హోటల్ గదిలో ఆత్మ.. లైట్ వేయగానే పెద్ద శబ్దంతో మాయం: హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్లు

తమిళ స్టార్ హీరో కార్తి అప్ కమింగ్ మూవీ వా వాతియర్. తెలుగులో ఇది అన్నగారు వస్తారు పేరుతో రిలీజ్ కానుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ షాకింగ్ సంఘటనను ఆమె పంచుకుంది. 

Published on: Dec 7, 2025, 21:43:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్లు చేసింది. తన గదిలో ఆత్మ చూశానని చెప్పింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా వస్తున్న వా వాతియర్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. తెలుగులో ఇది అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతిశెట్టి ఆత్మలతో మాట్లాడే క్యారెక్టర్ ప్లే చేసింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ హీరోయిన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

కృతిశెట్టి (instagram-Krithi Shetty)
కృతిశెట్టి (instagram-Krithi Shetty)

గదిలో ఆత్మ

అన్నగారు వస్తారు మూవీ ప్రమోషన్లలో కృతిశెట్టి బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. ‘‘అన్నగారు వస్తారు మూవీ షూటింగ్ కు ఒక రోజు ముందు రాత్రి అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నా. నాకు ఆత్మ లాంటి ఆకారం కనిపించింది. భయంతో లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ వెంటనే ఆత్మ మాయమైంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు’’ అని కృతిశెట్టి తెలిపింది.

ఆత్మలను నమ్ముతాం

‘‘మేం ఆత్మలను నమ్ముతాం. మేం తుళు జాతికి చెందినవాళ్లం కాబట్టి ఇలాంటి వాటిపై ముందు నుంచే విశ్వాసం ఉంది. మా పూర్వీకులను దేవుళ్లుగా పూజిస్తాం. మమ్మల్ని మా పెద్దలు కాపాడుతారని నమ్ముతాం’’ అని కృతిశెట్టి పేర్కొంది. కృతిశెట్టి కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

రిలీజ్ డేట్

కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ మూవీకి నలన్ కుమార స్వామి డైరెక్టర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్ కిరణ్, నిలగళ్ రవి, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్ తదితరులు నటించారు.

ఉప్పెనతో ఎంట్రీ

17 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కృతిశెట్టి. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఛాన్స్ లు క్యూ కట్టాయి. బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే తదితర సినిమాలు చేసింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. వరుసగా ఫ్లాప్ లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళంలో బిజీ అయిపోయింది కృతిశెట్టి.

అక్కడ ఈ ఏడాది ఏఆర్ఎం సినిమాతో ఎంటర్ టైన్ చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం కార్తితో మూవీ కంప్లీట్ చేసింది. ఇంకా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More