Gautham Toxic Review: టాక్సిక్‌కు మహేష్ బాబు కొడుకు గౌతమ్ 0.5 రేటింగ్.. షాకవుతున్న ఫ్యాన్స్

Gautham Toxic Review: యశ్ నటించిన టాక్సిక్ మూవీపై విమర్శల నేపథ్యంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఈ సినిమాకు ఇచ్చిన 0.5 రేటింగ్ షాక్ కు గురి చేస్తోంది. ఈ సినిమాతోపాటు గతంలో గౌతమ్ వివిధ సినిమాలకు ఇచ్చిన రేటింగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 1, 2026, 21:47:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gautham Toxic Review: సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని షేర్ చేసిన మూవీ రేటింగ్స్ ఇప్పుడు టాలీవుడ్ నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ సినీ రివ్యూ ప్లాట్‌ఫామ్ 'లెటర్‌బాక్స్‌డ్' (Letterboxd)లో గౌతమ్ ఐడీ బయటపడటంతో, అతను వేర్వేరు సినిమాలకు ఇచ్చిన రేటింగ్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ భారీ ఆశలతో తీసుకొచ్చిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic)కి గౌతమ్ కేవలం 0.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Gautham Toxic Review: టాక్సిక్‌కు మహేష్ బాబు కొడుకు గౌతమ్ 0.5 రేటింగ్.. షాకవుతున్న ఫ్యాన్స్
Gautham Toxic Review: టాక్సిక్‌కు మహేష్ బాబు కొడుకు గౌతమ్ 0.5 రేటింగ్.. షాకవుతున్న ఫ్యాన్స్

'టాక్సిక్' మూవీకి డిజాస్టర్ రేటింగ్..

ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన యశ్ 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అయితే కంటెంట్ సరిగా లేకపోవడంతో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో గౌతమ్ తన లెటర్‌బాక్స్‌డ్ అకౌంట్‌లో ఈ సినిమాకు అత్యంత దారుణంగా హాఫ్ స్టార్ (0.5 రేటింగ్) మాత్రమే కేటాయించాడు.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' సినిమాకు కూడా గౌతమ్ ఇదే రీతిలో 0.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. స్టార్ హీరోల ఇమేజ్‌తో సంబంధం లేకుండా, కేవలం కంటెంట్ బట్టే రివ్యూలు ఇచ్చే ఫిల్మ్ లవర్‌గా గౌతమ్ ఐడెంటిటీని ఈ రేటింగ్స్ ప్రూవ్ చేస్తున్నాయి.

తండ్రి మహేష్ బాబు సినిమాలపై నిర్మొహమాటంగా విశ్లేషణ

తన తండ్రి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల విషయంలోనూ గౌతమ్ ఎలాంటి పక్షపాతం చూపించలేదు. మహేష్ కెరీర్‌లో ఐకానిక్ హిట్‌గా నిలిచిన 'పోకిరి'తో పాటు వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్ '1: నేనొక్కడినే' సినిమాలకు గౌతమ్ ఫుల్ 5/5 స్టార్స్ ఇచ్చాడు.

అయితే తండ్రి సినిమాలు కదా అని అన్నీ బాగున్నాయని పొగడకుండా, ఫ్లాప్ అయిన 'బ్రహ్మోత్సవం' సినిమాకు కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే 'నిజం', 'వంశీ' సినిమాలకు 2 స్టార్స్ రేటింగ్ ఇచ్చి తన ఓపెన్ మైండ్‌సెట్‌ను చాటుకున్నాడు.

ఇండియన్, హాలీవుడ్ సినిమాలపై గౌతమ్ టేస్ట్ ఇదే

దాదాపు 20 ఏళ్ల వయసున్న గౌతమ్ ఇప్పటివరకు వివిధ భాషలకు చెందిన 400 కంటే ఎక్కువ సినిమాలు చూసినట్లు అతని లెటర్‌బాక్స్‌డ్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. తెలుగు క్లాసిక్ 'బాహుబలి 2', నాని 'జెర్సీ' సినిమాలకు గౌతమ్ 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు. అలాగే హిందీ ఎవర్ గ్రీన్ మూవీ 'షోలే', హాలీవుడ్ హిట్ 'నైవ్స్ అవుట్'లకు కూడా పర్ఫెక్ట్ 5 స్టార్స్ రేటింగ్స్ కేటాయించాడు.

ఇక టాలీవుడ్ హిట్స్ అయిన 'పెళ్లి చూపులు', 'సీతా రామం' సినిమాలకు 4.5 స్టార్స్ ఇవ్వగా, రాజమౌళి విజువల్ వండర్ 'ఈగ' మూవీకి 4 స్టార్స్ ఇచ్చాడు. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ 'కల్కి 2898 AD'కి 2.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురందర్ 1'కి 4 స్టార్స్, 'ధురందర్ 2'కి 3 స్టార్స్ ఇచ్చాడు.

నెటిజన్ల రియాక్షన్.. కొడుకు నిజాయితీకి హాట్సాఫ్

ఈ రేటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తండ్రి సూపర్‌స్టార్ అయినా సరే, సినిమాల విషయంలో గౌతమ్ ఎంత ప్రాక్టికల్‌గా, నిజాయితీగా ఆలోచిస్తున్నాడో చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సినీ వర్గాలలో గౌతమ్‌కు ఉన్న సినిమా పరిజ్ఞానం, గట్ ఫీలింగ్ పై ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. త్వరలోనే న్యూయార్క్ లేదా విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసి, గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనే ఊహాగానాలు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More