Monalisa: కేరళ పోలీస్ స్టేషన్‌లో కుంభమేళ సెన్సేషన్ మోనాలిసా.. ముస్లిం వ్యక్తితో పెళ్లి.. రక్షణ కావాలంటూ..

Monalisa: మహా కుంభమేళాలో కనిపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోనాలిసా పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ పోలీస్ స్టేషన్ లో కావడం విశేషం. ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. తనకు రక్షణ కావాలని అడగడం గమనార్హం.

Published on: Mar 11, 2026, 20:03:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండోర్ అమ్మాయి మోనాలిసా భోంస్లే (మోనీ) ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుంది. తన ప్రియుడు, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె బుధవారం (మార్చి 11) కేరళలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. భిన్న మతాలకు చెందిన వీరి వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Monalisa: కేరళ పోలీస్ స్టేషన్‌లో కుంభమేళ సెన్సేషన్ మోనాలిసా.. ముస్లిం వ్యక్తితో పెళ్లి.. రక్షణ కావాలంటూ..
Monalisa: కేరళ పోలీస్ స్టేషన్‌లో కుంభమేళ సెన్సేషన్ మోనాలిసా.. ముస్లిం వ్యక్తితో పెళ్లి.. రక్షణ కావాలంటూ..

ఫేస్‌బుక్ స్నేహం.. కేరళలో పెళ్లి

మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌లకు ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

మోనాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే ఆమెను వేరే వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మలయాళ మూవీ 'నాగమ్మ' షూటింగ్ కోసం కేరళ వచ్చినప్పుడు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు.

దీంతో ఈ జంట రక్షణ కోసం కేరళ పోలీసులను ఆశ్రయించింది. మోనాలిసా మేజర్ కావడంతో ఆమెకు నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో తిరువనంతపురంలోని అరుమనూర్ ఆలయం వీరి వివాహానికి వేదికైంది.

'ఇదే అసలైన కేరళ స్టోరీ'

ఈ మతాంతర వివాహానికి కేరళ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శివన్‌కుట్టి మాట్లాడుతూ.. "ఇదే అసలైన కేరళ స్టోరీ" అని వ్యాఖ్యానించారు. మతసామరస్యానికి ఈ పెళ్లి ఒక ప్రతీక అని ఎంపీ రహీమ్ పేర్కొంటూ, "పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి.. ఆ స్వర్గమే కేరళ" అని కొనియాడారు.

మోనాలిసా పెళ్లి విశేషాలు

వధువు మోనాలిసా ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, వరుడు ఫర్మాన్ ఖాన్ కేరళ సాంప్రదాయం ప్రకారం తెల్లటి షర్ట్, ముండు (ధోవతి) ధరించాడు. మోనాలిసా ప్రస్తుతం 'నాగమ్మ' అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తనకు సినిమాల ద్వారా వచ్చే స్టార్ డమ్ కంటే ప్రియుడితో పెళ్లే ముఖ్యమని ఆమె అనడం విశేషం. 2025 మహాకుంభమేళాలో ఈమె పూలదండలు అమ్ముతున్న వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ఆమెను సెలబ్రిటీని చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More