Anaswara Rajan Kaaka: చిరంజీవి ‘కాకా’ నుంచి స‌ర్‌ప్రైజ్‌.. అమ్ములు పాపగా మలయాళ బ్యూటీ.. అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ వైరల్

Anaswara Rajan Kaaka: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘కాకా’ నుంచి స‌ర్‌ప్రైజ్‌ వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ పంచుకున్నారు.

Published on: Sep 8, 2026, 12:58:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anaswara Rajan Kaaka: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కాకా’ మూవీ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. మలయాళ చిత్రసీమలో తనదైన నటనతో మెప్పించి తెలుగులో స్పీడ్ పెంచిన హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'కాకా' (Kaaka)లో అనస్వర రాజన్ కీ రోల్ ప్లే చేస్తోంది.

చిరంజీవి ‘కాకా’ నుంచి స‌ర్‌ప్రైజ్‌.. అమ్ములు పాపగా మలయాళ బ్యూటీ.. అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ వైరల్ (x/KaakaMovie)
చిరంజీవి ‘కాకా’ నుంచి స‌ర్‌ప్రైజ్‌.. అమ్ములు పాపగా మలయాళ బ్యూటీ.. అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ వైరల్ (x/KaakaMovie)

అనస్వర రాజన్ బర్త్ డే

మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ బర్త్ డే సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 8) కాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అనస్వర లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంబీబీఎస్ స్టూడెంట్ అమ్ములు

కాకా చిత్రంలో అనస్వర రాజన్ 'అమ్ములు' అనే ఎంబీబీఎస్ విద్యార్థినిగా అమాయకపు హోమ్లీ పాత్రలో కనిపించనుంది. ఇవాళ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె మెడికల్ కోటు, పుస్తకాలతో ఎంతో పద్ధతిగా కనిపించింది. ఈ పోస్టర్ వెనుక భాగంలో మెగాస్టార్ చిరంజీవి షాడో రూపాన్ని డిజైన్ చేయడం విశేషం. ఇది ఆమె పాత్రకు, చిరంజీవి పాత్రకు మధ్య ఉన్న బలమైన తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్‌ను స్పష్టంగా సూచిస్తోంది.

సంక్రాంతి బరిలో

గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ కాకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో అనస్వర రాజన్‌తో పాటు నివేదా పేతురాజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

టాలీవుడ్‌లో అనస్వర స్పీడ్

తెలుగులో ఇప్పటికే వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న అనస్వర రాజన్ చేతిలో కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల సంగీత్ శోభన్‌తో కలిసి నటిస్తున్న తన నాలుగో తెలుగు చిత్రం ‘అంత రాములోరు చూసుకుంటారు’ గ్లింప్స్ కూడా బయటకు వచ్చి మంచి బజ్ తెచ్చుకుంది.

ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన 'కాకా' చిత్రంలో ఎమోషనల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమా అనస్వర రాజన్ కెరీర్ లో కీలకం కానుంది. ఆమె టాలీవుడ్ కెరీర్‌ను కాకా మూవీ మరో స్థాయికి తీసుకెళ్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More