శ్రీదేవితో నాకు ఎలాంటి గొడవ లేదు.. చాలా గౌరవించుకునే వాళ్లం: మాధురీ దీక్షిత్

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ దివంగత నటి శ్రీదేవితో తనకున్న బంధం గురించి స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, మనస్ఫర్ధలు ఉండేవి కావని ఆమె స్పష్టం చేసింది. ఈ మధ్యే మిసెస్ దేశ్‌పాండే అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మాధురి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Published on: Dec 22, 2025, 22:07:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1990వ దశకంలో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండేదని అప్పట్లో విపరీతమైన రూమర్స్ ఉండేవి. ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ వార్తలపై మాధురీ దీక్షిత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.

శ్రీదేవితో నాకు ఎలాంటి గొడవ లేదు.. చాలా గౌరవించుకునే వాళ్లం: మాధురీ దీక్షిత్
శ్రీదేవితో నాకు ఎలాంటి గొడవ లేదు.. చాలా గౌరవించుకునే వాళ్లం: మాధురీ దీక్షిత్

శ్రీదేవితో పోటీపై మాధురి ఏమన్నదంటే?

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య గట్టి పోటీ ఉండేది. వీరిద్దరి మధ్య మాటలు లేవని ప్రచారం జరిగేది. తాజాగా 'జూమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీ దీనిపై స్పందించింది.

"మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోవడానికి అసలు కారణమే లేదు. ఆమె తన కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకి వచ్చారు.. నేను కూడా అంతే కష్టపడ్డాను. మా ఇద్దరికీ ఆ విషయం (కష్టం విలువ) బాగా తెలుసు. అందుకే మా మధ్య గౌరవం ఎప్పుడూ ఉండేది" అని మాధురీ చెప్పుకొచ్చింది. తమ మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెపపింది.

శ్రీదేవి పాత్రను మాధురీ చేసినప్పుడు..

వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవనడానికి ఒక ఉదాహరణ 'కళంక్' (Kalank) సినిమా. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో మొదట శ్రీదేవి ఒక కీలక పాత్ర చేయాల్సి ఉంది. కానీ 2018లో శ్రీదేవి అకాల మరణంతో.. ఆ పాత్రను మాధురీ దీక్షిత్ పోషించింది.

అప్పట్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ స్పందిస్తూ.. "ఈ సినిమా అమ్మ మనసుకు చాలా దగ్గరైనది. అమ్మ లేని లోటును తీరుస్తూ ఈ పాత్ర చేస్తున్నందుకు మాధురీ గారికి మా నాన్న (బోనీ కపూర్), ఖుషీ, నేను రుణపడి ఉంటాం" అని ఎమోషనల్ అయింది.

మాధురీ లేటెస్ట్ వెబ్ సిరీస్

మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 'మిసెస్ దేశ్‌పాండే' (Mrs. Deshpande) అనే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె జైలు ఖైదీగా నటిస్తూ, ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు సహాయం చేసే పాత్రలో కనిపించింది. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అతిలోక సుందరి శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తెలుగుతోపాటు 1990ల్లో బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చివరిగా మామ్ అనే సినిమాలో కనిపించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More