OTT Malayalam: ఓటీటీలోకి తెలుగులో మలయాళ ఫీల్ గుడ్ క్రైమ్ కామెడీ.. తాగుబోతు తండ్రి, అమాయక కొడుకులు.. ఈ వారమే..
OTT Malayalam: మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఫీల్-గుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'అవరాచన్ అండ్ సన్స్' (Avaraachan & Sons) డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
OTT Malayalam: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్నమైన కథలు, మనసును హత్తుకునే హాస్యం, కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగే డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన లేటెస్ట్ మలయాళం ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ 'అవరాచన్ అండ్ సన్స్' (Avaraachan & Sons).

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ , హిందీ డబ్బింగ్ వెర్షన్లలో ఈ చిత్రం ఏకకాలంలో అందుబాటులోకి రానుంది.
5 భాషల్లో స్ట్రీమింగ్: తెలుగు ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్
సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను మొత్తంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీనితో తెలుగు ప్రేక్షకులు నేరుగా తమ సొంత భాషలోనే ఈ ఫీల్-గుడ్ కామెడీని ఆస్వాదించవచ్చు.
దర్శకుడు అమల్ షీలా తంబి (Amal Sheela Thamby) తెరకెక్కించిన ఈ అవరాచన్ అండ్ సన్స్ చిత్రంలో సీనియర్ విలక్షణ నటుడు బిజూ మీనన్ (Biju Menon) లీడ్ రోల్ అయిన 'అవరాచన్' (తండ్రి) గా నటించగా.. శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi), గణపతి (Ganapathy) ఆయన కొడుకులు జైసన్, జైమోన్‌లుగా అలరించారు. అఖిల భార్గవన్, గ్రేస్ ఆంటోనీ, వినయ్ ఫోర్ట్ ఇతర కీలక పాత్రల్లో మెరిసారు.
అవరాచన్ అండ్ సన్స్ స్టోరీ ఏంటంటే?
'అవరాచన్ అండ్ సన్స్' కథ అంతా ఒక బాధ్యత లేని తండ్రి, అతని ప్రవర్తన వల్ల తీవ్ర ఇబ్బందులు పడే ఇద్దరు కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఒక ఆఫీస్ స్కాం వల్ల తండ్రి అవరాచన్ (బిజూ మీనన్) తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, తన అల్లరి చేష్టలతో కొడుకులను ఇరకాటంలో పెడతాడు.
చివరకు కొడుకు పెళ్లి సంబంధం చెడిపోవడానికి కూడా తండ్రే కారణమవుతాడు. ఈ క్రమంలో స్థానికులతో గొడవపడి దాడి నుంచి తప్పించుకోవడానికి అవరాచన్ తన అక్క ఎల్లికుట్టి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తండ్రీకొడుకుల మధ్య దూరం ఎలా తగ్గింది? అనేది నవ్వులు పూయించే సంఘటనలతో తెరకెక్కించారు.
అవరాచన్ అండ్ సన్స్ ఎలా ఉందంటే?
ఈ సినిమాలో బిజూ మీనన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి జీవించారు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన పెద్ద కొడుకుగా శ్రీనాథ్ భాసి, అమాయకపు చిన్న కొడుకుగా గణపతి పోటీపడి నటించారు. కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించే కోడలి పాత్రలో అఖిల భార్గవన్ నటన ఆకట్టుకుంటుంది.
జోసెఫ్ విజేష్‌తో కలిసి దర్శకుడు అమల్ షీలా తంబి రాసుకున్న డైలాగులు, మానవ సంబంధాల విశ్లేషణ సహజంగా ఉంటాయి. సజిత్ పురుషన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకోవడానికి 'అవరాచన్ అండ్ సన్స్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ చాయిస్. శుక్రవారం (అక్టోబర్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


