాక్సాఫీస్ వార్.. బాలయ్య, నాగార్జునలతో భారీ క్లాష్
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. రాబోయే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న 'రియాలిటీ' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
అయితే ఈ క్రిస్మస్ రేసు చాలా ఆసక్తికరంగా మారబోతోంది. అదే సమయంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా 'దాదా' (Dada), అక్కినేని నాగార్జున ప్రతిష్ఠాత్మక చిత్రం 'కింగ్ 100' (King 100) కూడా డిసెంబర్ 25నే థియేటర్లలోకి రానున్నాయి. ఇద్దరు బడా సీనియర్ స్టార్ల సినిమాల మధ్యలోకి కిరణ్ అబ్బవరం తన సొంత సినిమాతో రావడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
టాప్ టెక్నీషియన్లతో జోయ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడక్షన్
'రియాలిటీ' చిత్రాన్ని జోయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ విజిల్ వేయించే భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా వరుస మ్యూజికల్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న భీమ్స్ ఈ సినిమాకు కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారని సమాచారం.
విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ డబుల్ ధమాకా ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


