...
...
Next Story

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నెల రోజుల్లోపే.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

కుబేర ఓటీటీలోకి వచ్చేస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా.. వచ్చే వారమే డిజిల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీ ప్రీమియర్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేసింది.

Published on: Jul 11, 2025, 12:36:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఆ ఓటీటీ శుక్రవారం (జులై 11) వెల్లడించింది. జులై 18 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది.

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్
కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్

తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కుబేర ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే శుక్రవారం అంటే జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది.

“ఓ సింపుల్ మనిషి. కానీ అతని అంత సింపుల్ కాని రిడెంప్షన్ జర్నీ. కుబేర ప్రైమ్ లో జులై 18 నుంచి” అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ఈ విషయం వెల్లడించింది. మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కుబేర ఓటీటీలోకి రానుంది.

గత నెల 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. సినిమా రాగానే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకవడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఊహించినట్లే జులై 18 నుంచే మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

కుబేర మూవీ గురించి..

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నాలాంటి క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. జిమ్ సర్బ్ విలన్ పాత్ర పోషించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మూడు గంటల 10 నిమిషాల నిడివితో వచ్చిన మూవీ ఇది.

ఇందులో ఓ బిచ్చగాడి పాత్రలో ఈ తమిళ స్టార్ హీరో నటన అద్భుతమనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల మార్క్ మూవీగా కుబేర నిలిచింది. థియేటర్లలో ఒకవేళ ఈ సినిమా చూసి ఉండకపోతే జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe