Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లేఖ- చెబితే వినలేదు!

Lawrence Bishnoi Gang Warning Over Tiger Shroff Firing: ముంబై జూహు ప్రాంతంలో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్ ముఠా స్వీకరించింది. సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చింది. ఈ లేఖ వైరల్ అవుతోంది.

Published on: Oct 18, 2026, 21:55:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Lawrence Bishnoi Gang Warning Over Tiger Shroff Firing: ముంబైలోని విలాసవంతమైన జూహు ప్రాంతంలో ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ఊహించని సంచలన ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ యంగ్ యాక్షన్ టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు అపరిచిత వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు.

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లేఖ- చెబితే వినలేదు!
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లేఖ- చెబితే వినలేదు!

ఫుట్‌బాల్ ఆడి వస్తుండగా..

స్పోర్ట్స్ క్లబ్‌లో ఫుట్‌బాల్ ఆడి తిరిగొస్తున్న టైగర్ ష్రాఫ్, పుష్ప పార్క్ సమీపంలో తన బీఎమ్‌డబ్ల్యూ కారు ఎక్కే క్షణంలో దుండగులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామంలో టైగర్ క్షేమంగా తప్పించుకోగా, ఆయన డ్రైవర్ ఫిర్దోస్ సహా ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఫిర్దోస్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బిష్ణోయ్ ముఠా హెచ్చరికలు

ఈ దారుణ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా దీనికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అనిల్ పండిత్, హర్మాన్ సంధు అనే పేర్లతో వచ్చిన ఈ సందేశం సినీ పరిశ్రమను భయాందోళనకు గురిచేసింది.

"టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడికి మేమే బాధ్యులం. అంతకుముందు అతనికి ఫోన్ చేసి సర్దిచెప్పేందుకు యత్నించాం. మా మాట వినకపోవడంతో సరైన గుణపాఠం చెప్పాల్సి వచ్చింది" అని వారు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి

"బాలీవుడ్‌లో మా హెచ్చరికలను నిర్లక్ష్యం చేసేవారైనా, సల్మాన్ ఖాన్‌తో కలసి పనిచేసేవారైనా తర్వాతి లక్ష్యం మీరే. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడండి" అని బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగానే బెదిరింపులకు దిగింది. తమ పేరు వాడుకుని పబ్లిసిటీ పొందేందుకు చూసే ఇతర ముఠాల కథ కూడా ముగిస్తామని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

పోలీసుల ముమ్మర దర్యాప్తు

కాల్పుల సమాచారం అందగానే ముంబై పోలీసులు, అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పుష్ప పార్క్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిందితుల కోసం విస్తృత తనిఖీలు ప్రారంభించారు. ఘటనా స్థలంలో లభ్యమైన బుల్లెట్ కేసింగ్‌లను ఫోరెన్సిక్, బాలిస్టిక్ నిపుణులు సేకరించారు.

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే ఈ దాడి వెనుక నిజంగానే బిష్ణోయ్ ముఠా హస్తం ఉందా అనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.

సినిమా రంగాన్ని వణికిస్తున్న వరుస దాడులు

బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ముంబైలో దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫిబ్రవరి 1న జూహులోని ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ నివాసంపై కూడా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

అంతకుముందు 2024 అక్టోబర్ 12న మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని బాంద్రాలో కారు ఎక్కుతుండగానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. ఈ వరుస పరిణామాలు నగరంలో నటులు, నిర్మాతల భద్రతపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనతో ముంబై పోలీసులు సినీ ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More