Illu Illalu Pillalu: బుల్లితెరపై 'స్టార్ మా' (Star Maa) ఛానెల్‌లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్స్‌లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్ లోని పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ముఖ్యంగా 'ప్రేమ' పాత్రలో నటించిన కన్నడ నటి లావణ్య భరద్వాజ్ తన అమాయకత్వం, ముద్దు ముద్దు నటనతో దాదాపు 500కు పైగా ఎపిసోడ్లలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
ప్రేమగా రీ ఎంట్రీ

అయితే, నిజ జీవితంలో గర్భవతి కావడంతో కొన్ని నెలల క్రితమే లావణ్య భరద్వాజ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకొంది. ఆ స్థానంలో ప్రేమ క్యారెక్టర్లో మరో నటి మన్విత జగదీష్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ పాత ప్రేమను సీరియల్ ప్రేమికులు మిస్ అవుతూనే ఉన్నారు. లేటెస్ట్ పాత ప్రేమ ఇల్లు ఇల్లాలు పిల్లలు సెట్ కు రీ ఎంట్రీ ఇచ్చింది.
"ఐ యామ్ బ్యాక్" పోస్ట్ వెనుక ఉన్న నిజం
ఇటీవల లావణ్య భరద్వాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో “ఐ యామ్ బ్యాక్”అని పోస్ట్ పెట్టడం బుల్లితెర వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. సీరియల్‌లోని తన తోటి నటీమణులు నర్మద (అన్షు), శ్రీవల్లి (త్రివేణి) లతో వీడియో కాల్ మాట్లాడుతూ తీసిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
దీంతో, "ప్రేమ పాత్రలోకి లావణ్య మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తుందా? కొత్తగా వచ్చిన మన్వితను సీరియల్ నుంచి తప్పిస్తున్నారా?" అంటూ అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సీరియల్ సెట్స్‌లో సందడి
ఆ అనుమానాలన్నింటికీ సమాధానం ఇస్తూ లావణ్య భరద్వాజ్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిజంగానే ఆమె 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' షూటింగ్ సెట్స్‌కు తిరిగి వచ్చింది. అయితే, అది మళ్లీ నటించడానికి కాదు.. తన పాత స్నేహితులను, 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకోవడానికి మాత్రమే!
వీడియో వైరల్
{{/usCountry}}ఆ అనుమానాలన్నింటికీ సమాధానం ఇస్తూ లావణ్య భరద్వాజ్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిజంగానే ఆమె 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' షూటింగ్ సెట్స్‌కు తిరిగి వచ్చింది. అయితే, అది మళ్లీ నటించడానికి కాదు.. తన పాత స్నేహితులను, 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకోవడానికి మాత్రమే!
వీడియో వైరల్
{{/usCountry}}హైదరాబాద్‌లోని ఇల్లు ఇల్లాలు పిల్లలు షూటింగ్ సెట్‌కు నిండు గర్భిణిగా వచ్చిన లావణ్యకు సీరియల్ యూనిట్, తోటి నటీనటులు ఘనంగా స్వాగతం పలికారు. లావణ్య సెట్స్‌లోకి అడుగుపెట్టిన దృశ్యాలను, తన బేబీ బంప్ చూపిస్తూ దిగిన క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో లావణ్య అప్ లోడ్ చేసింది.
సెట్స్‌లో వేదవతి (ఆమని), నర్మద, శ్రీవల్లి, ధీరజ్‌లతో పాటు సీరియల్ బృందం మొత్తం లావణ్యతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. సెట్స్ లో లావణ్యను చూసి ఫస్ట్ వీళ్లు షాక్ అయ్యారు. ధీరజ్-ప్రేమల క్యూట్ జోడీకి, తోడికోడళ్ల బాండింగ్‌కు బుల్లితెర ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల ఈ రీ-యూనియన్ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.