ఓటీటీలో అదరగొడుతున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ట్రెండింగ్ నంబర్‌వ‌న్‌గా మ‌మ్ముట్టి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ అదరగొడుతోంది. మమ్ముట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి. 

Published on: Dec 21, 2025, 07:57:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలే వచ్చాయి. కొత్త జోష్ తో ఓటీటీలు సందడి చేస్తున్నాయి. ఇందులో అన్ని భాషల సినిమాలున్నాయి. థ్రిల్లర్లు కూడా వచ్చాయి. ఈ థ్రిల్లర్లలో ఓ మలయాళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. అదే.. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇందులో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు.

ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ (x)
ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ (x)

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఓటీటీ

మమ్ముట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఓటీటీలో సత్తాచాటుతోంది. ఇది జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ డిసెంబర్ 19న ఓటీటీలో రిలీజైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఆడియన్స్ తెగ లైక్ చేస్తున్నారు.

10 నెలల తర్వాత

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ థియేటర్లో రిలీజైన 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జనవరి 23, 2025న థియేటర్లో విడుదలైంది. రూ.8 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కిన ఈ చిత్రం రూ.18 కోట్ల వసూళ్లు రాబట్టింది. 10 నెలల తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రం.

తెలుగులోనూ

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీని తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. ఇందులో మమ్ముట్టితో పాటు గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజి వెంకటేష్ తదితరులు నటించారు.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ స్టోరీ

డొమినిక్ (మమ్ముట్టి) ఓ మాజీ పోలీస్ ఆఫీసర్. పోలీస్ గా రిటైరైన తర్వాత ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. విఘ్నేష్ (గోకుల్ సురేష్) ఏమో డొమినిక్ కు అసిస్టెంట్. డొమినిక్, విఘ్నేష్ కలిసి ఓ లేడీస్ పర్స్ ఓనర్ ను కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు.

ఆ పర్స్ తో పూజ అనే అమ్మాయికి సంబంధం ఉందని కనిపెడతారు. కానీ పూజ కనిపించకుండా పోతుంది. ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేస్తే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా మిస్సింగ్ లిస్ట్ లో చేరతాడు. మరి పూజ, కార్తీక్ కు ఏమైంది? ఆ పర్స్ ఎవరిది? అనేది థ్రిల్ పంచుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More