Romanchakam Trailer: రాస్తే రామాయణం.. తీస్తే రోమాంచకం.. అదిరిపోయిన సందీప్ రెడ్డి వంగా మూవీ ట్రైలర్
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రోమాంచకం మూవీ ట్రైలర్ వచ్చేసింది. కామెడీ, ఎమోషన్ కలగలసిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో గ్యారెంటీగా హిట్టు కొట్టేలా కనిపిస్తోంది.
Romanchakam Trailer: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పూర్తి డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'భద్రకాళి పిక్చర్స్' బ్యానర్‌పై సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ రోమ్‌కామ్ 'రోమాంచకం' మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

రోమ్‌కామ్ డోస్ పెంచేసిన భద్రకాళి పిక్చర్స్
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి వైలెంట్ యాక్షన్, డార్క్ క్యారెక్టరైజేషన్స్. కానీ ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ చాలా ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.
'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రామిసింగ్ పర్‌ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైన సుమంత్ ప్రభాస్.. ఈ రోమాంచకం చిత్రంలో లీడ్ రోల్ చేశారు. యూత్ ఫేవరెట్ అనంతిక సానిల్‌కుమార్ హీరోయిన్‌గా అలరించబోతోంది. డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. లవ్, హ్యూమర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందించారు.
డేటింగ్ యాప్ స్టార్టప్.. చెన్నై లవ్ స్టోరీ
ఈ సినిమా కాన్సెప్ట్ నేటి యంగ్ జనరేషన్ మైండ్‌సెట్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఉంది. హీరో ఒక డేటింగ్ యాప్ సర్వీస్ ఇచ్చే పక్కా యూత్‌ఫుల్ స్టార్టప్‌ను రన్ చేస్తుంటాడు. ఆ బిజినెస్ రీసెర్చ్ పనిలో భాగంగా చెన్నైకి చెందిన హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌లో పడతాడు.
అయితే హీరో, అతని గ్యాంగ్ చేసే అల్లరి, ఊహించని పరిస్థితుల వల్ల ఎదురయ్యే సమస్యలు కథను తీవ్రమైన ట్విస్టుల వైపు తీసుకెళ్తాయి. హీరో, హీరోయిన్ మధ్య ఉండే విభేదాలు, ఫన్నీ ఎపిసోడ్స్ ఆడియన్స్‌కు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ ఇస్తున్నాయి. ఇక చివర్లో తన స్టోరీ రాస్తే రామాయణం, తీస్తే రోమాంచకం అని హీరో క్యారెక్టర్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
రక్తం చిందించే ఫార్ములాను పక్కన పెట్టి..
ఇప్పటివరకు భద్రకాళి పిక్చర్స్ అందించిన ప్రతీ సినిమా ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సినిమాల్లో రక్తం ఏరులై పారే యాక్షన్ కామన్ ఎలిమెంట్. కానీ ఈసారి పూర్తిగా క్లీన్ అండ్ హ్యాపీ యూత్‌ఫుల్ రోమ్‌కామ్ ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
కలర్‌ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్, క్యాచీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి పెద్ద ప్లస్ కానున్నాయి. పక్కా లోకల్ కామెడీ టైమింగ్, యూత్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్స్ పైకి..
ఈ ఫ్రెష్ కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఎక్కడా తగ్గకుండా ఫుల్ ఎనర్జీతో రాబోతోంది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరినీ నవ్వించేలా డిజైన్ చేసిన 'రోమాంచకం' థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది.
అన్ని రకాల హంగులతో సిద్ధమైన ఈ మూవీ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ వంగా ప్రెజెంటేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


