Tiger Shroff: రెండేళ్లలో 1.37 కోట్ల లాభం- హీరో టైగర్ ష్రాఫ్ మాస్టర్ ప్లాన్- 3.5 లక్షల అద్దె కట్టినవాళ్లకే ఆస్తి అమ్మకం!

Tiger Shroff Sells Pune Property For 18% Profit: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ అదరగొడుతున్నాడు. పుణెలోని హడప్సర్ ప్రాంతంలో ఉన్న తన విలాసవంతమైన ఫ్లాట్‌ను రూ. 3.5 లక్షల అద్దె కొట్టినవాళ్లకే అమ్మేసి సుమారు 18 శాతం వరకు భారీ లాభాన్ని ఆర్జించాడు.

Published on: Apr 11, 2026, 06:34:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tiger Shroff Get Huge Profit In Real Estate: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఆస్తుల క్రయవిక్రయాల్లో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. 2024 మార్చిలో పుణెలోని హడప్సర్ ఏరియాలో రూ. 7.5 కోట్లకు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అంటే 2026 మార్చి 31న అదే ఆస్తిని రూ. 8.87 కోట్లకు విక్రయించారు. ఈ లెక్కన టైగర్ ష్రాఫ్‌కు 1.37 కోట్ల లాభం వచ్చింది.

రెండేళ్లలో 1.37 కోట్ల లాభం- హీరో టైగర్ ష్రాఫ్ మాస్టర్ ప్లాన్- 3.5 లక్షల అద్దె కట్టినవాళ్లకే ఆస్తి అమ్మకం! (PTI)
రెండేళ్లలో 1.37 కోట్ల లాభం- హీరో టైగర్ ష్రాఫ్ మాస్టర్ ప్లాన్- 3.5 లక్షల అద్దె కట్టినవాళ్లకే ఆస్తి అమ్మకం! (PTI)

అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే టైగర్ ష్రాఫ్‌కు 18.3 శాతం మేర లాభం (ROI) లభించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇది అత్యుత్తమ లాభంగా నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల కంటే ఇది రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

విలాసవంతమైన వసతులు.. భారీ ధర

ప్రముఖ బిల్డర్ పంచషీల్ రియాల్టీ నిర్మించిన 'యూ పుణె' (Yoo Pune) ప్రాజెక్టులో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. 4,249 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్‌ను చదరపు అడుగుకు రూ. 20,891 చొప్పున విక్రయించారు. ఈ లావాదేవీలో భాగంగా మూడు పార్కింగ్ స్థలాలను కూడా బదిలీ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం టైగర్ ష్రాఫ్ రూ. 62 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.

అద్దెకు తీసుకున్న వారికే అమ్మకం

ఈ డీల్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫ్లాట్‌ను 'చెరిస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీ కొనుగోలు చేసింది. నిజానికి గతంలో ఇదే కంపెనీకి టైగర్ ష్రాఫ్ నెలకు రూ. 3.5 లక్షల అద్దెకు ఐదేళ్ల కాలపరిమితితో ఈ ఫ్లాట్‌ను లీజుకు ఇచ్చారు. తాజా ఒప్పందంతో అద్దెదారులే ఆ ఆస్తికి యజమానులుగా మారారు. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇలాంటి పెద్ద ఎత్తున జరిగే రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.

రియల్ ఎస్టేట్ బాటలో బాలీవుడ్ స్టార్స్

ఒక్క టైగర్ ష్రాఫ్ మాత్రమే కాదు, గత ఏడాది కాలంగా బాలీవుడ్ అగ్ర తారలంతా తమ ఆస్తుల క్రయవిక్రయాల్లో బిజీగా ఉన్నారు. 2025లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తనకున్న పలు ఆస్తులను ఏకంగా రూ. 100 కోట్లకు పైగా విక్రయించి వార్తల్లో నిలిచారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా గతేడాది సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారు.

బాంద్రాలోని పాలీ హిల్ ఏరియాలో ప్రీతి జింటా తన అపార్ట్‌మెంట్‌ను మార్చి 2026లో రూ. 18.50 కోట్లకు విక్రయించారు. వీరితో పాటు ప్రభుదేవా, సోనాక్షి సిన్హా వంటి వారు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపును చూసి తమ ఆస్తులను లాభసాటి ధరకు విక్రయిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో, సెలబ్రిటీలు తమ పెట్టుబడులను నగదుగా మార్చుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సాధించిన ఈ 18 శాతం (రూ. 1.37 కోట్లు) లాభం రియల్ ఎస్టేట్‌లో అతని మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో, ఆర్థిక ప్రణాళిక ఎంత పక్కాగా ఉందో నిరూపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More