...
...
Next Story

ధనుష్‌కు షాక్.. తమిళనాడులో కనిపించని కుబేర ప్రభావం.. దారుణంగా అడ్వాన్స్ బుకింగ్స్

కుబేర మూవీపై నాగార్జున, శేఖర్ కమ్ములతోపాటు ధనుష్ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రభావం తమిళనాడులో కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ధనుష్ కు గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు.

Published on: Jun 18, 2025, 20:53:09 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ధనుష్ లాంటి స్టార్ ఉన్నా తమిళనాడులో ఈ సినిమా ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.

కుబేర అడ్వాన్స్ బుకింగ్స్

ధనుష్‌కు షాక్.. తమిళనాడులో కనిపించని కుబేర ప్రభావం.. దారుణంగా అడ్వాన్స్ బుకింగ్స్
ధనుష్‌కు షాక్.. తమిళనాడులో కనిపించని కుబేర ప్రభావం.. దారుణంగా అడ్వాన్స్ బుకింగ్స్

కుబేర మూవీలో నాగార్జున, రష్మికతో కలిసి ధనుష్ స్క్రీన్ పంచుకోనున్నాడు. దీంతో సహజంగానే మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని భావించిన మేకర్స్ కు షాక్ తగిలింది. ఇక్కడ నైజాం ఏరియాలో బుకింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నా.. తమిళనాడులో మాత్రం అసలు బజ్ లేదు.

ధనుష్ మూవీ వస్తుందంటే కనిపించే సందడి ఇప్పుడు లేదు. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత దారుణంగా ఓ ధనుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. రాయన్ తర్వాత ధనుష్ కనిపిస్తున్న సినిమా ఇది. ఇందులో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో నటించాడు.

కుబేర మూవీ గురించి..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్బా తదితరులు నటించిన ‘కుబేర’ ట్రైలర్‌ ఈ మధ్యే రిలీజైంది. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

కుబేర ట్రైలర్ ధనుష్‌తో ప్రారంభమవుతుంది. అతను ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశాడు. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపించాడు. ధనవంతులు, శక్తిమంతులే ఎప్పుడూ ప్రపంచాన్ని ఏలుతారని రష్మిక మందన్నా క్యారెక్టర్ నమ్ముతుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe