Samantha Raj Tirumala Visit: తిరుమలలో సమంత - రాజ్ నిడిమోరు.. భార్యను జాగ్రత్తగా చూసుకున్న స్టార్ డైరెక్టర్, వీడియో వైరల్

Samantha Raj Tirumala Visit: సమంత రూత్ ప్రభు.. ఆమె భర్త రాజ్ నిడిమోరు గురువారం (జూన్ 18) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. రేపు (జూన్ 19న) సమంత లీడ్ రోల్ లో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Published on: Jun 18, 2026, 14:39:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Raj Tirumala Visit: సమంత లీడ్ రోల్లో నటించి, నిర్మించిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి తిరుమలకు వచ్చిన ఈ జంటకు.. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ జంటకు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Samantha Raj Tirumala Visit: తిరుమలలో సమంత - రాజ్ నిడిమోరు.. భార్యను జాగ్రత్తగా చూసుకున్న స్టార్ డైరెక్టర్, వీడియో వైరల్ (Instagram: Artistrybuzz)
Samantha Raj Tirumala Visit: తిరుమలలో సమంత - రాజ్ నిడిమోరు.. భార్యను జాగ్రత్తగా చూసుకున్న స్టార్ డైరెక్టర్, వీడియో వైరల్ (Instagram: Artistrybuzz)

Raj Protects Samantha from Crowd | జనం మధ్యలో సమంతకు అండగా రాజ్

దర్శనం ముగించుకుని సమంత, రాజ్ నిడిమోరు బయటకు రాగానే.. ఆలయ పరిసరాల్లో ఉన్న వందలాది మంది అభిమానులు, భక్తులు సమంతను చూడటానికి ఒకేసారి ఎగబడ్డారు. కొందరు సెల్ఫీల కోసం పోటీ పడటంతో అక్కడ కాస్త నెట్టుకోవడాలు జరిగాయి.

సాధారణంగా పబ్లిక్ లో అంతగా ఎమోషన్స్ చూపించని రాజ్ నిడిమోరు.. ఆ రద్దీని గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు. జనాల మధ్యలో సమంత నలిగిపోకుండా ఆమె భుజాలపై చేతులు వేసి ఎంతో సురక్షితంగా పట్టుకుని ముందుకు నడిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన లైక్స్ రాబడుతోంది.

రీసెంట్ గా జరిగిన మా ఇంటి బంగారం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ స్టేజ్ పై సమంతకు 'ఐ లవ్ యూ' చెప్పమని అడిగితే.. నోరు మెదపకుండా ప్రొఫెషనల్ గా వ్యవహరించిన రాజ్.. ఇప్పుడు జనం మధ్యలో భార్యపై చూపించిన ఈ కేరింగ్ చూసి నెటిజన్లు "పర్ఫెక్ట్ హస్బెండ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో సమంత చాలా ప్రశాంతంగా తోటి భక్తులతో ముచ్చటిస్తూ, వాళ్లకు చేతులూపుతూ కనిపించారు.

Maa Inti Bangaram Team at Hills | తిరుమలలో 'మా ఇంటి బంగారం' చిత్ర యూనిట్

ఈ శ్రీవారి దర్శనంలో సమంత దంపతులతో పాటు 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) చిత్ర దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి, క్రేజీ బ్యూటీ శ్రీముఖి, ప్రొడ్యూసర్ హిమాంక్ దువ్వురు కూడా ఉన్నారు. దర్శనానంతరం సమంత మీడియాతో మాట్లాడుతూ.. "మా హోమ్ ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. రేపు (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్రేక్షకులను బాగా అలరించాలని శ్రీవారిని ప్రార్థించాం" అని చెప్పారు.

ఈ సినిమాలో సమంత ఒక సాదాసీదా హౌస్‌వైఫ్ పాత్రలో కనిపిస్తుండగా.. తన కుటుంబానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఆమె తన పాత పవర్‌ఫుల్ వైలెంట్ బ్యాక్‌గ్రౌండ్ ను ఎలా బయటకు తీసింది అనే పాయింట్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడై.. రిలీజ్ కు ముందే మొత్తం పెట్టుబడి వచ్చేసి మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు.

హెచ్‌టీ విశ్లేషణ

సమంతకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లేడీ ఫ్యాన్ బేస్ అమోఘం. 'ఓ బేబీ' తర్వాత నందినీ రెడ్డితో వస్తున్న సినిమా కావడం, రాజ్ నిడిమోరు దీనికి క్రియేటర్ గా స్క్రిప్ట్ వర్క్ బాధ్యతలు చూసుకోవడం సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా యూఎస్ లో కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More