Varun Tej: చెల్లి ప్రొడ్యూసర్‌గా సినిమా.. మెగా హీరోకు ప్రాక్టీస్‌లో తీవ్ర గాయం.. మోకాలికి సర్జరీ.. హెల్త్ అప్‌డేట్
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సర్జరీ అయింది. అతను నటిస్తున్న 'బరి' సినిమా షూటింగ్ ప్రాక్టీస్‌లో ప్రమాదం జరిగింది. మోకాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ కోలుకుంటున్నట్లు చెల్లి నిహారిక వెల్లడించింది.
Varun Tej: మెగా ఫ్యామిలీ యువ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగింది. అతను ప్రమాదానికి గురయ్యాడు. తన తదుపరి చిత్రం 'బరి' కోసం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. వాలీబాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ గత కొంతకాలంగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మోకాలి ఎముక విరగడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

వరుణ్ తేజ్ కు సర్జరీ
వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అతని చెల్లి నిహారిక కొణిదెల అప్ డేట్ రిలీజ్ చేసింది. "బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా బ్రదర్ వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యుల అతనికి విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని నిహారిక పేర్కొంది.
మెగా ఫ్యాన్స్ టెన్షన్
వరుణ్ గాయపడ్డాడనే వార్త తెలియగానే మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో “త్వరగా కోలుకోవాలి అన్నా” అంటూ పెద్ద ఎత్తున మెసేజ్‌లు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.
బరి గురించి..
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బరి సినిమాను అతని చెల్లి నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. ఇది వాలీబాల్ గేమ్ నేపథ్యంలో సాగే సినిమా. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. దీనికి యధు వంశీ డైరెక్టర్. రీసెంట్ గా ఈ మూవీ పూజ కార్యక్రమం జరిగింది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
కొరియన్ కనకరాజు
వరుణ్ తేజ్ మరోవైపు కొరియన్ కనకరాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్న వరుణ్ తేజ్ సర్జరీ కారణంగా షూటింగ్ గు దూరమయ్యాడు. తిరిగి అతను మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి ఎంత కాలం పడుతుందన్నదానిపై క్లారిటీ లేదు.
వరుణ్ కెరీర్
2014లో 'ముకుంద' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, ఈ 12 ఏళ్ల ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఫిదా', 'తొలిప్రేమ', 'ఎఫ్ 2', 'గని' వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఓ బాబు ఉన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


