...
...
Next Story

నా మాజీ భార్య, మీడియా, పోలీసులే నాపై కుట్ర పన్నారు.. ఇవాళ కోర్టులో అవన్నీ పటాపంచలయ్యాయి: మలయాళ నటుడి కామెంట్స్

మలయాళం నటుడు దిలీప్ కు పెద్ద ఊరట లభించింది. తనపై ఉన్న నటి లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్, ఓ వర్గం మీడియా, కొందరు పోలీసులే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు.

Published on: Dec 8, 2025, 14:39:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ (Dileep) సోమవారం (డిసెంబర్ 8) నిర్దోషిగా విడుదలయ్యాడు. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన దిలీప్.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, "నిజమైన బాధితుడిని" తానేనని వ్యాఖ్యానించాడు.

మంజు వారియర్ వల్లే ఇదంతా..

నా మాజీ భార్య, మీడియా, పోలీసులే నాపై కుట్ర పన్నారు.. ఇవాళ కోర్టులో అవన్నీ పటాపంచలయ్యాయి: మలయాళ నటుడి కామెంట్స్
నా మాజీ భార్య, మీడియా, పోలీసులే నాపై కుట్ర పన్నారు.. ఇవాళ కోర్టులో అవన్నీ పటాపంచలయ్యాయి: మలయాళ నటుడి కామెంట్స్

లైంగిక వేధింపుల కేసులో తాను నిర్దోషిగా తేలిన తర్వాత మలయాళ నటుడు దిలీప్ మీడియాతో మాట్లాడాడు. కోర్టు బయట రిపోర్టర్లతో మాట్లాడుతూ.. తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

"నా కెరీర్, ఇమేజ్, సమాజంలో నాకున్న గౌరవాన్ని దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. అసలు ఈ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని అందరికంటే ముందు చెప్పింది మంజు వారియరే. ఆమె ఆ మాట చెప్పినప్పటి నుంచే నాపై కుట్ర మొదలైంది" అని దిలీప్ ఆరోపించాడు.

అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక 'మహిళా పోలీస్ అధికారిని', కొంతమంది 'క్రిమినల్ పోలీసులను' ఆమె స్వయంగా ఎంచుకుందని దిలీప్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.

పోలీసులు అబద్ధపు కథ అల్లారు

పోలీసులు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీతో కుమ్మక్కై తనపై తప్పుడు కథనాన్ని సృష్టించారని దిలీప్ ఆరోపించాడు. "పోలీసులు ప్రధాన నిందితుడు, అతని జైలు స్నేహితులతో కలిసి నాపై ఒక ఫేక్ స్టోరీని తయారు చేశారు. కొంతమంది మీడియా వాళ్ళ సాయంతో ఆ అబద్ధాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఈ రోజు కోర్టులో ఆ అబద్ధపు కథ బద్దలైంది" అని దిలీప్ అన్నాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, లాయర్లకు, అభిమానులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

అసలు కేసు ఏంటి?

అయితే దీనిపై ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ సోమవారం (డిసెంబర 8) తీర్పునిస్తూ.. ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో సహా ఆరుగురిని దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాలు లేనందున దిలీప్ సహా మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe