184 సినిమాలు రిలీజైతే.. కేవలం 10 మాత్రమే హిట్.. రెండు బ్లాక్‌బస్టర్లు వచ్చినా కష్టాల్లోనే మలయాళం సినిమా ఇండస్ట్రీ

మలయాళం సినిమా ఇండస్ట్రీలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా ఆ ఇండస్ట్రీ భారీ నష్టాల్లో ఉండటం గమనార్హం. కేవలం 10 సినిమాలు మాత్రమే హిట్స్ గా నిలిచినట్లు అక్కడి ఇండస్ట్రీ పెద్దలు చెప్పడం షాక్ కు గురి చేస్తోంది.

Published on: Dec 23, 2025, 19:42:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం సినిమాలకు తెలుగులో క్రమంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. కానీ అక్కడి ఇండస్ట్రీ మాత్రం నష్టాల ఊబిలో నుంచి బయటపడటం లేదు. 2025లోనూ అక్కడి మూవీ ఇండస్ట్రీ కష్టాలు కొనసాగినట్లు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.

184 సినిమాలు రిలీజైతే.. కేవలం 10 మాత్రమే హిట్.. రెండు బ్లాక్‌బస్టర్లు వచ్చినా కష్టాల్లోనే మలయాళం సినిమా ఇండస్ట్రీ
184 సినిమాలు రిలీజైతే.. కేవలం 10 మాత్రమే హిట్.. రెండు బ్లాక్‌బస్టర్లు వచ్చినా కష్టాల్లోనే మలయాళం సినిమా ఇండస్ట్రీ

బ్లాక్‌బస్టర్లు వచ్చినా తప్పని కష్టాలు

నిజానికి 2025లో మలయాళ సినిమా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. మోహన్‌లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ కూడా బాగానే రాణించాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది విడుదలైన 184 సినిమాల్లో హిట్స్ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దీంతో నిర్మాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు.

కేవలం 10 హిట్సేనా?

మలయాళ చిత్ర పరిశ్రమ 2025లో ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. కానీ తెర వెనుక పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) బయటపెట్టిన గణాంకాలు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తున్నాయి.

ఈ ఏడాది మలయాళంలో మొత్తం 184 సినిమాలు విడుదల కాగా.. అందులో విజయవంతమైనవి 10 కంటే తక్కువే ఉన్నాయి. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం. ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం తక్షణం స్పందించి 'ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్' రద్దు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.

తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో జనవరి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే KSFDC థియేటర్లను బాయ్ కాట్ చేయాలని ఛాంబర్ నిర్ణయించింది. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

2025 టాప్ గ్రాసర్స్

మలయాళం సినిమా ఇండస్ట్రీ గతేడాది కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ ఏడాది కొన్ని బ్లాక్‌బస్టర్లు వచ్చినా ఓవరాల్‌గా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అయితే ఫ్లాపులు ఎన్ని ఉన్నా.. టాప్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో, దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన లోకా: ఛాప్టర్ 1 చంద్ర సినిమా రూ. 303.86 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో 300 కోట్ల క్లబ్‌లో చేరడం ఇదే తొలిసారి.

ఇక మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ఎల్2: ఎంపురాన్ రూ. 266.81 కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. మోహన్‌లాల్ నటించిన మరో మూవీ తుడరుమ్ కూడా రూ. 235.38 కోట్లు వసూలు చేసింది.

అయితే ఈ సినిమాలు తప్ప మిగతా వాటిలో పెద్దగా చెప్పుకోదగిన వసూళ్లు సాధించలేకపోయాయి. చాలా వరకు మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More