Varun Tej: బాబాయ్ రావడమే కిక్కు.. హ్యాపీగా ఉందన్న వరుణ్ తేజ్.. అన్నయ్యతో సినిమా స్పెషల్ అంటూ నిహారిక కామెంట్లు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో థియేటర్లకు రాబోతున్నాడు. వాలీబాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో అతని కొత్త సినిమా ‘బరి’ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ గెస్ట్ గా వచ్చారు. బాబాయ్ పై, సినిమాపై వరుణ్, నిహారిక కామెంట్లు వైరల్ గా మారాయి.

Mar 28, 2026, 12:51:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. చెల్లి నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. వాలీబాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా పేరు ‘బరి’. ఈ రోజు (మార్చి 28) ఈ సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

నిహారిక ప్రొడక్షన్ లో వరుణ్ తేజ్ మూవీ (x)
నిహారిక ప్రొడక్షన్ లో వరుణ్ తేజ్ మూవీ (x)

వరుణ్ తేజ్ కామెంట్లు

బరి సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ గెస్ట్ గా రావడంపై వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బాబాయ్ రావడం కిక్కు అని పేర్కొన్నాడు. ‘‘ఈ సినిమా చాలా స్పెషల్. నిహా (నిహారిక)తో కొలబరేట్ కావడం ఎంతో స్పెషల్. అలాగే యంగ్ డైరెక్టర్ యధు వంశీతో మూవీ చేయడం ఇంకా స్పెషల్. కమిటీ కుర్రాళ్లు చూసినప్పటి నుంచి డైరెక్టర్ ను అడ్మైర్ చేస్తున్నా’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

బాబాయ్ రావడం

‘‘కథ విన్నప్పటి నుంచి ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ బరి మూవీ వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. కల్యాణ్ బాబాయ్ దగ్గరగా నేను, నిహా కలిసి వెళ్లాం. ‘ఏంటీ? వరుణ్ తో సినిమా చేస్తున్నావా?’ అని బాబాయ్ అడిగారు. అవును అని చెప్తే నైస్ అన్నారు. షూటిింగ్ ఈవెంట్ కు రావాలంటే సరేనన్నారు. బాబాయ్ రావడమే కిక్కు’’ అని వరుణ్ తేజ్ తెలిపాడు.

చాలా స్పెషల్

అన్నయ్య వరుణ్ తేజ్ తో చేస్తున్న ఈ సినిమా చాలా స్పెషల్ అని నిహారిక చెప్పింది. ‘‘మా ప్రొడక్షన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. సెకండ్ టైమ్ యధు వంశీతో కొలబరేట్ అవుతున్నా. మాది ఆల్మోస్ట్ సేమ్ టీమ్. నేను చేసిన కమిటీ కుర్రాళ్లు, రాకాస స్పెషల్ అని చెప్పా. అయితే ఇది ఇంకా స్పెషల్ మూవీ. అన్నయ్యతో చేస్తున్నా’’ అని నిహారిక తెలిపింది.

‘‘బరి మూవీ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతుంది. ఈ సారి సంక్రాంతి బరిలో మేం కూడా అఫీషియల్ గా ఉన్నాం. 2027 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది’’ అని నిహారిక పేర్కొంది.

మూడో సినిమా

కమిటీ కుర్రాళ్లు సినిమాతో ప్రొడ్యూసర్ గా నిహారిక తన జర్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత రాకాసను నిర్మించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడేమో అన్నయ్యతో ‘బరి’ని స్టార్ట్ చేసింది. మరోవైపు వరుణ్ తేజ్ హారర్ మూవీ కొరియన్ కనకరాజు సినిమా కూడా చేస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More