Samantha Vijay: దీని కోసమే విజయ్ పుట్టారని నాకు అప్పుడే అనిపించింది: సమంత ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Samantha Vijay: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. తమిళనాడు సీఎం, కోలీవుడ్ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ ని చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన సామ్.. సీఎం విజయ్ తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
Samantha Vijay: స్టార్ నటి సమంత లీడ్ రోల్ లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) జూన్ 19న (ఈ శుక్రవారం) గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత బుధవారం (జూన్ 17) చెన్నైలో సందడి చేశారు.

ఈ టూర్ లో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'తేరి' (Theri), 'కత్తి', 'మెర్సల్' లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆయన కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు
సీఎం విజయ్ తో దిగిన రెండు బ్యూటిఫుల్ ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు. మొదటి ఫోటోలో ఇద్దరూ పక్కపక్కనే నిలబడి చిరునవ్వుతో పోజులివ్వగా.. రెండో ఫోటోలో ఇద్దరూ ఎంతో హ్యాపీగా ముచ్చటిస్తూ కనిపించారు. ఈ ఫోటోలతో పాటు సమంత ఒక లాంగ్ నోట్ రాసుకొచ్చారు.
"ఈరోజు నేను చెన్నైలో ల్యాండ్ అవ్వగానే నాలో ఒక చెప్పలేనంత సంతోషం కలిగింది. ఎందుకంటే నేను మన సీఎం గారిని కలవడానికి వెళ్తున్నాను. విజయ్ సర్ కేవలం వెండితెరపై మాత్రమే హీరోగా ఉండిపోయే వ్యక్తి కాదని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఆయన ఎనర్జీ, ఆయన ప్రెజెన్స్, జనాలు ఆయనకు ఇచ్చే రెస్పాన్స్ చూస్తే.. ఆయన జీవితంలో ఇంతకంటే పెద్ద స్థానానికి (సమాజ సేవకు) చేరుకోవడానికి పుట్టారని నాకనిపించేది" అని సమంత పేర్కొన్నారు.
కొత్త రంగంలోకి అడుగుపెట్టే ధైర్యం!
విజయ్ రాజకీయ ప్రయాణం గురించి సామ్ ప్రశంసలు కురిపిస్తూ.. "ఒక నటుడిగా ఇప్పటికే అపారమైన పట్టు సాధించిన రంగాన్ని వదిలేసి.. ఎంతో రిస్క్, సవాళ్లతో కూడుకున్న ఒక సరికొత్త రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంత ధైర్యం కావాలో, అదే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఇది సులువైన పని అని కాదు.. సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురాగలననే నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు" అని కొనియాడారు.
"మన జీవితంలో ఏదో ఒక దశలో మన పరిధులు దాటి సమాజానికి ఏం ఇవ్వగలమని ఆలోచించాల్సి వస్తుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపునకు సమాధానం ఇస్తారు. విజయ్ సర్ తనను నమ్మిన వాళ్లందరినీ భవిష్యత్తులో ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తారనే నమ్మకం నాకుంది. అది ఆయనకున్న కుర్చీ వల్ల కాదు, సమాజంపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ వల్లే సాధ్యమవుతుంది. విజయ్ సర్ ఈ కొత్త ప్రయాణంలో విజయవంతంగా ముందుకు సాగడానికి అవసరమైన శక్తి, వివేకం, ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను" అని సమంత ఎమోషనల్ గా విష్ చేశారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్ లీగ్ లోకి విజయ్
ఏపీ, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించిన లెజెండరీ నటులు ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత లాంటి ఐకానిక్ లీడర్స్ లీగ్ లోకి ఇప్పుడు దళపతి విజయ్ కూడా చేరిపోయారు. ఫిబ్రవరి 2024 లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని అనౌన్స్ చేసిన విజయ్.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) ప్రస్తుతం సెన్సార్ క్లియరెన్స్ కోసం వెయిటింగ్ లో ఉంది.
మరోవైపు సమంతకు 2023 లో వచ్చిన 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాల తర్వాత వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ 'మా ఇంటి బంగారం' కావడం విశేషం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతే స్వయంగా నిర్మించిన ఈ పవర్‌ఫుల్ ఫ్యామిలీ డ్రామా జూన్ 19న విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


