పెరుగుతున్న కుంభమేళా మోనాలిసా క్రేజ్- బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ సెక్షన్ ప్రారంభం- శివుడికి ఇష్టమైన దానితో పేరు!
కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మోనాలిసా బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ సెక్షన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మోనాలిసాకు హోటల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది.
కుంభమేళాతో తెగ పాపులర్ అయిన బ్యూటి మోనాలిసా. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. అంతేకాకుండా రోజు రోజుకీ మోనాలిసా క్రేజ్ పెరిగిపోతుంది. ఇటీవల హైదరాబాద్‌లోనూ మోనాలిసా ప్రత్యక్షమైంది.

కుంభమేళా ఫేమ్ మోనాలిసా
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ 'బేల్ ట్రీ హోటల్' తన సేవలను మరింత విస్తరిస్తూ, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని 'కుంభమేళా' ఫేమ్ మోనాలిసా శనివారం (డిసెంబర్ 20) ఉదయం ప్రారంభించింది.
ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం, సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి.
ఆతిథ్యం చాలా బాగున్నాయి
కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం మోనాలిసా మాట్లాడుతూ.. "బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి" అని ప్రశంసించింది.
కొన్ని వంటకాలను పరిశీలించిన మోనాలిసా కిచెన్‌లో తానే స్వయంగా కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అక్కడ చేయబోయే వంటకాల గురించి మాట్లాడుతూ షెఫ్‌ల నైపుణ్యాన్ని అభినందించింది. ఈ సందర్బంగా.. బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి.. హోటల్స్ పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, పరమశివునిపై తనకున్న భక్తి గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.
ప్రధాన కారణం శివుడు
"మేము మా హోటల్‌కు 'బేల్ ట్రీ' (Bael Tree) అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం శివుడు. బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. 'త్రిదళం త్రిగుణాకారం' అంటూ మనం పూజించే ఆ బిల్వ దళాల చెట్టు పేరునే మా సంస్థకు పెట్టుకోవడం మాకు గర్వకారణం" అని రాజారెడ్డి తెలిపారు.
"శివుడు అన్నదాత కూడా. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆ విశ్వేశ్వరుడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము. మా హోటల్స్‌కు వచ్చే ప్రతి కస్టమర్‌కు మేము అందించే భోజనం ఒక ప్రసాదం లాంటిదని, అది వారికి పూర్తి తృప్తిని ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఆ తృప్తిని ఇచ్చే శక్తి ఆ భోలేనాథుడిదే అని నేను నమ్ముతాను" అని రాజారెడ్డి చెప్పారు.
పాజిటివ్ వైబ్రేషన్ ఉంది
"వ్యాపార పరంగా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న బిల్వ వృక్షం పేరును ఎంచుకోవడం వెనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ పేరు విన్నప్పుడల్లా ఆ శివయ్య గుర్తుకు వస్తారు. హోటల్‌కు వచ్చే వారికి కూడా ఆ ప్రశాంతత, పవిత్రత అందాలనేది మా సంకల్పం" అని బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి పేర్కొన్నారు.
"ఏ పని మొదలుపెట్టినా ఆ మహాశివుడి అనుమతి, ఆశీస్సులు ఉండాలి. అందుకే ఈ రోజు ఈ కిచెన్ విభాగాన్ని ప్రారంభించే సమయంలో కూడా మేము ఆయన్నే స్మరించుకున్నాము. శివుడికి ప్రియమైన ఈ 'బేల్ ట్రీ' పేరుతో మేము అందిస్తున్న ఈ సేవలు అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రాజారెడ్డి వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


