Samantha Pregnancy: సమంత నిజంగానే ప్రెగ్నెంటా? డైరెక్టర్ నందినీ రెడ్డి క్లారిటీ.. ఆ బేబీ బంప్ అసలు సీక్రెట్ ఇదే!

Samantha Pregnancy: సమంత నిజంగా ప్రెగ్నెంటా? సక్సెస్ మీట్ లో ఆమె వీడియోలో వైరల్ కావడంతో దీనిపై మా ఇంటి బంగారం మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి స్పందించింది. చాలా మంచి టైమ్ లో వచ్చిందంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 22, 2026, 21:15:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Pregnancy: సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సమంత ధరించిన టీషర్ట్, జీన్స్ లుక్‌లో ఆమెకు చిన్న ‘బేబీ బంప్’ కనిపించడంతో సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. సమంత ప్రెగ్నెన్సీ వార్తలపై దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ.. ఇది ఆమె జీవితంలో ఒక బ్యూటిఫుల్ టైమ్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

Samantha Pregnancy: సమంత ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి.. చాలా మంచి టైమ్‌లో వచ్చిందంటూ..
Samantha Pregnancy: సమంత ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి.. చాలా మంచి టైమ్‌లో వచ్చిందంటూ..

సక్సెస్ మీట్‌లో ‘బేబీ బంప్’.. నెటిజన్ల అంచనాలు

మా ఇంటి బంగారం’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు సమంత చాలా క్యాజువల్‌గా జీన్స్, టీషర్ట్ ధరించి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాగానే నెటిజన్ల దృష్టి అంతా సమంత పొట్ట భాగంపై పడింది.

ఆమెకు లైట్‌గా ‘బేబీ బంప్’ (Baby Bump) కనిపిస్తోందని, సమంత ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. సమంత కానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

సమంత ప్రెగ్నెన్సీపై డైరెక్టర్ నందినీ రెడ్డి ఏమన్నారంటే?

ఈ సంచలన వార్తలపై సమంత బెస్ట్ ఫ్రెండ్, దర్శకురాలు నందినీ రెడ్డి ‘సినిమా ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వ్యూలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. "సమంత జీవితంలో ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా అద్భుతమైన సమయంలో వచ్చింది. ఒకవైపు మా సినిమా ‘మా ఇంటి బంగారం’ పెద్ద సక్సెస్ కావడం, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితంలో ఈ గుడ్ న్యూస్ రావడం ఎంతో సంతోషంగా ఉంది" అని అనడం విశేషం.

అంతేకాదు ప్రెగ్నెన్సీ గురించిన రూమర్స్ వస్తాయని తెలిసినప్పటికీ, సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి సమంత స్పష్టమైన నిర్ణయంతోనే ఈ ఈవెంట్‌కు హాజరైందని నందినీ రెడ్డి పేర్కొన్నారు. నందినీ రెడ్డి ఇచ్చిన ఈ హింట్‌తో సమంత ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే సమంత, రాజ్ నిడిమోరుల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి

గతంలో అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ అండ్ డీకే (Raj & DK)లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి వెబ్ సిరీస్‌లకు పనిచేశారు.

గతేడాది సోషల్ మీడియాలో రాజ్ ఫోటోలను సమంత షేర్ చేస్తూ హింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వీరి వివాహం అత్యంత సింపుల్‌గా జరిగింది. రాజ్ నిడిమోరుకు కూడా ఇదివరకే శ్యామలీ దేతో వివాహం కాగా, వారు ఎప్పుడు విడిపోయారనేది అధికారికంగా తెలియదు.

మయోసైటిస్ బ్రేక్ తర్వాత సమంత సెకండ్ ఇన్నింగ్స్

2022లో సమంత అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ‘మయోసైటిస్’ (Myositis) బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన సామ్.. ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. 2025లో ఆమె స్వయంగా నిర్మించి, క్యామియో రోల్ చేసిన హారర్ కామెడీ ‘శుభం’ మంచి టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ (Rakt Brahmand) వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పుడు సినిమా సక్సెస్‌తో పాటు లైఫ్‌లోనూ మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేయడానికి సమంత సిద్ధమవడంతో అభిమానులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More