...
...
Next Story

Kriti Sanon: మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఇంకెన్నాళ్లు చెబుతారు: ట్రోల్స్‌పై కృతి సనన్ ఘాటు రిప్లై

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ తనపై వస్తున్న ట్రోల్స్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Aug 25, 2026, 21:01:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ డ్రెస్సింగ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై ఆమె గట్టిగా స్పందించారు. రక్షా బంధన్ పండుగ కోసం చేసిన ఒక జ్యువెలరీ యాడ్‌లో ఆమె వేసుకున్న అవుట్‌ఫిట్‌పై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేయడంతో, "మహిళలు ఏం వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు?" అని కృతి ఘాటుగా ప్రశ్నించారు.

రక్షా బంధన్ యాడ్.. కృతి అవుట్‌ఫిట్‌పై నెటిజన్ల ఫైర్

Kriti Sanon: మేము ఏం బట్టలు వేసుకోవాలో ఇంకెన్నాళ్లు చెబుతారు: ట్రోల్స్‌పై కృతి సనన్ ఘాటు రిప్లై (AFP)
Kriti Sanon: మేము ఏం బట్టలు వేసుకోవాలో ఇంకెన్నాళ్లు చెబుతారు: ట్రోల్స్‌పై కృతి సనన్ ఘాటు రిప్లై (AFP)

GIVA జువెలరీ బ్రాండ్ కోసం కృతి సనన్ ఇటీవల ఒక రక్షా బంధన్ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఈ యాడ్‌లో ఆమె బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి స్క్రీన్ పై సోదరుడిగా నటించిన వ్యక్తికి రాఖీ కడుతూ కనిపించారు. అలాగే ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టడం ఈ యాడ్‌లో చూపించారు.

ఈ అవుట్‌ఫిట్ పండుగ వాతావరణానికి, పద్ధతులకు అస్సలు తగినట్లు లేదని కొంతమంది నెటిజన్లు కృతి సనన్ పై విమర్శలు గుప్పించారు. రక్షా బంధన్ లాంటి పవిత్రమైన పండుగ రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటని ప్రశ్నించగా, మరొకవైపు ఆమె అభిమానులు కృతికి మద్దతుగా నిలిచారు.

నా సంస్కృతి నా గుండెల్లో ఉంది.. నెక్ లైన్‌లో కాదు

ఈ ట్రోల్స్ పై కృతి సనన్ తన ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. "పండుగల నిజమైన సారాంశం మనం వేసుకునే దుస్తులలో లేదు.. ఆ పండుగ వెనుకున్న భావోద్వేగాలు, సాంప్రదాయాలలో ఉంది. రక్షా బంధన్ అంటే సోదరభావం, రక్షణకు చిహ్నం. నేను, నా సోదరి నుపూర్ ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. సోదరుడిలాగే మేం కూడా ఒకరినొకరం కాపాడుకోగలమని మాకు తెలుసు" అని రాసుకొచ్చారు.

ఈ వివాదంలోకి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఎంటర్ అయ్యారు. కృతి పేరును నేరుగా ప్రస్తావించకుండా కంగనా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు.

"ఇప్పుడు మహిళలకు చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. మన వార్డ్‌రోబ్‌లలో కాక్‌టైల్ డ్రెస్‌ల నుంచి లెహంగా చోళీలు, జీన్స్ నుంచి చీరలు, బికినీల వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇన్ని ఆప్షన్లు ఉండి కూడా అన్నకు రాఖీ కట్టేటప్పుడు బికినీ లేదా ఇన్నర్ వేర్ లాంటి డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? మీ స్టైలింగ్ ఆప్షన్లు ఏమయ్యాయి? ఈ యాడ్ కావాలని వికారంగా డిజైన్ చేసినట్లుంది" అని కంగనా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కెరీర్ పీక్స్‌లో కృతి సనన్..

కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. 'మిమి' (Mimi) సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవడంతో ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇటీవల ఆమె నటించిన 'క్రూ' (Crew), 'తేరీ బాతోం మే ఐసా ఉల్ఝా జియా' (Teri Baaton Mein Aisa Ujha Jiya) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయి.

అలాగే తన సొంత నిర్మాణ సంస్థ 'బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్' నిర్మించిన 'దో పత్తీ' (Do Patti) చిత్రంతో ఓటీటీలోకి అడుగుపెట్టి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నతో కలిసి నటించిన 'కాక్‌టైల్ 2' (Cocktail 2) మూవీ థియేటర్లలో పర్వాలేదనిపించింది. ఎంతటి ట్రోల్స్ ఎదురైనా తన స్టాండ్ తాను తీసుకుంటూ, కెరీర్‌లో వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు కృతి.

కృతి సనన్ పోస్ట్
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe