ట్రెండింగ్‌లో ఫీమేల్ సూప‌ర్ హీరో మూవీ లోకా- ఓటీటీ రిలీజ్‌పై స‌స్పెన్స్‌- స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కింది లోకా చాప్టర్ 1-చంద్ర. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Published on: Oct 20, 2025, 13:10:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కమింగ్ సూన్ అంటూ జియోహాట్‌స్టార్‌ ప్రోమోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తోంది తప్పా.. ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు.. ఇదీ లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఫ్రస్టేషన్. బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ గా నిలిచిన లోకా చాప్టర్ 1 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

లోకా చాప్టర్ 1లో కల్యాణి ప్రియదర్శన్ (x)
లోకా చాప్టర్ 1లో కల్యాణి ప్రియదర్శన్ (x)

లోకా చాప్టర్ 1 ఓటీటీ

ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ‘లోకా చాప్టర్ 1-చంద్ర’. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ మలయాళ సూపర్ హీరో థ్రిల్లర్ మూవీ కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి రాబోతుంది.లోకా చాప్టర్ 1- చంద్ర కమింగ్ సూన్ అంటూ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రోమోలు, పోస్టర్లు షేర్ చేస్తూనే ఉంది.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

జియోహాట్‌స్టార్‌లోకే లోకా చాప్టర్ 1 మూవీ వస్తుందనేది ఇప్పుడు పాత విషయం. ఎప్పుడు ఓటీటీలోకి రిలీజవుతుందన్నదే క్వశ్చన్ మార్క్ గా మారింది. డిజిటల్ ప్రీమియర్ డేట్ ను మాత్రం ఈ ఓటీటీ ఇంకా అనౌన్స్ చేయడం లేదు. ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన లోకా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందన్నది లేటెస్ట్ బజ్.

పోస్టులే పోస్టులు

లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీలోకి కమింగ్ సూన్ అంటూ జియోహాట్‌స్టార్‌ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు రిలీజ్ చేస్తోంది. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించడం లేదు. "ఒక కొత్త విశ్వం ప్రారంభం. లోకా చాప్టర్ 1: చంద్ర - త్వరలో జియో హాట్ స్టార్ లో రాబోతోంది"అని ఆ ఓటీటీ పోస్టర్ పోస్టు చేసింది. ఈ సినిమాను వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.

లోకా చాప్టర్ 1 గురించి

దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నాస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. 'లోకా చాప్టర్ 1' ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More