Malayalam OTT: భారతీయ సినీ పరిశ్రమలో మలయాళ చిత్రాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తక్కువ బడ్జెట్, బలమైన కథాంశంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టడంలో మాలీవుడ్ ముందుంటోంది. ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.331.09 కోట్ల భారీ కలెక్షన్లతో మలయాళ సినీ చరిత్రలోనే ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డు సృష్టించిన చిత్రం 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit).
ఓటీటీలో చూసి.. టీమ్‌ను అభినందించి..

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (VD Satheesan) చూశారు.
సినిమా ముగిసిన వెంటనే ఆయన పరవశించిపోతూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన అరుదైన రివ్యూ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. దర్శకుడు గిరీష్ ఏడీ, నటుడు సంగీత్ ప్రతాప్‌లను ఫోన్లో అభినందించిన సీఎం.. హీరో నివిన్ పౌలీ, హీరోయిన్ మమితా బైజులకు ఫోన్ చేసినా కలవలేదని పేర్కొన్నారు.
"నా బాల్యం గుర్తొచ్చింది.. ఏ ఒక్క క్షణం బోర్ కొట్టలేదు!"
సాధారణంగా సినిమాలకు రివ్యూలు రాయని సీఎం సతీశన్, ఈ సినిమా తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని రాసుకొచ్చారు. "నిరంతరం ఉండే బిజీ షెడ్యూల్ వల్ల నెలకు కనీసం ఒక సినిమా అయినా చూసే నా అలవాటు ఆగిపోయింది. చాలా కాలం విరామం తర్వాత నిన్న రాత్రి నా కూతురు, ఆమె స్నేహితురాలితో కలిసి 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' సినిమాను ఒకే సిట్టింగ్ లో చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు. నా చిన్ననాటి రోజులు, ఆనాటి గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషులు, వారి మధ్య ఉండే నిర్మలమైన అనుబంధాలు, అమాయకపు ప్రేమలు నా కళ్ల ముందు మెదిలాయి" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా.. "నన్ను పూర్తిగా కట్టిపడేసిన చిత్రమిది. సినిమా పూర్తయ్యాక, ఇంత మంచి సినిమాను చూడటానికి నేను ఎందుకు ఇంత సమయం తీసుకున్నానా అనిపించింది. కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, ఒకటి రెండు సీన్లలో కనిపించిన నటులు కూడా తమ నటనతో గుర్తుండిపోయారు. నవ్వించడంతో పాటు కొన్నిచోట్ల మనసును తడిమేలా ఉంది. ఇదొక అద్భుతమైన టీమ్‌వర్క్" అని ప్రశంసల వర్షం కురిపించారు.
హీరో, హీరోయిన్లకు ఫోన్ కలవలేదు
{{/usCountry}}అంతేకాకుండా.. "నన్ను పూర్తిగా కట్టిపడేసిన చిత్రమిది. సినిమా పూర్తయ్యాక, ఇంత మంచి సినిమాను చూడటానికి నేను ఎందుకు ఇంత సమయం తీసుకున్నానా అనిపించింది. కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, ఒకటి రెండు సీన్లలో కనిపించిన నటులు కూడా తమ నటనతో గుర్తుండిపోయారు. నవ్వించడంతో పాటు కొన్నిచోట్ల మనసును తడిమేలా ఉంది. ఇదొక అద్భుతమైన టీమ్‌వర్క్" అని ప్రశంసల వర్షం కురిపించారు.
హీరో, హీరోయిన్లకు ఫోన్ కలవలేదు
{{/usCountry}}సినిమా చూసిన తర్వాత తన అనుభూతిని పంచుకోవడానికి నివిన్ పౌలీ, మమితా బైజులతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు సీఎం వెల్లడించారు.
"నేను సాధారణంగా సినిమాలు చూశాక రివ్యూలు రాయను. కానీ ఈ సినిమా నన్ను ఎంతగానో రీఫ్రెష్ చేయడంతో నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. వెంటనే దర్శకుడు గిరీష్ ఏడీ, నటుడు సంగీత్ ప్రతాప్‌లకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాను. అయితే హీరో నివిన్ పౌలీ, హీరోయిన్ మమితా బైజులకు ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. వీరితో పాటు 'గ్లిక్సన్' పాత్ర చేసిన నటుడు నన్ను బాగా ఆకట్టుకున్నాడు. చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
సీఎం స్వయంగా పోస్ట్ చేసిన ఈ స్పందనపై దర్శకుడు గిరీష్, నివిన్ పౌలీ, మమితా బైజు స్పందిస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
వయసుతో సంబంధం లేని ప్రేమకథ.. బాక్సాఫీస్ సునామీ
'ప్రేమలు' (Premalu) చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఒక కాలేజీ విద్యార్థినికి, వయసులో బాగా పెద్దవాడైన తన పొరుగుంటి వ్యక్తికి మధ్య చిగురించిన విలక్షణమైన ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకుంది. సామాజిక అడ్డంకులు, విమర్శలను దాటుకుంటూ వారి ప్రేమ ఎలా గెలిచిందనేది అత్యంత సహజంగా, హాస్యభరితంగా చూపించారు.
థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీలోనూ అదే స్థాయిలో వ్యూయర్షిప్ సాధిస్తూ డిజిటల్ ప్రేక్షకులనూ అలరిస్తోంది.