Peddi Movie : గుర్తింపే ఆత్మగౌరవం.. రామ్‌చరణ్ పెద్ది సినిమా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

Ram Charan Peddi Movie : సినీ ప్రపంచంలో ఒక సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాదు... జీవితాన్ని మార్చే బలమైన మోటివేషన్‌ను కూడా అందిస్తుంది. రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా జీవితానికి సంబంధించి అనేక పాఠాలను నేర్పిస్తుంది.

Published on: Jun 4, 2026, 11:11:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Movie : జీవితంలో డబ్బు, సదుపాయాలు ఎంత ఉన్నా.. మనకంటూ ఒక గుర్తింపు లేనప్పుడు, కన్నతల్లిలాంటి ఊరికి గుర్తింపు లేకుంటే ఆత్మగౌరవం లేనట్టే. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును తెచ్చే మీ ప్రతిభను, మీ వృత్తిని ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే, మన పనిలో మనకు లభించే ఆ గుర్తింపే మన ఆత్మగౌరవానికి అసలైన పునాది. మన ఊరికి మనం తెచ్చే గొప్ప పేరు అదే.

పెద్ది సినిమా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు
పెద్ది సినిమా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

రామ్‌చరణ్ పెద్ది సినిమా, అందులోని పాత్రల ప్రయాణం ప్రతి ఒక్కరినీ తమ జీవితాన్ని కొత్త కోణంలో చూసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ కథనంలో ‘పెద్ది’ అనే పాత్ర ఒక సామాన్యమైన నేపథ్యం నుండి వస్తుంది. ఆధునిక కాలంలో మనం లగ్జరీ లైఫ్, వేగవంతమైన ప్రపంచం వెనుక పరిగెడుతూ.. మన మూలాలను, మానవత్వపు విలువలను మరిచిపోతున్నాం. కానీ ఈ సినిమాలో కథానాయకుడు తనదైన నమ్మకాలు, క్రమశిక్షణ, పట్టుదలతో ఎలాంటి సవాళ్లనైనా ఎలా ఎదుర్కొన్నాడనేది చూపించారు.

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, మనం ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోకూడదు. మన సంస్కృతి, సింపుల్ లైఫ్‌స్టైల్ మనకు మానసిక ప్రశాంతతను, నిజమైన విజయాన్ని అందిస్తాయి.

పెద్ది నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

ఓర్పు - నిశ్శబ్ద పోరాటం: సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడటం కాకుండా, ‘పెద్ది’ పాత్రలాగా నిశ్శబ్దంగా, వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన అలవాట్లు: ప్రకృతికి దగ్గరగా బతకడం, శారీరక శ్రమను గౌరవించడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

నమ్మకమే మీ బలం: సమాజం మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా, మీ ప్రతిభపై, మీ శ్రమపై మీకు నమ్మకం ఉంటే ఒకరోజు విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది.

సహాయపడే గుణం: మన ఎదుగుదల కేవలం మన కోసమే కాకుండా, మన చుట్టూ ఉన్న నలుగురి బాగు కోసం ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది.

పెద్ది సినిమాలో విజయనగరం జిల్లాలో కొండ కింద ఉన్న ఊరిలో వందల మంది జీవనం సాగిస్తున్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. దానికోసం ఎవరు ఎలా కష్టపడ్డారు అని సినిమాలో చూడవచ్చు. ఒక ఊరికి గుర్తింపు లేకపోవడం అంటే, ఆ ఊరిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరి ఉనికి, ఆత్మగౌరవం దెబ్బతినడమే.

  • 'ఊరు అంటే కేవలం మనుషులుండే భూభాగం కాదు.. అది ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. ఊరికే గుర్తింపు లేనప్పుడు, అందులో బతికే మనిషి ఉనికికి విలువ ఎక్కడుంటుంది?"
  • “దేశపటంలో నీ ఊరి పేరు లేనప్పుడు, నీ పాస్‌పోర్ట్‌లో ఎంత గొప్ప ముద్ర ఉన్నా నీ ఆత్మగౌరవం సగం చచ్చిపోయినట్లే!”
  • “తల్లి లాంటి ఊరిని సమాజం గుర్తించనప్పుడు, ఆ తల్లి బిడ్డలుగా మన ఆత్మగౌరవం గాయపడటం సహజం. మన ఊరిని గౌరవించుకోవడం అంటే, మనల్ని మనం గౌరవించుకోవడమే.”
  • “ఒక మనిషికి పేరు ఎంత ముఖ్యమో.. ఒక ఊరికి గుర్తింపు అంత ముఖ్యం. గుర్తింపు లేని ఊరు, ఆత్మగౌరవం లేని బతుకు.. రెండూ ఒక్కటే!”
  • “నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా.. నీ మూలాలున్న ఊరికి గుర్తింపు లేకపోతే, నీ విజయానికి పరిపూర్ణత దక్కదు. ఊరి గౌరవంలోనే మన ఆత్మగౌరవం దాగి ఉంది.”
  • "సమాజం మన ఊరిని నిర్లక్ష్యం చేసినప్పుడు కలిగే ఆవేదన.. మన ఆత్మగౌరవంపై జరిగే దాడి లాంటిది. ఆ నిశ్శబ్దానికి బదులు, మన ఊరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే దానికి అసలైన సమాధానం."

ఇలాంటి విషయాలన్నీ పెద్ది సినిమా చూస్తే అర్థమవుతుంది. కష్టపడటం వలన వచ్చే ఫలితాలను, ఊరికి గుర్తింపు తీసుకువచ్చే పనులను మన జీవితంలోనూ చేయెుచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More