Mahavatar Parshuram: మహావతార్ నరసింహ మేకర్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఈ సారి పరశురామ కథతో.. గూస్ బంప్స్ తెప్పించేలా

Mahavatar Parshuram: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ మేకర్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సారి పరశురామ కథతో మహావతార్ పరశురామను తెరకెక్కిస్తున్నారు. 

Published on: Apr 19, 2026, 14:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahavatar Parshuram: మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. మహావతార్ నరసింహతో సంచలనం క్రియేట్ చేసిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు పరశురాముడి కథతో సినిమాను తీసుకొస్తుంది. ఈ యానిమేటెడ్ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ను ఆదివారం (ఏప్రిల్ 19) రిలీజ్ చేశారు.

మహావతార్ పరశురామ్ పోస్టర్ (x/hombalefilms)
మహావతార్ పరశురామ్ పోస్టర్ (x/hombalefilms)

మహావతార్ పరశురామ్

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న రెండో సినిమా ఏంటో తెలిసిపోయింది. విష్ణు దశావతారాల్లో ఒకటైన పరశురామ అవతారం కథతో ‘మహావతార్ పరశురామ్’ సినిమాను తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు ఇవాళ హోంబలే ఫిల్మ్స్ టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

గూస్ బంప్స్

మహావతార్ పరశురామ్ టైటిల్ మోషన్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. గండ్ర గొడ్డలి చేతబట్టి దుష్ట శిక్షణ చేసే ఉగ్రరూపంలో పరశురాముడి అవతారాన్ని పవర్ ఫుల్ గా చూపించారు. ‘‘ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు పుడతాడు. ఆయన రూలర్ కాదు.. అధర్మాన్ని వ్యతిరేకించే శక్తి. యుగాలుగా సమానత్వాన్ని సాగిస్తున్నాడు’’ అనే క్యాప్షన్ తో పోస్టర్ షేర్ చేశారు.

పరశురామ జయంతి

పరశురామ జయంతి సందర్భంగా ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి అశ్విన్ కుమార్ డైరెక్టర్.

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన హోంబలే ఫిల్మ్స్ విష్ణు దశావతారాల ఆధారంగా యానిమేటెడ్ సినిమాలను నిర్మిస్తోంది. ఈ యూనివర్స్ లో ఇప్పటికే మహావతార్ నరసింహా వచ్చింది. ఇప్పుడు మహావతార్ పరశురామ రాబోతుంది. ఇందులో భాగంగానే ఇతర అవతారాలపై కూడా సినిమాలు లైన్ లో ఉన్నాయి.

మహావతార్ నరసింహా గురించి

మహావతార్ నరసింహా మూవీ జులై 25, 2025న రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియన్స్ మౌత్ టాక్ తో ఈ మూవీ థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయారు.

నరసింహ అవతారం ఆధారంగా వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ సినిమాగా చరిత్ర నమోదు చేసింది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహావతార్ నరసింహ ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. పురాణ గాథలను యానిమేటెడ్ సినిమాల్లాగా చూపించడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More