Vijay Deverakonda: డబ్బు లేకున్నా మందు తాగినా- ప్రేమలో హార్ట్ బ్రేక్- పెళ్లి చేసుకున్నా- రష్మిక ఎంజాయ్: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పేరు అంటేనే సెన్సేషన్. ఇంకా అతని మాటలు, కామెంట్లు అన్నీ వైరల్ అవుతుంటాయి. తాజాగా రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ స్పీచ్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. తన లైఫ్ లోని రోమాంచకం మూమెంట్స్ గురించి విజయ్ బయటపెట్టాడు. 

Published on: Aug 31, 2026, 09:18:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ మరోసారి వైరల్ గా మారింది. రణబాలి, రౌడీ జనార్ధన్ మూవీ షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో.. చాలా కాలం తర్వాత బయట కనిపించాడు. సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు విజయ్.

డబ్బు లేకున్నా మందు తాగినా- ప్రేమలో హార్ట్ బ్రేక్- పెళ్లి చేసుకున్నా- రష్మిక ఎంజాయ్: విజయ్ దేవరకొండ
డబ్బు లేకున్నా మందు తాగినా- ప్రేమలో హార్ట్ బ్రేక్- పెళ్లి చేసుకున్నా- రష్మిక ఎంజాయ్: విజయ్ దేవరకొండ

రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్

రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తనదైన స్టైల్లో స్పీచ్ తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే యాంకర్.. 2026లో రోమాంచకం (గూస్ బంప్స్) మూమెంట్ ఏది అని అడిగింది. ఈ ప్రశ్నకు విజయ్ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ గా మారింది.

మందు తాగినా

‘‘89 (1989)లో పుట్టినా. అప్పటి నుంచి రోమాంచకమే అసలు. 89 నుంచి ప్రతి ఇయర్ అలాగే. పాకెట్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా మందు తాగినా. ఆ తర్వాత మందు వదిలేసినా. ప్రేమలో పడ్డా. హార్ట్ బ్రేక్ అయింది. పెళ్లి చేసుకున్నా. ఏదైనా రోమాంచకమే. నో కాంప్రమైజ్’’ అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

రష్మిక ఎంజాయ్ చేస్తోందంటూ

రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వదినమ్మ అంటూ రష్మిక మందన్న గురించి విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ అడిగారు. ‘‘వదినమ్మానా.. ఉంది, బాగానే ఉంది. ఇంజూరీ అయింది. రికవరీ అవుతోంది. ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది. రణబాలి వస్తుంది. ఇప్పుడైతే రోమాంచకం సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతుంది’’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

సందీప్ రెడ్డి వంగా గురించి

ఈ ఈవెంట్లో తన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

‘‘డబ్బులు లేనప్పుడు సందీప్, ప్రణయ్ అన్న, ప్రభాకర్ అంకుల్ అంతా పొలం పెట్టి సినిమా తీశారు. సందీప్ మీద నమ్మకంతో తీశారు. సందీప్ నా మీద నమ్మకంతో వాళ్లతో పెట్టించి సినిమా తీశాడు. ఫ్యామిలీ ఆదాయం, భవిష్యత్ మొత్తం ఒకే సినిమాపై పెట్టేసింది’’ అని విజయ్ పేర్కొన్నాడు.

బతికి వేస్ట్

‘‘సందీప్ నా గురించి ఎంతవరకైనా వెళ్లేటోడు. నేనూ సందీప్ గురించి ఎంతవరకైనా వెళ్తా. ఈ ఫంక్షన్ కు వచ్చినందుకు సందీప్ థ్యాంక్స్ అంటున్నాడు. అసలు నువ్వు పిలిచినప్పుడు రాకపోతే బతికి వేస్ట్. నేను అతణ్ని ఎంతో లవ్ చేస్తున్నా’’ అని విజయ్ వెల్లడించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More