Bollywood Hit List: ఈ హీరోలే వాళ్ల టార్గెట్.. సల్మాన్ ఖాన్‌తో తిరిగితే చావేనా? లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ హిట్ లిస్ట్

Bollywood Hit List: ముంబైలో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ జరిపిన తుపాకీ కాల్పులు బాలీవుడ్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో స్నేహం, సహకారాలు కొనసాగిస్తున్న వారిపై బిష్ణోయ్ గ్యాంగ్ వరుస దాడులకు తెగబడుతోంది.

Published on: Oct 19, 2026, 21:02:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bollywood Hit List: భారతీయ సినీ పరిశ్రమను, ముఖ్యంగా బాలీవుడ్‌ను కుదిపేస్తున్న కుట్రల వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మళ్లీ సంచలనంగా మారింది. ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల ఘటన చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

Bollywood Hit List: ఈ హీరోలే వాళ్ల టార్గెట్.. సల్మాన్ ఖాన్‌తో తిరిగితే చావేనా? లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ హిట్ లిస్ట్
Bollywood Hit List: ఈ హీరోలే వాళ్ల టార్గెట్.. సల్మాన్ ఖాన్‌తో తిరిగితే చావేనా? లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ హిట్ లిస్ట్

ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడమే కాకుండా, "సల్మాన్ ఖాన్‌తో పనిచేసినా లేదా ఆయనతో స్నేహంగా ఉన్నా ఎవరినీ వదిలిపెట్టం" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఏం జరిగింది?

అక్టోబర్ 18 (ఆదివారం) సాయంత్రం ముంబైలోని జుహు పరిధిలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారును బైక్‌పై వచ్చిన ముగ్గురు అపరిచిత వ్యక్తులు వెంబడించారు. అందులోని ఇద్దరు వ్యక్తులు కారుపైకి ఉన్నపళంగా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌తో పాటు పక్కనే ఉన్న ఒక సాధారణ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ ముఠా సభ్యుడు అనిల్ పండిట్ ఓ ఆడియో నోట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. "త్వరలోనే అందరి వంతు వస్తుంది. ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో మా మాట వినకుండా, సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తాం" అని హెచ్చరించాడు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు, ముంబై నుంచి వస్తున్న రైలులో రాజస్థాన్‌లోని కోటా వద్ద ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

సల్మాన్ ఖాన్‌తో మొదలైన వైరం

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు బాలీవుడ్‌పై ఉన్న పగ అంతా సల్మాన్ ఖాన్‌తోనే మొదలైంది. 1998లో 'హమ్ సాత్-సాత్ హై' సినిమా షూటింగ్ సమయంలో జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడారనే ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్ సమాజం కృష్ణజింకలను పూజిస్తుంది. 2018లో సల్మాన్ ఖాన్‌ను చంపుతామని లారెన్స్ బిష్ణోయ్ తొలిసారి బహిరంగంగా బెదిరించాడు.

2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్ నివాసం బయట బెదిరింపు లేఖలు, బాంద్రాలోని ఆయన ఇంటిపై కాల్పుల ఘటనలు జరిగాయి.

బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ఉన్న ఇతర బాలీవుడ్ తారలు

సల్మాన్ ఖాన్‌ను నేరుగా టార్గెట్ చేయడమే కాకుండా, ఆయనతో కలిసి పనిచేసిన లేదా స్నేహంగా ఉన్న అనేకమంది ప్రముఖులపై బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు చేస్తోంది.

1. గిప్పీ గ్రెవాల్ (Gippy Grewal)

2023లో కెనడాలోని పంజాబీ నటుడు, గాయకుడు గిప్పీ గ్రెవాల్ ఇంటి బయట బిష్ణోయ్ ముఠా కాల్పులు జరిపింది. ఆయన ఇంటి బయట పార్క్ చేసిన లంబోర్గిని కారుపైకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్‌తో స్నేహంగా ఉన్నందుకే ఈ దాడి చేశామని వారు ప్రకటించారు.

2. ఏపీ ధిల్లాన్ (AP Dhillon)

2024లో యూకేలోని ప్రముఖ గాయకుడు ఏపీ ధిల్లాన్ నివాసం వెలుపల 14 రౌండ్ల కాల్పులు జరిపి, నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి 'ఓల్డ్ మనీ' అనే మ్యూజిక్ వీడియో చేసినందుకు గానూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి బ్రిటన్ కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించి దేశ బహిష్కరణకు ఆదేశించింది.

3. కపిల్ శర్మ (Kapil Sharma)

హాస్య నటుడు కపిల్ శర్మ కూడా బిష్ణోయ్ ముఠా బారిన పడ్డారు. కెనడాలోని ఆయన 'క్యాప్స్ కేఫ్' (Kap's Cafe) పై మూడుసార్లు వరుసగా కాల్పులు జరిగాయి. అంతేకాకుండా మే 2026లో ఆయనకు చెందిన 'చాయ్ సుట్టా బార్' వద్ద కూడా దాడులు చేసి, 'దారిలోకి రావాలి' అంటూ బెదిరించారు. సల్మాన్ ఖాన్‌ను తన నెట్‌ఫ్లిక్స్ షోకి ఆహ్వానించడమే కపిల్ శర్మ చేసిన తప్పని బిష్ణోయ్ వర్గం పేర్కొంది.

4. రోహిత్ శెట్టి, రణ్‌వీర్ సింగ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి ముంబై నివాసం వెలుపల బిష్ణోయ్ అనుచరులు కాల్పులు జరిపారు. అదే నెలలో నటుడు రణ్‌వీర్ సింగ్ మేనేజర్‌కు వాట్సాప్‌లో రూ. కోటి నుంచి రూ.10 కోట్ల వరకు డబ్బు డిమాండ్ చేస్తూ హారీ బాక్సర్ (హర్మాన్ సంధు) అనే బిష్ణోయ్ అనుచరుడి నుంచి బెదిరింపు వాయిస్ నోట్స్ వచ్చాయి.

ముంబై పోలీసుల అలర్ట్

వరుసగా జరుగుతున్న ఈ దాడులతో ముంబై పోలీసులు చిత్ర పరిశ్రమకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విదేశాల్లో ఉన్న బిష్ణోయ్ అనుచరుల కోసం లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేయడంతో పాటు, సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండే నటీనటులకు అదనపు రక్షణ కల్పిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More