ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఈ 4 మలయాళం సినిమాలు చూశారా.. థ్రిల్లర్ నుంచి రివేంజ్ థ్రిల్లర్ వరకు..

ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో థ్రిల్లర్ నుంచి రివేంజ్ థ్రిల్లర్ వరకు ఉన్న ఈ 4 సినిమాలు ఆసక్తి రేపుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ మూవీస్ మిస్ కాకుండా చూడండి.

Published on: Oct 23, 2025, 14:20:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం సినిమాలు అంటే ఆసక్తి ఉన్న వారి కోసం ప్రస్తుతం నాలుగు సినిమాలు ఓటీటీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఈవారం ఓటీటీలోకి వచ్చే మలయాళం సినిమాలు పెద్దగా లేకపోయినా.. ఈ మధ్యే వచ్చిన వీటిని మాత్రం చూడొచ్చు. మరి ఆ నాలుగు సినిమాలు ఏవి? ఏ ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి.

ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఈ 4 మలయాళం సినిమాలు చూశారా.. థ్రిల్లర్ నుంచి రివేంజ్ థ్రిల్లర్ వరకు..
ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఈ 4 మలయాళం సినిమాలు చూశారా.. థ్రిల్లర్ నుంచి రివేంజ్ థ్రిల్లర్ వరకు..

మిరాజ్ (Mirage) : సోనీ లివ్

ఆసిఫ్ అలీ, దీపక్ పరంబోల్, హకీమ్ షాజహాన్, అపర్ణా బాలమురళి నటించిన మిరాజ్ ఓ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అతను గతంలో దృశ్యంలాంటి పలు మలయాళ థ్రిల్లర్స్‌తో పేరుగాంచాడు. వాటితో పోలిస్తే ఈ మిరాజ్ అంతగా ఆకట్టుకోకపోయినా.. ఇందులో వచ్చే ట్విస్టులు మాత్రం మంచి థ్రిల్ అందిస్తున్నాయి. క్లైమ్యాక్స్ అసలు ఎవరి ఊహలకూ అందని విధంగా ఉంటుంది.

ఆభ్యంతర కుట్టవాలి (Aabhyanthara Kuttavaali): జీ5 ఓటీటీ

ఇది కూడా ఆసిఫ్ అలీ నటించిన మూవీనే. అయితే మిరాజ్ ఓ థ్రిల్లర్ కాగా.. ఇది ఓ కామెడీ డ్రామా. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మన న్యాయ వ్యవస్థలో వేధింపుల కేసుల మరో కోణాన్ని ఈ మూవీ కళ్లకు కడుతుంది. అయితే ఈ సినిమా కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులో ఉంది. కొన్ని ఆలోచన రేపే సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి.

ఇంబమ్ (Imbam) : సన్ నెక్స్ట్ ఓటీటీ

ఇంబమ్ ఓ ఫ్యామిలీ రొమాన్స్ డ్రామా మూవీ. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ మధ్యే డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ సినిమా కార్టూనిస్ట్ అయిన నిధిన్ చుట్టూ తిరుగుతుంది. శబ్దం అనే పత్రికలో పని చేసే అతడు దాని యజమాని, అక్కడ పనిచేసే వారితో అతనికి ఉండే అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఈ ఇంబమ్ సినిమాలో చూపించారు.

చట్టులి (Chattuli): మనోరమ మ్యాక్స్

చట్టులి ఓ రివేంజ్ థ్రిల్లర్. ప్రతీకారంతో రగిలిపోయే ఇద్దరు వ్యక్తులు ఓ అడవిలో కలుసుకొని సాగించే ప్రయాణం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కళ్లు కనిపించని ఓ వృద్ధుడు, మరో టీనేజర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More