ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. రబ్బరు తోటలో అమ్మాయి ఆత్మహత్య మిస్టరీ
ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. రబ్బరు తోటలో ఓ అమ్మాయి ఆత్మహత్య చుట్టూ తిరిగే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అప్పట్లో తెలుగులోనూ రిలీజైంది. కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ‘కిర్‌క్కన్’ (Kirkkan) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. రెండున్నరేళ్ల కిందట అంటే 2023 జులైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సన్ నెక్స్ట్ (Sun NXT), ఓటీటీ ప్లే ప్రీమియం వేదికగా జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కిర్‌క్కన్ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రముఖ మలయాళ నటి కని కుస్రుతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చినా కేవలం మలయాళం ఆడియోనే అందుబాటులో ఉంది. నిజానికి అప్పట్లో తెలుగులోనూ రిలీజైనా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఆ వెర్షన్ అందుబాటులోకి రాలేదు.
కిర్‌క్కన్ మూవీ కథేంటంటే?
ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 2005లో కేరళలోని కొట్టాయం జిల్లా సమీపంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక చిన్న గ్రామంలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. మొదట ఇది ఆత్మహత్య అని భావించినా, పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా అది హత్య అని తేలుతుంది. ఆ తర్వాత స్థానిక పోలీసులు జరిపే విచారణ, అందులో బయటపడే షాకింగ్ నిజాలే ఈ సినిమా కథాంశం.
కిర్‌క్కన్ మూవీని జోష్ డైరెక్ట్ చేయగా.. ఇందులో విజయరాఘవన్, సలీం కుమార్, కని కుస్రుతి, జానీ ఆంటోనీ, అనార్కలి మరికార్, అప్పాని శరత్, మీరా వాసుదేవ్, మక్బూల్ సల్మాన్ లాంటి వాళ్లు నటించారు. వీరితో పాటు దాదాపు 25 మంది కొత్త నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ఇతర మలయాళ ఓటీటీ రిలీజ్‌లు..
‘కిర్‌క్కన్’ మూవీతో పాటు ఈ వారం మరికొన్ని మలయాళ సినిమాలు ఓటీటీలో అలరించనున్నాయి. అందులో కలంకావల్ (Kalamkaval) ఒకటి. మమ్ముట్టి విలన్‌గా నటించిన ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక మరో మూవీ భ భ బా జీ5 ఓటీటీలోకి రానుంది. దిలీప్, మోహన్‌లాల్ నటించిన మూవీ ఇది. ఇక ఇత్తిరి నేరమ్, నిధియుమ్ భూతవుమ్ లాంటి మలయాళం మూవీస్ కూడా రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి ‘కిర్‌క్కన్’ కచ్చితంగా ఒక మంచి ఛాయిస్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


