Irumudi: ఇరుముడిలొ ఎమోషన్, డివోషన్ రెండూ ఉన్నాయి.. కచ్చితంగా చూడండి: రవితేజ మూవీపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

Irumudi: రవితేజ నటించిన ఇరుముడి మూవీపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. ఇది కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అని, సూపర్ హిట్ ఇచ్చిన రవితేజకు శుభాకాంక్షలు అని చెప్పారు.

Published on: Aug 21, 2026, 17:55:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సినీ ప్రముఖుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది.

Irumudi: ఇరుముడిలొ ఎమోషన్, డివోషన్ రెండూ ఉన్నాయి.. కచ్చితంగా చూడండి: రవితేజ మూవీపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ
Irumudi: ఇరుముడిలొ ఎమోషన్, డివోషన్ రెండూ ఉన్నాయి.. కచ్చితంగా చూడండి: రవితేజ మూవీపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

‘ఇరుముడి’పై సందీప్ వంగా సంచలన ట్వీట్

'యానిమల్', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా 'ఇరుముడి' టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసునూ తాకుతుందని ఆయన కొనియాడారు.

"ఇది స్వచ్ఛమైన ఎమోషన్, డివోషన్ ల వేడుక. మాస్ మహారాజా రవితేజ గారు, బేబీ నక్షత్ర, డైరెక్టర్ శివ నిర్వాణ మనల్ని ఒక మరచిపోలేని ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళ్లారు. ఈ తరంలో ఇరుముడి నిజంగా ఒక అరుదైన, ఓ ప్రత్యేకమైన మూవీ. ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత కూడా ఈ సినిమా మనతో పాటే వస్తుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. సూపర్ హిట్ ఇచ్చినందుకు రవితేజకు శుభాకాంక్షలు" అని సందీప్ ట్వీట్ చేశారు.

శివ నిర్వాణ-రవితేజ కాంబో మ్యాజిక్

'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామాలతో మెప్పించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రవితేజను ఒక సరికొత్త భక్తిరస కాన్సెప్ట్‌లో ఈ ఇరుముడి సినిమాలో చూపించడం విశేషం. స్వామి అయ్యప్ప మాలధారణ, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధం చుట్టూ నడిచే ఈ కథ ప్రేక్షకుల హృదయాలను పిండేస్తోంది.

మాస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజ.. ఈ సినిమాలో పూర్తి భిన్నమైన రోల్‌లో జీవించేశారనే టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రతో ఆయన కాంబినేషన్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ థియేటర్లలో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టిస్తున్నాయి. శివ నిర్వాణ మార్క్ డైరెక్షన్, హృదయానికి హత్తుకునే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

బాక్సాఫీస్ వద్ద పెరిగిన క్రేజ్

సాధారణంగా ఇంటెన్స్, యాక్షన్ కంటెంట్‌ను ఇష్టపడే సందీప్ రెడ్డి వంగా లాంటి మాస్ డైరెక్టర్ కూడా ఈ డివోషనల్ ఎమోషనల్ డ్రామాకు ఫిదా అవ్వడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సందీప్ ఇచ్చిన గ్రాండ్ రివ్యూతో బాక్సాఫీస్ దగ్గర 'ఇరుముడి' కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాతో రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ చేరినట్లయింది. భక్తికి ఎమోషన్ జోడించి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్, అయ్యప్ప స్వామి భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More